సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించిన నేపథ్యంలో సోమవారం నుంచే రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా, రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ.. నగరవాసులను అప్రమత్తం చేసింది. ఉద్యోగులు, వాహనదారులు వెంటనే ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. అలాగే, అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది.
Possibility of moderate to heavy rainfall over the city in the next one hour. Citizens may plan their travel accordingly. DRF teams alerted and on field. @KTRTRS @arvindkumar_ias @CommissionrGHMC pic.twitter.com/kSPjjo0rXm
— Director EV&DM, GHMC (@Director_EVDM) June 14, 2022
Comments
Please login to add a commentAdd a comment