SA20 Final Postponed To February 12 Due To Persistent Rain - Sakshi
Sakshi News home page

SA20 2023: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

Published Sat, Feb 11 2023 6:58 PM | Last Updated on Sat, Feb 11 2023 7:09 PM

SA20 Final Postponed To February 12 Due To Persistent Rain - Sakshi

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్. మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌ (SA20) ఇనాగురల్‌ ఎడిషన్‌ (2023) ఫైనల్‌ మ్యాచ్‌ వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా జొహనెస్‌బర్గ్‌ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరగాల్సిన మ్యాచ్‌ను రిజర్వ్‌ డే అయిన రేపటికి (ఫిబ్రవరి 12) వాయిదా వేస్తున్నట్లు లీగ్‌ కమీషనర్‌ గ్రేమ్‌ స్మిత్‌ అధికారికంగా ప్రకటించారు.

ఫైనల్‌ మ్యాచ్‌ రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుందని స్మిత్‌ వెల్లడించారు. స్థానికి వాతావరణ శాఖ ముందస్తు సమాచారం​ మేరకు రేపు వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ (ఐపీఎల్‌) యాజమాన్యం కొనుగోలు చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యంలోని సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ ఫ్రాంచైజీలు తొట్టతొలి ఎస్‌ఏ20 లీగ్‌ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.   

తొలి సెమీఫైనల్లో పార్ల్‌ రాయల్స్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌)ను మట్టికరిపించి క్యాపిటల్స్‌.. రెండో సెమీఫైనల్లో జోబర్గ్‌ సూపర్‌కింగ్స్‌ (చెన్నై సూపర్‌ కింగ్స్‌)పై విజయం సాధించి సన్‌రైజర్స్‌ తుదిపోరుకు అర్హత సాధించాయి. పలు మార్పులు చేర్పుల తర్వాత సన్‌రైజర్స్‌, క్యాపిటల్స్‌ పూర్తి జట్లు ఇలా ఉన్నాయి.

సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌: ఆడమ్‌ రొస్సింగ్టన్‌ (వికెట్‌కీపర్‌), టెంబా బవుమా, జోర్డాన్‌ హెర్మన్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌, జోర్డన్‌ కాక్స్‌, మార్కో జన్సెన్‌, బ్రైడన్‌ కార్స్‌, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, రోల్ఫ్‌ వాన్‌ డెర్‌ మెర్వ్‌, సిసండ మగాలా, జెజె స్మట్స్‌, జేమ్స్‌ ఫుల్లర్‌, అయబెలేల క్వమేన్‌, మెసన్‌ క్రేన్‌, సరల్‌ ఎర్వీ, మార్కస్‌ ఆకెర్మెన్‌, జనైద్‌ దావూద్‌

ప్రిటోరియా క్యాపిటల్స్‌: ఫిలిప్‌ సాల్ట్‌, కుశాల్‌ మెండిస్‌, థెయునిస్‌ డి బ్రూన్‌, రిలీ రొస్సో, కొలిన్‌ ఇంగ్రామ్‌, జేమ్స్‌ నీషమ్‌, ఈథన్‌ బోష్‌, సెనూరన్‌ ముత్తుస్వామి, మిగేల్‌ ప్రిటోరియస్‌, ఆదిల్‌ రషీద్‌, అన్రిచ్‌ నోర్జే, డేరిన్‌ డుపావిల్లోన్‌, జాషువ లిటిల్‌, విల్‌ జాక్స్‌, వేన్‌ పార్నెల్‌, క్లైడ్‌ ఫోర్టిన్‌, కెమరూన్‌ డెల్‌పోర్ట్‌, షాన్‌ ఓన్‌ బర్గ్‌, మార్కో మరియాస్‌, షేన్‌ డాడ్‌స్వెల్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement