Ind Vs SA 1st ODI Series: South Africa Predicted Playing XI Against Inida, Check Names List - Sakshi
Sakshi News home page

Ind Vs Sa 1st ODI: భారీ స్కోరుకు అవకాశం.. టాస్‌ గెలిస్తే...

Published Wed, Jan 19 2022 7:17 AM | Last Updated on Wed, Jan 19 2022 11:24 AM

Ind Vs Sa 1st ODI: South Africa Predicted Playing XI Jansen To Debut Pitch Report - Sakshi

Ind Vs Sa Odi Series- 1st ODI: టెస్టు సిరీస్‌లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో టీమిండియాతో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా సన్నద్ధమవుతోంది. జనవరి 19న జరుగనున్న మొదటి మ్యాచ్‌కు ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. కాగా ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన సిరీస్‌లో పలువురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారంతా పునరాగమనం చేస్తున్నారు.

ఇక టీమిండియాతో సిరీస్‌ జరుగుతున్న సమయంలోనే టెస్టుల నుంచి అర్ధాంతరంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన కీపర్‌ డి కాక్‌ వన్డేల కోసం పూర్తి సన్నద్ధతతో వచ్చాడు. సీనియర్లు ఒక్కసారిగా తప్పుకోవడంతో గతంతో పోలిస్తే దక్షిణాఫ్రికా కొంత బలహీనంగా కనిపిస్తున్నా... స్వదేశంలో ఆ జట్టు రికార్డు బాగుంది. పైగా టెస్టు సిరీస్‌లో టీమ్‌ కనబర్చిన పట్టుదల, పోరాటతత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పని భారం తగ్గించేందుకు రబడకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినివ్వగా, మార్కో జాన్సెన్‌ అరంగేట్రం చేయవచ్చు. 

పిచ్, వాతావరణం  
బ్యాటింగ్‌కు బాగా అనుకూల మైదానం. బౌండరీలు చిన్నవి కాబట్టి భారీ స్కోరుకు అవకాశముంది. వర్షం సమస్య లేదు. టాస్‌ గెలిచిన జట్టు సహజంగానే బ్యాటింగ్‌ ఎంచుకుంటుంది.

టీమిండియా వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ప్రకటించిన జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, జన్నెమాన్‌ మలన్, జుబేర్ హంజా, మార్కో జెన్సన్, సిసండా మగాలా, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వేన్ పార్నెల్, ఆండైల్ ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, రాసి వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెన్

తుది జట్టు అంచనా
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌), డి కాక్, మలాన్, మార్క్‌రమ్, డర్‌ డసెన్, మిల్లర్, ఫెలుక్‌వాయో, ప్రిటోరియస్‌/లిండే, మార్కో జాన్సెన్, ఎన్‌గిడి, షంషి.

చదవండి: IPL 2022 Auction: రాహుల్‌తో పాటు ఆసీస్‌ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడి​కి 15 కోట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement