టీ20 వరల్డ్‌కప్-2022 ప్రారంభానికి ముందు అన్ని జట్లను గాయాల సమస్య వేధిస్తుంది. ఇండియా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా.. ఇలా దాదాపు ప్రతి జట్టులో ఎవరో ఒకరు గాయాల బారిన పడుతూనే ఉన్నారు. దీంతో ఆయా జట్లు గాయపడిన వారిని రీప్లేస్ చేసే పనిలో బిజీగా ఉన్నాయి.
తాజాగా ఇంగ్లండ్ జట్టు.. గాయపడి జట్టుకు దూరమైన తమ ప్రధాన పేసర్ రీస్ టాప్లే స్థానాన్ని భర్తీ చేసింది. టాప్లేకు రీప్లేస్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ బౌలర్ టైమాల్ మిల్స్ జట్టులోకి తీసుకొచ్చింది. మిల్స్‌కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం (బీబీఎల్) ఉన్నందున అతన్ని తొలి ప్రాధాన్యత కింద ఎంపిక చేసింది. టైమల్ మిల్స్.. ప్రపంచకప్ కోసం ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు.
కాగా, పాకిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ చేసే సమయంలో టాప్లే గాయపడిన విషయం తెలిసిందే. స్కానింగ్‌లో టాప్లే కాలి మడమ చిట్లినట్లు తేలడంతో అతను జట్టుకు దూరమయ్యాడు. టాప్లే గాయం చాలా తీవ్రమైందని, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, అతనికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని ఈసీబీ తెలిపింది. వరల్డ్‌కప్‌కు ముందు ఆసీస్‌ను స్వదేశంలో 2-0 తేడాతో (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్) మట్టికరిపించి జోరుమీదున్న ఇంగ్లండ్.. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment