Delhi: ఢిల్లీలో భారీ వర్షం.. | Delhi-NCR Weather Update: Rain Thundershowers In Noida Ghaziabad, Details Inside - Sakshi
Sakshi News home page

Delhi Weather Report: ఢిల్లీలో భారీ వర్షం..

Published Sat, Mar 2 2024 8:40 AM | Last Updated on Sat, Mar 2 2024 9:54 AM

Rain Thundershowers in Noida Ghaziabad - Sakshi

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు (శనివారం) ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ సహా ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో ఎడతెగని వర్షం కురుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఉత్తరప్రదేశ్‌లో మార్చి 2 న వర్షం,  వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. లక్నో, బిజ్నోర్, మీరట్, బరేలీ, రాంపూర్, రాయ్ బరేలీ, గోరఖ్‌పూర్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో  జల్లులు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంది.

వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణం చల్లగా మారనుంది. మార్చి 2న పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మెరుపులు, బలమైన గాలులతో పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానాలో గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్చి 2న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement