Ian Morgan
-
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్
ఐర్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ టెక్టార్ చరిత్ర సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన దేశం తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు (722) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఘనత పాల్ స్టిర్లింగ్ పేరిట ఉండేది. 2021 జూన్‌లో స్టిర్లింగ్ 697 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఈ రేటింగ్ పాయింట్లే చాలాకాలం పాటు ఐర్లాండ్ తరఫున అత్యధికంగా కొనసాగాయి. మే 12న బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో (113 బంతుల్లో 140; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) శతక్కొట్టడం ద్వారా స్టిర్లింగ్ రికార్డును బద్దలుకొట్టిన టెక్టార్.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి (7వ ర్యాంక్) కూడా చేరాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా రస్సీ వాన్‌డెర్ డస్సెన్, పాక్ ఫఖర్ జమాన్, పాక్‌కే చెందిన ఇమామ్ ఉల్ హాక్, ఇండియా శుభ్‌మన్ గిల్, ఆసీస్ డేవిడ్ వార్నర్, ఐర్లాండ్ హ్యారీ టెక్టార్, టీమిండియా విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా డికాక్, టీమిండియా రోహిత్ శర్మ టాప్-10లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే ఫలితం తేలకపోగా.. హ్యారీ టెక్టార్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో, మూడో వన్డేలో ఐర్లాండ్ ఓటమిపాలైంది. ఐర్లాండ్.. జూన్, జులై నెలల్లో జింబాబ్వేలో జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, యుఎస్ఏ, యూఏఈ, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ 10 జట్లలోని రెండు జట్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. చదవండి: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు.. ఆ ఇద్దరికి మొండిచెయ్యి
లండన్: అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. జట్టులో స్థానం ఆశించిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సహా టెస్ట్ కెప్టెన్ జో రూట్లకు సెలెక్షన్ కమిటీ మొండిచెయ్యి చూపింది. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఎలాగైనా పొట్టి ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని భావించాడు. ఇక మానసిక సమస్యలతో బాధపడుతున్న స్టోక్స్.. క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకుని ఇటీవలే జట్టుకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. అయితే ఇంగ్లండ్ సెలెక్షన్ కమిటీ వీరిద్దరిని పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో టైమల్ మిల్స్, ఆల్‌రౌండర్ కోటాలో క్రిస్ వోక్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం.. -
రెండో టి20: వ్యూహం మారేనా?
తొలి టి20కి ముందు రోజు రోహిత్ శర్మ, రాహుల్ ఓపెనర్లని కెప్టెన్ ప్రకటన. కానీ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్‌కు విశ్రాంతి... టాప్–5లో నలుగురు బ్యాట్స్‌మెన్ దాదాపు ఒకే తరహా శైలి. తొలి బంతి నుంచి విరుచుకుపడకుండా టి20 అయినా సరే నిలదొక్కుకొని ఆ తర్వాతే పరుగులు చేసే రకం... జట్టులో ముగ్గురు స్పిన్నర్లు, పవర్‌ప్లే స్పెషలిస్ట్‌గా గుర్తింపు ఉన్న వాషింగ్టన్ సుందర్‌కు 12వ ఓవర్లో కానీ బౌలింగ్ ఇవ్వకపోవడం... ఇవన్నీ గత మ్యాచ్‌లో భారత జట్టు ప్రణాళికలు... కొత్తగా ప్రయత్నిస్తున్నామని ఒక్క ఓటమితో ప్రపంచం మునిగిపోదు అని విరాట్ కోహ్లి చెప్పుకోవచ్చు కానీ మ్యాచ్ తుది ఫలితం మాత్రం నిరాశ కలిగించేదే. ఏ మార్పులు చేసినా, ఎలాంటి వ్యూహాలు పన్నినా టీమ్ గెలవడమే అన్నింటికంటే ప్రధానం. ఈ నేపథ్యంలో టీమిండియా ఎలాంటి కొత్త లెక్కలతో రెండో టి20లో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. అహ్మదాబాద్: వరల్డ్‌కప్ జట్టు కోసం అంచనాకు వచ్చేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుందని చెబుతూ బరిలోకి దిగిన భారత్ తొలి టి20 పోరులో ఇంగ్లండ్ చేతిలో తలవంచింది. అయితే ఇప్పుడు ఆ పరాజయం నుంచి కోలుకొని తమ అసలు సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అటు ఇంగ్లండ్ కూడా తమ జోరును కొనసాగించి ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రెండో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రోహిత్ శర్మ వస్తాడా... ‘రోహిత్‌లాంటి స్టార్ ఆటను చూసేందుకు జనం మైదానానికి వస్తారు. టీవీల్లో సిద్ధంగా ఉంటారు. అలాంటిది ఎలాంటి కారణం లేకుండా సరిగ్గా మ్యాచ్‌కు ముందు విశ్రాంతి అంటూ పక్కన కూర్చోపెట్టడంలో అర్థం లేదు’... మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య ఇది. గత మ్యాచ్ పరాజయ కోణంలోనైనా టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మను ఆడిస్తుందా లేక ఈ మ్యాచ్‌లోనూ అదే జట్టును కొనసాగిస్తుందా చూడాలి. బౌలింగ్ విభాగంలో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి ఫలితం రాబట్టడంలో విఫలమైన భారత్ ఒక మార్పు చేసే అవకాశం ఉంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరిని తప్పించి ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి అవకాశం కల్పించవచ్చు. ఇవి మినహా తుది జట్టులో మిగతా ఆటగాళ్లంతా కొనసాగడం ఖాయం. తొలి టి20లో మన టాప్–3 కలిసి చేసిన మొత్తం పరుగులు 5! ఈసారైనా జట్టుకు ఘనమైన ఆరంభం లభిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. టెస్టు సిరీస్‌లో రెండు డకౌట్లు నమోదు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ పోరును కూడా ‘సున్నా’తోనే మొదలు పెట్టాడు. పూర్తిగా ఫామ్ కోల్పోకపోయినా... తన స్థాయికి తగిన ప్రదర్శన అతని నుంచి రావడం లేదనేది మాత్రం వాస్తవం. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ మరోసారి కీలకం కానున్నాడు. టీమ్‌లో ఇద్దరు దూకుడైన ఆటగాళ్లు రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా మెరుపు ప్రదర్శన కనబరిస్తే జట్టుకు తిరుగుండదు. పునరాగమనంలో భువనేశ్వర్ కుమార్ బాగానే బౌలింగ్ చేయగా, శార్దుల్ ఠాకూర్ ఫర్వాలేదనిపించాడు. కొత్త ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు ఈ మ్యాచ్‌లోనూ అవకాశం దక్కకపోవచ్చు. మరో స్పిన్నర్‌కు చోటు ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్‌లాంటి హిట్టర్లు బరిలోకి దిగాల్సిన అవసరం రాకుండానే తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్ ముగించగలిగింది. వారి తుది జట్టును చూస్తే ఒక్క ఆదిల్ రషీద్ మినహా పదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలరు. ఈ మ్యాచ్‌లోనూ దాదాపు అదే టీమ్‌కు అవకాశం ఉంది. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా కనిపిస్తే స్యామ్ కరన్‌కు బదులుగా ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి అవకాశం ఇవ్వాలని ఇంగ్లండ్ యోచిస్తోంది. ప్రధాన స్పిన్నర్ రషీద్ కూడా గత మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు. ధాటిగా ఆడగల ఓపెనర్లు జేసన్ రాయ్, జోస్ బట్లర్ ఆ జట్టుకు పెద్ద బలం. వరల్డ్ నంబర్‌వన్ మలాన్ కూడా చెలరేగగా, టెస్టుల్లో విఫలమైన బెయిర్‌స్టో కూడా ఆకట్టుకున్నాడు. ఇక మోర్గాన్ ఆకాశమే హద్దుగా సిక్సర్లతో చెలరేగిపోగలడు. బౌలింగ్‌లో విఫలమైనా... జట్టులో స్టోక్స్ విలువ అమూల్యం. అన్నింటికి మించి తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఎక్స్‌ప్రెస్ వేగంతో దెబ్బ తీసిన జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ మరోసారి మన బ్యాట్స్‌మెన్ పని పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరు పిచ్‌ను బ్రహ్మాండంగా వాడుకున్నారు. మరోసారి ఇరు వైపుల నుంచి దాదాపు 150 కిలో మీటర్ల వేగంతో వీరు బౌలింగ్ చేస్తే భారత్‌కు అంత సులువు కాదు. తుది జట్టు వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్/రోహిత్ శర్మ, రాహుల్, పంత్, అయ్యర్, పాండ్యా, శార్దుల్, సుందర్/సైనీ, అక్షర్, భువనేశ్వర్, చహల్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, కరన్/అలీ, ఆర్చర్, జోర్డాన్, రషీద్, వుడ్. పిచ్, వాతావరణం మొటెరాలో 11 పిచ్‌లు అందుబాటులో ఉన్నాయి. గత మ్యాచ్ అనుభవాన్ని బట్టి చూస్తే పేస్, బౌన్స్ కాస్త తక్కువగా ఉండి స్పిన్‌కు అనుకూలించే పిచ్ ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బ్యాట్స్‌మెన్ నిలబడితే పరుగులు రావడం కష్టం కాదు. వర్ష సూచన లేదు. -
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
లండన్: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని 16 మంది ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గురువారం ప్రకటించింది. మార్చి 12 నుంచి 20 మధ్య అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లండ్ జట్టు భారత్‌కు బయలుదేరుతుందని ఈసీబీ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇంగ్లీష్ జట్టు మోర్గాన్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్ లాంటి టీ20 స్పెషలిస్టులతో బలంగా ఉంది. ఇరు జట్ల మధ్య మార్చి 12, 14, 16,18, 20 తేదీల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లండ్ టీ20 జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, శామ్ కర్రన్, టామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, టాప్లే, మార్క్ వుడ్. -
ఐపీఎల్లో సి‘రాజ్’
మొహమ్మద్ సిరాజ్... కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు ఐపీఎల్లో అతి చెత్త బౌలర్లలో ఒకడిగా గుర్తింపు... కనీసం 100కు పైగా ఓవర్లు వేసిన 92 మంది బౌలర్లలో అందరికంటే ఎక్కువగా 9.29 ఎకానమీతో అతను పరుగులిచ్చాడు... సోషల్ మీడియాలో అతనిపై లెక్కలేనన్ని ట్రోలింగ్లు... కానీ ఒక అద్భుత స్పెల్ అతడిని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. తన తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అతను తీసిన 3 వికెట్లు బెంగళూరు విజయానికి పునాది వేశాయి. సిరాజ్‌తో పాటు ఇతర బెంగళూరు బౌలర్లు కూడా చెలరేగడంతో నైట్‌రైడర్స్ కుప్పకూలింది. చెత్త బ్యాటింగ్‌తో 84 పరుగులకే పరిమితమై ఓటమికి ఆహ్వానం పలికింది. ఆ తర్వాత సునాయాస విజయాన్ని అందుకున్న కోహ్లి సేన అదనంగా రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకొని రెండో స్థానానికి దూసుకుపోయింది. అబుదాబి: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆట మరింత పదునెక్కింది. గొప్ప బ్యాటింగ్ వనరులున్నా పేలవ బౌలింగ్‌తో పలు మ్యాచ్‌లు చేజార్చుకున్న ఆ జట్టు ఈసారి కేవలం బౌలింగ్ ప్రదర్శనతోనే భారీ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన పోరులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ (3/8) చెలరేగగా, చహల్ (2/15) ఆకట్టుకున్నాడు. అనంతరం బెంగళూరు 13.3 ఓవర్లలో 2 వికెట్లకు 85 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మోర్గాన్ మినహా... కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బ్యాటింగ్ తీరు చూస్తే ఐపీఎల్లో అన్ని చెత్త రికార్డులు ఆ జట్టు తమ పేరిట లిఖించుకునేలా కనిపించింది. సిరాజ్ దెబ్బకు రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రాణా (0), బాంటన్ (10) వెనుదిరగ్గా... సైనీ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ (1) చెత్త షాట్ ఆడి నిష్క్రమించాడు. దినేశ్ కార్తీక్ (4) కూడా చేతులెత్తేయడంతో ఆదుకునే భారం మోర్గాన్‌పై పడింది. నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్న కేకేఆర్ కెప్టెన్ కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి సుందర్ బౌలింగ్‌లో మోర్గాన్ అవుట్ కావడంతో కనీస స్కోరు సాధించాలన్న కోల్‌కతా ఆశలు సన్నగిల్లాయి. చివర్లో ఫెర్గూసన్ (19 నాటౌట్), కుల్దీప్ (12) నిలబడటంతో జట్టు ఆలౌట్ కాకుండా ఉండిపోయింది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆలౌట్ కాకుండా అతి తక్కువ స్కోరు (గతంలో పంజాబ్ 92/8) చేసిన జట్టుగా నిలిచింది. మొత్తంగా కోల్‌కతా ఐపీఎల్లో తమ అత్యల్ప స్కోరు (67)ను దాటగలిగింది. చకచకా... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పడిక్కల్, ఫించ్ తొలి వికెట్‌కు 38 బంతుల్లో 46 పరుగులు జోడించారు. వీరిద్దరు ఒకే స్కోరు వద్ద అవుటైనా... గుర్కీరత్ (26 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు), కోహ్లి (17 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు. ఈ జంట 31 బంతుల్లో 39 పరుగులు జత చేయడంతో మరో 39 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు గెలిచింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ (సి) మోరిస్ (బి) సైనీ 1; త్రిపాఠి (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 1; రాణా (బి) సిరాజ్ 0; బాంటన్ (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 10; కార్తీక్ (ఎల్బీ) (బి) చహల్ 4; మోర్గాన్ (సి) గుర్కీరత్ (బి) సుందర్ 30; కమిన్స్ (సి) పడిక్కల్ (బి) చహల్ 4; కుల్దీప్ (రనౌట్) 12; ఫెర్గూసన్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 84. వికెట్ల పతనం: 1–3; 2–3; 3–3; 4–14; 5–32; 6–40; 7–57; 8–84. బౌలింగ్: మోరిస్ 4–1–16–0; సిరాజ్ 4–2–8–3; సైనీ 3–0–23–1; ఉదాన 1–0–6–0; చహల్ 4–0–15–2; సుందర్ 4–1–14–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పడిక్కల్ (రనౌట్) 25; ఫించ్ (సి) కార్తీక్ (బి) ఫెర్గూసన్ 16; గుర్కీరత్ (నాటౌట్) 21; కోహ్లి (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (13.3 ఓవర్లలో 2 వికెట్లకు) 85. వికెట్ల పతనం: 1–46; 2–46. బౌలింగ్: కమిన్స్ 3–0–18–0; ప్రసిధ్ కృష్ణ 2.3–0–20–0; వరుణ్ చక్రవర్తి 4–0–28–0; ఫెర్గూసన్ 4–0–17–1. కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చిన కోహ్లికి కృతజ్ఞతలు. మేం మైదానంలోకి వెళ్లినప్పుడు ముందుగా దాని గురించి అనుకోలేదు. కానీ సిద్ధంగా ఉండు అని విరాట్ చెప్పాడు. కొత్త బంతితో నేను చాలా సాధన చేస్తున్నాను. అది ఇక్కడ పని చేసింది. రాణాను అవుట్ చేసిన బంతి చాలా బాగా పడింది. –సిరాజ్ కొత్త బంతిని మోరిస్, సుందర్ పంచుకోవాలనేది మొదటి ఆలోచన. కానీ దానిని మార్చి సిరాజ్‌ను ముందుకు తెచ్చాం. ప్రతీది మా ప్రణాళిక ప్రకారమే చేశాం. గత ఏడాది సిరాజ్ అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈసారి నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. దాని ఫలితాలు ఇప్పుడు కనిపించాయి. –కోహ్లి సూపర్ స్పెల్... 0,0,0,0,0,0... 0,0,0,0,0,0... 1,0,0,0,1,0... 1,1,1,1,1,1... నాలుగు ఓవర్లలో సిరాజ్ బౌలింగ్ ప్రదర్శన ఇది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అతను చెలరేగాడు. సిరాజ్ బౌలింగ్ చూస్తుంటే ప్రతీ బంతికి వికెట్ తీస్తాడేమో అనిపించింది. తాను ఆడిన గత మ్యాచ్‌లో గేల్ చితక్కొట్టడంతో 3 ఓవర్లలోనే 0/44 గణాంకాలు నమోదు చేసిన అతడిపై కెప్టెన్ కోహ్లి మళ్లీ నమ్మకముంచాడు. దానిని నిలబెట్టుకుంటూ ఈ హైదరాబాదీ చెలరేగాడు. ఒక్క బౌండరీ కూడా కొట్టే చాన్స్ ఇవ్వకుండా అతను ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. భారీగా పరుగులిస్తాడంటూ తనపై ఉన్న విమర్శలకు అతను ఈ మ్యాచ్‌తో తగిన సమాధానమిచ్చాడు. ఆర్సీబీ తరఫున మూడో ఏడాది ఆడుతున్న అతను ఎట్టకేలకు తన పదునేమిటో చూపించాడు. ఈ సీజన్లో సిరాజ్‌కు ఇప్పటి వరకు కొత్త బంతిని పంచుకునే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో కూడా రెండో ఓవర్ వేసేందుకు సుందర్ సన్నద్ధమవుతుండగా... అతడిని ఆపి సిరాజ్‌కు కోహ్లి బంతిని అప్పగించాడు. చక్కటి స్వింగ్‌తో త్రిపాఠిని దెబ్బ తీసిన అతను తర్వాతి బంతికే రాణాకు క్లీన్‌బౌల్డ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. మరుసటి ఓవర్లో బాంటన్ కూడా సిరాజ్ స్వింగ్‌కు తలవంచాడు. ఈ స్పెల్ తర్వాత విరామం తీసుకున్న అతను మళ్లీ 19వ ఓవర్లో తిరిగొచ్చి అన్నీ సింగిల్స్ ఇచ్చాడు. ఒక దశలో ఐపీఎల్లో అత్యంత పొదుపైన బౌలింగ్ ప్రదర్శన (ఫిడేల్ ఎడ్వర్డ్స్–4 ఓవర్లలో 6 పరుగులు) నమోదు చేసేలా కనిపించినా చివరి ఓవర్‌తో గణాంకాలు కాస్త మారాయి. అయితే లీగ్ చరిత్రలో తొలిసారి రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా అతను గుర్తింపు పొందాడు. ఈ బౌలింగ్ జోరు చూస్తే లీగ్‌లో అతను మరింతగా చెలరేగేందుకు కావాల్సిన జోష్‌ను ఇచ్చిందనడంలో సందేహం లేదు. ► ఐపీఎల్లో ఒక బౌలర్ 2 మెయిడిన్లు వేయడం ఇదే తొలిసారి (సిరాజ్) ► ఐపీఎల్లో ఒక టీమ్ 4 మెయిడిన్లు వేయడం ఇదే తొలిసారి (సిరాజ్ 2, మోరిస్ 1, సుందర్ 1). గతంలో ఏ జట్టూ 2 ఓవర్లకు మించి మెయిడిన్లు వేయలేదు. ► లీగ్‌లో పూర్తి ఓవర్లు ఆడి ఆలౌట్ కాకుండా ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే (84/8) -
ఈ సారథ్యం నాకొద్దు
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ (డీకే) ఐపీఎల్–13 సీజన్ మధ్యలో అనూహ్యంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే అతనీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 2018 నుంచి కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కార్తీక్ కెప్టెన్సీకి బైబై చెబుతూనే నూతన సారథిగా ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్‌ను నియమించాలని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరాడు. అతను కోరినట్లే కోల్‌కతా ఫ్రాంచైజీ మోర్గాన్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో మోర్గాన్ సారథ్యంలోనే ఇంగ్లండ్ విశ్వవిజేత అయ్యింది. ‘బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు... జట్టుకు మరెంతో చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని కార్తీక్ చెప్పినట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. అతని నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని, అయినాసరే తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని టీమ్ సీఈఓ వెంకీ మైసూర్ తెలి పారు. ‘జట్టు గురించే ఆలోచించే కార్తీక్‌లాంటి నాయకుడు ఉండటం మా అదృష్టం. ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు ఎంతో ధైర్యం కావాలి. ఈ సీజన్లో కార్తీక్, మోర్గాన్ కలిసి అద్భుతంగా పనిచేస్తున్నారు. అలాగే మోర్గాన్ సారథిగానూ విజయవంతం కావాలి. ఈ తాజా మార్పువల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఆశిస్తున్నాం. రెండేళ్లుగా జట్టును నడిపించిన కార్తీక్‌కు అభినందనలు’ అని ఆయన తెలిపారు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇంగ్లండ్ క్రికెటర్ ఓ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడు కావడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఇంగ్లండ్‌కే చెందిన కెవిన్ పీటర్సన్ 17 మ్యాచ్‌ల్లో సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 2009లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆరు మ్యాచ్‌ల్లో... 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు 11 మ్యాచ్‌ల్లో పీటర్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
మోర్గాన్ మెరుపులు
సెంచూరియన్: కొండంత లక్ష్యం కళ్ల ముందు ఉన్నా ఇంగ్లండ్ జట్టు అదరలేదు... బెదరలేదు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో (22 బంతుల్లో 57 నాటౌట్; 7 సిక్స్‌లు)... దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (33 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), బవుమా (24 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), డికాక్ (24 బంతుల్లో 35; ఫోర్, 4 సిక్స్‌లు), మిల్లర్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసి గెలుపొందింది. చదవండి: మయాంక్, పంత్ ఫిఫ్టీల ‘ప్రాక్టీస్’ ఓపెనర్ జేసన్ రాయ్ (7; సిక్స్) విఫలమైనా... జోస్ బట్లర్ (29 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెయిర్ స్టో (64; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ అవుటైనా... మోర్గాన్ మిగతా పనిని పూర్తి చేశాడు. మోర్గాన్ ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు ఉండటం విశేషం. 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన మోర్గాన్... గతంలో తన పేరిటే ఉన్న ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ ఫిప్టీ రికార్డును సమం చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా మోర్గాన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో రెండు నెలల దక్షిణాఫ్రికా పర్యటనను ఇంగ్లండ్ ఘనంగా ముగించింది. టెస్టు సిరీస్‌ను 3–1తో, టి20 సిరీస్‌ను 2–1తో గెల్చుకున్న ఇంగ్లండ్... వన్డే సిరీస్‌ను 1–1తో సమం చేసుకుంది. చదవండి: ఇంటా బయట గులాబీ బాట! -
అదృష్టం మా వైపు ఉంది!
లండన్: ప్రపంచ కప్‌ను గెలుచుకున్నామన్న ఆనందం నుంచి తాము ఇంకా బయటకు రాలేకపోతున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పాడు. నాలుగేళ్ల శ్రమకు దక్కిన ఫలితమిదని మ్యాచ్ తర్వాత అతను వ్యాఖ్యానించాడు. ‘మేం గెలుపు గీత దాటడం ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు. నాతో పాటు జట్టు సభ్యులందరూ ఒక ప్రణాళిక ప్రకారం అంకితభావంతో కష్టపడ్డాం. ఈ గెలుపు ప్రయాణం అద్భుతంగా సాగింది. టోర్నీ ఆరంభం నుంచి కూడా మాపై అంచనాలు ఉన్నాయి. వాటిని నిజం చేయడం సంతోషంగా ఉంది’ అని మోర్గాన్ అన్నాడు. బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించిన నిబంధనపై మోర్గాన్ జాగ్రత్తగా స్పందించాడు. ‘ఇప్పుడు అమలు చేసిన పద్ధతి కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే చెప్పండి. అప్పుడు ఈ రెండింటినీ పోల్చి ఏది మెరుగైందో నిర్ణయించవచ్చు. టోర్నీ నిబంధనలు చాలా కాలం క్రితమే రూపొందించారు. వాటిపై మన నియంత్రణ ఉండదు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ స్పష్టీకరించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌పై మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. ‘స్టోక్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను మానవాతీతుడిలా ఆడి జట్టు గెలుపు భారాన్ని సమర్థంగా మోశాడు. బట్లర్ ఔటైన తర్వాత చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో అతను ఇన్నింగ్స్ నడిపించడం అసాధారణం’ అని మోర్గాన్ చెప్పాడు. ‘అల్లా కూడా మాతోనే’... మోర్గాన్ స్వదేశం ఐర్లాండ్ కాగా... అన్ని కలిసి రావడంపై అక్కడ ‘ఐరిష్ లక్’ పేరుతో బాగా ప్రాచుర్యంలో సామెత ఉంది. ‘ఐరిష్ లక్’ వెంట నడిచిందా అంటూ అడిగిన ప్రశ్నపై మోర్గాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘నా సహచరుడు ఆదిల్ రషీద్‌తో మాట్లాడినప్పుడు అల్లా ఈ రోజు మనతో ఉన్నాడని చెప్పాడు. కాబట్టి నేను కూడా అల్లా మా జట్టుకు అండగా నిలిచాడని నమ్ముతున్నా. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో వేర్వేరు సంప్రదాయాలు, నేపథ్యాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. కానీ ఆటకు వచ్చేసరికి అంతా కలిసికట్టుగా ఆడి విజయం సాధించాం’ అని అతను విశ్లేషించాడు. భారత్‌లో జరిగే 2023 ప్రపంచకప్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, ప్రస్తుతం విశ్వ విజేతగా ఆనందాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు మోర్గాన్ చెప్పాడు. 6 కాదు 5 పరుగులు ఇవ్వాల్సింది! ఓవర్‌త్రోపై మాజీ అంపైర్ టఫెల్ అభిప్రాయం లండన్: ఓవర్ త్రో ద్వారా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడం ప్రపంచకప్ ఫైనల్ డ్రామాలో కీలక ఘట్టం. 50వ ఓవర్లో విజయం కోసం ఇంగ్లండ్ 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో బంతికి ఆరు పరుగులు లభించడంతో సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. బౌల్ట్ వేసిన ఫుల్‌టాస్‌ను డీప్ మిడ్‌వికెట్ వైపు కొట్టిన స్టోక్స్ సింగిల్‌ను పూర్తి చేసి రెండో పరుగు కోసం పరుగెత్తాడు. ఫీల్డర్ గప్టిల్ విసిరిన త్రో నేరుగా స్టోక్స్ పరుగెడుతున్న వైపే దూసుకొచ్చినా... అతని బ్యాట్‌కే తగిలి బౌండరీని దాటింది. స్టోక్స్, రషీద్ చేసిన 2 పరుగులతో కలిపి ధర్మసేన దానిని ‘6’గా ప్రకటించాడు. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా అడ్డు రాలేదు కాబట్టి తప్పు లేదు కానీ ఆరు పరుగులు ఇవ్వడాన్ని ప్రఖ్యాత మాజీ అంపైర్ సైమన్ టఫెల్ తప్పు పట్టారు. ‘నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ పిచ్‌పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్‌నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది’ అని టఫెల్ వివరించారు. అయితే తాను అంపైర్‌ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయిందని అన్నారు. ‘స్టోక్స్ పరుగు పూర్తి చేసే స్థితిలో ఉన్నాడని అంపైర్ భావించి ఉండవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం మ్యాచ్‌పై కొంత మేరకు ఉన్నా, తుది ఫలితానికి ఇది మాత్రం కారణం కాదు’ అని టఫెల్ అభిప్రాయపడ్డారు. ‘బౌండరీ’పై విమర్శల బాదుడు! ప్రపంచ కప్ ఫైనల్ ఫలితాన్ని బౌండరీల లెక్కతో తేల్చడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిని అత్యంత చెత్త నిబంధనగా పేర్కొంటూ మాజీ క్రికెటర్లు ఐసీసీపై విరుచుకుపడ్డారు. దీనికంటే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సిందని కొందరు అభిప్రాయ పడగా, ఇలాంటి నిబంధనలు మార్చేయాలని మరికొందరు సూచించారు. ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీ పరంగా చూస్తే 26–17 తేడాతో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ నెగ్గింది. ‘క్రికెట్లో కొన్ని నిబంధనలపై తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ –రోహిత్ శర్మ ‘అద్భుతంగా సాగిన మ్యాచ్‌లో ఫలితాన్ని బౌండరీల తేడాతో నిర్ణయించడం ఏమిటో అర్థం కాలేదు. అతి చెత్త నిబంధన ఇది. ‘టై’గా ప్రకటిస్తే బాగుండేది’ –గౌతం గంభీర్ ‘బౌండరీ నిబంధనకు నేను కూడా మద్దతివ్వను. కానీ రూల్స్ అంటే రూల్సే. ఎట్టకేలకు కప్ గెలిచిన ఇంగ్లండ్‌కు అభినందనలు’ –యువరాజ్ సింగ్ ‘అసలు ఎంత బాగా పని చేస్తున్నారో...అసలు ఐసీసీ అనేదే పెద్ద జోక్’ –స్కాట్ స్టయిరిస్ ‘ఐసీసీ నిబంధన వల్ల ఇంగ్లండ్ కప్ గెలవడం అసలే మాత్రం ఊహించలేనిది. ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తే బాగుండేది’ –బిషన్ సింగ్ బేడి ‘డక్‌వర్త్ లూయిస్ నిబంధన పరుగులు, వికెట్లపై ఆధారపడి ఉంది. కానీ ఫైనల్ ఫలితం మాత్రం బౌండరీల లెక్క ప్రకారం తీసుకుంటారా’ –డీన్ జోన్స్ ‘నా దృష్టిలో ఇలా విజేతను నిర్ణయించడం దుర్మార్గమైన పద్ధతి. ఇది మారాల్సిందే’ –బ్రెట్ లీ ‘చాలా బాధగా ఉంది. మేం మోసపోయినట్లనిపిస్తోంది. పిచ్చి నిబంధన. ఇది కూడా టాస్ వేసి విజేతను నిర్ణయించడంలాంటిదే’ –డియాన్ నాష్ ‘క్రూరత్వం’ –స్టీఫెన్ ఫ్లెమింగ్ -
‘అతిపెద్ద విజయం’పై స్పందించిన కెప్టెన్
బార్బాడాస్: వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్..వన్డే సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 361 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్ ఇంకా ఎనిమిది బంతులు ఉండగానే ఛేదించి ‘అతి పెద్ద’ విజయాన్ని అందుకుంది. ఇది ఇంగ్లండ్ వన్డే క్రికెట్ చరిత్రలో అతి పెద్ద ఛేజింగ్‌గా నమోదైంది. గతంలో ఇంగ్లండ్ ఎప్పుడూ వన్డే ఫార్మాట్లో 350కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. జాసన్ రాయ్(123, జో రూట్(102)ల సెంచరీలకు తోడు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(65) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఏ మాత్రం కష్టపడకుండా ఛేదించింది. దీనిపై మ్యాచ్ తర్వాత మోర్గాన్ మాట్లాడుతూ.. ‘ మా బ్యాటింగ్‌పై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. పెద్ద పెద్ద లక్ష్యాలను ఛేదించే సత్తా మాలో ఉంది. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఆరంభం నుంచి దూకుడుగానే ఆడాం. బ్యాటింగ్‌లో కచ్చితమైన ప్రణాళికలు అమలు చేశాం. జాసన్ రాయ్, రూట్ల ప్రదర్శన నిజంగా అసాధారణం. మేము ఎక్కడ ఒత్తిడిలో పడిన సందర్భం లేదు. ఆది నుంచి కడవరకూ రన్‌రేట్‌ను కాపాడుకుంటూ వచ్చాం. విండీస్ బౌలర్లు ఎంతటి మంచి బంతిని సంధించినా దాన్ని ఫోర్‌గానో, సిక్స్ గానో మలచి వారినే ఒత్తిడిలోకి నెట్టాం’ అని మోర్గాన్ పేర్కొన్నాడు. ఇక్కడ చదవండి: పాక్ క్రికెటర్ రికార్డును బద్దలు కొట్టిన గేల్ -
ఇంగ్లండ్ విజయం
దంబుల్లా: కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (92; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్ (71; 6 ఫోర్లు) అర్ధ శతకాలతో చెలరేగడంతో... శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా... రెండో మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజేతను నిర్ణయించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. వెటరన్ పేసర్ మలింగ (5/44) చెలరేగడంతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మోర్గాన్, రూట్ మినహా మిగతావారు విఫలమయ్యారు. అనంతరం 279 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 29 ఓవర్లలో 140/5తో ఉన్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడటంతో ఆట సాధ్యపడలేదు. అప్పటికి శ్రీలంక డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచింది. ధనంజయ డిసిల్వా (36 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), పెరీరా (44 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో వన్డే బుధవారం జరుగనుంది. -
ఇంగ్లండ్ సిరీస్ ఆశలు సజీవం
నాలుగో వన్డేలో ఆసీస్‌పై గెలుపు లీడ్స్: ఇయాన్ మోర్గాన్ (92 బంతుల్లో 92England team; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ జట్టు సిరీస్ ఆశలను నిలుపుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. చివరి వన్డే రేపు (ఆదివారం) మాంచెస్టర్‌లో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 299 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (64 బంతుల్లో 85; 10 ఫోర్లు; 2 సిక్సర్లు), బెయిలీ (110 బంతుల్లో 75; 6 ఫోర్లు; 1 సిక్స్), మాథ్యూ వేడ్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. విల్లీకి మూడు, ప్లం కెట్, అలీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48.2 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగులు చేసి గెలిచింది. టేలర్ (42 బంతుల్లో 41; 8 ఫోర్లు), స్టోక్స్ (54 బంతుల్లో 41; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కమ్మిన్స్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.