IPL 2023: Aiden Markram named new Sunrisers Hyderabad captain - Sakshi
Sakshi News home page

IPL 2023: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త సారధి పేరు ప్రకటన

Published Thu, Feb 23 2023 11:59 AM | Last Updated on Thu, Feb 23 2023 12:09 PM

IPL 2023: Aiden Markram Named As New Sunrisers Hyderabad Captain - Sakshi

Aiden Markram: మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ఇవాళ (ఫిబ్రవరి 23) తమ నూతన సారధి పేరును అధికారికంగా ప్రకటించింది. మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (ఎస్‌ఏ20) తమ సిస్టర్‌ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన సఫారీ ఆటగాడు ఎయిడెన్‌ మార్క్రమ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది. నిరీక్షణకు తెరపడింది.. ఆరెంజ్‌ ఆర్మీ కొత్త కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌కు హలో చెప్పండి అంటూ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. 

కాగా, ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వేలానికి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ ఎం‍పిక అనివార్యం కాగా.. రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ రేసులో మయాంక్‌ అగర్వాల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌లు పోటీ పడగా.. యాజమాన్యం మార్క్రమ్‌ వైపు మొగ్గు చూపింది. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు: ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, సమర్థ్‌ వ్యాస్‌, గ్లెన్ ఫిలిప్స్, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, హ్యారీ బ్రూక్‌, అబ్దుల్ సమద్, నితీశ్‌కుమార్‌ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఉపేంద్ర యాదవ్‌, సన్వీర్‌ సింగ్‌, వివ్రాంత్‌ శర్మ, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, ఉమ్రాన్‌ మాలిక్‌, టి నటరాజన్, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, భువనేశ్వర్‌ ​కుమార్‌, ఆదిల్‌ రషీద్‌, అకీల్‌ హొసేన్‌, మయాంక్‌ డాగర్‌, మయాంక్‌ మార్కండే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement