
కొలంబో: శ్రీలంక–న్యూజిలాండ్ రెండో టెస్టుకు వర్షం అడ్డంకి తప్పడం లేదు. వాన కారణంగా నాలుగో రోజు ఆదివారం 48 ఓవర్లే పడ్డాయి. ఓవర్‌నైట్ స్కోరు 196/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్... వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ (208 బంతుల్లో 81 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ (75 బంతుల్లో 83 బ్యాటింగ్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధ శతకాలతో 382/5తో నిలిచింది. ఓపెనర్ టామ్ లాథమ్ 154 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు 138 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment