IAS Shikha Goel Warned To Be Careful In Wake Of Rains - Sakshi
Sakshi News home page

బీ అలర్ట్‌ ఇలా మాత్రం చేయకండి.. ‘విహారం’లో విషాదం అంటే ఇదే..

Published Tue, Jul 12 2022 6:57 PM | Last Updated on Tue, Jul 12 2022 9:27 PM

Shikha Goel warned To Be Careful In Wake Of Rains - Sakshi

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు, అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా కొందరు సముద్రాలు, నదుల వద్ద ఎంజాయ్‌ చేస్తున్నారు. 

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రదేశాల్లో ఉండటం ఎంత ప్రమాదకరమో ఈ వీడియోనే చెబుతోంది. ఐపీఎస్‌ అధికారిణి షిఖా గోయెల్‌ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వీడియోలో కొందరు సముద్రం ఒడ్డున​ అలలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలో ఓ పెద్ద కెరటం వచ్చి అక్కడున్న వారిని సముద్రంలోకి లాకెళ్లింది. అప్పుడు వారిని ఎవరూ కాపాడలేకపోయారు.

కాగా, ఈ వీడియోకు షిఖా గోయెల్‌.. ‘‘జాగ్రత్తగా ఉండటం కంటే ధైర్యంగా తప్పు చేయడం మంచిది . గొప్ప పశ్చాత్తాపం కంటే కొంచెం జాగ్రత్త మంచిది. ముఖ్యంగా ఇప్పుడు, తీవ్రమైన వర్షపాతం హెచ్చరికల దృష్ట్యా దయచేసి జాగ్రత్తగా ఉండండి’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే, ఈ ఘటన ఒమాన్‌ దేశంలో చోటుచేసుకుంది. సలాలహ్‌ హల్‌ ముగుసెల్‌ బీచ్‌లో 8 మంది భారతీయులు.. కెరటాల్లో కొట్టుకుపోగా.. ముగ్గురిని రక్షించారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. అయితే, వారంతా సెఫ్టీ ఫెన్నింగ్‌ దాటిన కారణంగానే  ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement