
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ హడలెత్తించింది. ఓవర్‌నైట్ స్కోరు 231/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ 4 వికెట్లకు 585 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక ఎదుట 660 పరుగుల అమేయ లక్ష్యాన్ని పెట్టింది. టామ్ లాథమ్ (176; 17 ఫోర్లు, సిక్స్)...హెన్రీ నికోల్స్ (162 నాటౌట్; 16 ఫోర్లు) భారీ సెంచరీలు నమోదు చేశారు. గ్రాండ్‌హోమ్ (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.
ఈ క్రమంలో టెస్టు ల్లో తక్కువ బంతు ల్లో (28) అర్ధ సెంచరీ చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌గా గ్రాండ్‌హోమ్ రికార్డు నెలకొల్పాడు. టిమ్ సౌతీ (ఇంగ్లండ్‌పై 2008లో; 29 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును గ్రాండ్‌హోమ్ సవరించాడు. 660 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో 2 వికెట్లకు 24 పరుగులు చేసి ఎదురీదుతోంది.
Comments
Please login to add a commentAdd a comment