
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం ప్రిటోరియా క్యాపిటిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 151 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్ విజయభేరి మోగించింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటిల్స్ 103 పరుగులకే కుప్పకూలింది.
డర్బన్ బౌలర్లలో జూనియర్ డలా మూడు వికెట్లతో ప్రిటోరియా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్, ముల్డర్ తలా రెండు వికెట్లు, టోప్లీ, కీమో పాల్ చెరో ఒక్క వికెట్ సాధించారు. ప్రిటోరియా బౌలర్లలో ఈతాన్ బాష్ 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
హెన్రిచ్ క్లాసెన్ సూపర్ సెంచరీ..
ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్.. క్లాసన్ అద్భుతసెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. 44 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు బ్రీట్‌జెక్(21 బంతుల్లో 46), డికాక్(20 బంతుల్లో 43) రాణించారు. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 19 పాయింట్లతో సూపర్ జెయింట్స్ ఐదో స్థానంలో ఉంది.
చదవండి: WPL 2023: ముంబై జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment