స్టీవ్‌ స్మిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ విజేత వాషింగ్టన్‌ ఫ్రీడం | Major League Cricket 2024: Washington Freedom Beat San Francisco Unicorns In Finals | Sakshi
Sakshi News home page

స్టీవ్‌ స్మిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ విజేత వాషింగ్టన్‌ ఫ్రీడం

Published Mon, Jul 29 2024 9:33 AM | Last Updated on Mon, Jul 29 2024 9:54 AM

Major League Cricket 2024: Washington Freedom Beat San Francisco Unicorns In Finals

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024 ఎడిషన్‌ టైటిల్‌ను వాషింగ్టన్‌ ఫ్రీడం కైవసం చేసుకుంది. ఇవాళ (జులై 29) జరిగిన ఫైనల్లో ఆ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వాషింగ్టన్‌.. స్టీవ్‌ స్మిత్‌ (52 బంతుల్లో 88; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (22 బంతుల్లో 40; ఫోర్‌, 4 సిక్సర్లు) ఆఖర్లో చెలరేగి ఆడాడు. సీజన్‌ ఆధ్యాంతం భీకర ఫామ్‌లో ఉండిన ట్రవిస్‌ హెడ్‌ ఈ మ్యాచ్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు. ఆండ్రియస్‌ గౌస్‌ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్‌), ముక్తార్‌ అహ్మద్‌ (9 బంతుల్లో 19 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించారు. యూనికార్న్స్‌ బౌలర్లలో కమిన్స్‌ 2, హసన్‌ ఖాన్‌, హరీస్‌ రౌఫ్‌, డ్రైస్‌డేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

నిప్పులు చెరిగిన జన్సెన్‌.. రచిన్‌ మాయాజాలం
208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూనికార్న్స్‌ మార్కో జన్సెన్‌ (4-1-28-3), రచిన్‌ రవీంద్ర (4-0-23-3), ఆండ్రూ టై (2-0-12-2), సౌరభ్‌ నేత్రావల్కర్‌ (4-0-33-1), మ్యాక్స్‌వెల్‌ (2-0-14-1) ధాటికి 16 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్‌ ఇన్నింగ్స్‌లో పదో నంబర్‌ ఆటగాడు కార్మీ రౌక్స్‌ చేసిన 20 పరుగులే అత్యధికం. 

జన్సెన్‌, రచిన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి యూనికార్న్స్‌ పతనాన్ని శాశించారు. ఈ ఎడిషన్‌ ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన వాషింగ్టన్‌ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆశించిన ప్రదర్శన కనబర్చి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్‌ టీమ్‌ను స్టీవ్‌ స్మిత్‌ విజయవంతంగా ముందుండి నడిపించాడు. వాషింగ్టన్‌ టీమ్‌కు రికీ పాంటింగ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement