లండన్: అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. జట్టులో స్థానం ఆశించిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సహా టెస్ట్ కెప్టెన్ జో రూట్‌లకు సెలెక్షన్ కమిటీ మొండిచెయ్యి చూపింది. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఎలాగైనా పొట్టి ఫార్మాట్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని భావించాడు.
ఇక మానసిక సమస్యలతో బాధపడుతున్న స్టోక్స్.. క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకుని ఇటీవలే జట్టుకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. అయితే ఇంగ్లండ్ సెలెక్షన్ కమిటీ వీరిద్దరిని పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో టైమల్ మిల్స్, ఆల్‌రౌండర్ కోటాలో క్రిస్ వోక్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
చదవండి: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం..
Comments
Please login to add a commentAdd a comment