భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన | England And Wales Cricket Board Announces T20 Side For Upcoming India Vs England 5 Match T20 Series | Sakshi
Sakshi News home page

16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన ఈసీబీ

Published Thu, Feb 11 2021 7:57 PM | Last Updated on Thu, Feb 11 2021 8:23 PM

England And Wales Cricket Board Announces T20 Side For Upcoming India Vs England 5 Match T20 Series - Sakshi

భారత్‌తో త్వరలో ప్రారంభంకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని 16 మంది ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్‌ జట్టును ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గురువారం ప్రకటించింది.

లండన్‌: భారత్‌తో ద్వైపాక్షిక​ సిరీస్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని 16 మంది ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్‌ జట్టును ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గురువారం ప్రకటించింది. మార్చి 12 నుంచి 20 మధ్య అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు బయలుదేరుతుందని ఈసీబీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇంగ్లీష్‌ జట్టు మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలన్‌ లాంటి టీ20 స్పెషలిస్టులతో బలంగా ఉంది. ఇరు జట్ల మధ్య మార్చి 12, 14, 16,18, 20 తేదీల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

ఇంగ్లండ్‌ టీ20 జట్టు‌: ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), మొయిన్‌ అలీ, జోఫ్రా ఆర్చర్‌, జానీ బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, శామ్‌ కర్రన్‌, టామ్‌ కర్రన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, అదిల్‌ రషీద్‌, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, టాప్లే, మార్క్‌ వుడ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement