ఐర్లాండ్‌తో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. డబ్లిన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో టీ20లో ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. కాగా ఈ సిరీస్‌లో యువ భారత జట్టుకు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
బుమ్రా తన రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక తొలి టీ20కు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఇప్పుడు రెండో టీ20కు కూడా అడ్డు తగిలే అవకాశం ఉంది.
ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో 30-50 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా వర్షం కారణంగా తొలి టీ20లో కేవలం 40 ఓవర్లకు 26.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా నిర్ణయించారు.
తుది జట్లు(అంచనా)
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్
చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ఇదే.. శాంసన్, అశ్విన్‌కు నో ఛాన్స్! తెలుగోడికి చోటు
Comments
Please login to add a commentAdd a comment