England and Wales Cricket Board
-
ICC: జై షా కీలక ముందడుగు.. చిన్న జట్ల పాలిట శాపం?!
టెస్టు క్రికెట్ మనుగడ కోసం సిరీస్‌లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త తరహా మార్పుల గురించి యోచిస్తోంది. సంప్రదాయ ఫార్మాట్‌పై మరింత ఆసక్తి పెంచేందుకు, ఎక్కువ సంఖ్యలో హోరాహోరీ సమరాలు చూసేందుకు టెస్టులను.. రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని భావిస్తోంది. టెస్టు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడే మూడు ప్రధాన జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో ఒక శ్రేణి... ఇతర జట్లు కలిపి మరో శ్రేణిలో ఉండే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. దీని అమలు, విధివిధానాలపై ఇంకా స్పష్టత లేకున్నా... ఐసీసీ చైర్మన్‌గా జై షా(Jay Shah) ఎంపికయ్యాక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.సీఏ, ఈసీబీ చైర్మన్లతో చర్చలుఈ అంశంపై చర్చించేందుకు ఈ నెలలోనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ మైక్ బెయిర్డ్, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్లతో జై షా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన భవిష్యత్తు పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2027తో ముగుస్తుంది. ఆ తర్వాతి నుంచి కొత్త విధానాన్ని తీసుకురావాలని ఐసీసీ అనుకుంటోంది. తీవ్రంగా వ్యతిరేకించిన చిన్న జట్లునిజానికి ఇలాంటి ప్రతిపాదన 2016లో వచ్చింది. అయితే ఇలా చేస్తే తమ ఆదాయం కోల్పోవడంతో పాటు పెద్ద జట్లతో తలపడే అవకాశం కూడా చేజారుతుందని జింబాబ్వే, బంగ్లాదేశ్ సహా పలు జట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి.ఈ నేపథ్యంలో ఐసీసీ అప్పట్లో ఈ ఆలోచనను పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఇది ముందుకు వచ్చింది. టాప్–3 జట్ల మధ్యే ఎక్కువ మ్యాచ్‌లు చూడాలని అభిమానులు కోరుకుంటారని, ఆ మ్యాచ్‌లే అత్యంత ఆసక్తికరంగా సాగి టెస్టు క్రికెట్ బతికిస్తాయంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri) తదితరులు ఈ తరహా రెండు శ్రేణుల టెస్టు సిరీస్‌లకు గతంలోనే మద్దతు పలికారు. పెద్ద జట్టు, చిన్న జట్టు మధ్య టెస్టులు జరిగితే ఎవరూ పట్టించుకోరని అతను ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్తాన్ టెస్టుల్లో తొలిసారి ఇలా... బులవాయో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు రెండు టెస్టులతో కూడిన ద్వైపాక్షిక సిరీస్‌ను తొలిసారి దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా అవతల తొలి టెస్టు సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో అఫ్గానిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 205/8తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే అదే స్కోరు వద్ద ఆలౌటైంది.కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (103 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆఖరి రోజు ఆటలో 15 బంతులు ఎదుర్కొన్న జింబాబ్వే ఒక్క పరుగు కూడా జత చేయకుండా రెండు వికెట్లను కోల్పోయింది. ఇరు జట్ల మధ్య భారీ స్కోర్లు నమోదైన తొలి టెస్టు చివరకు ‘డ్రా’ కావడంతో... ఈ విజయంతో అఫ్గానిస్తాన్ 1–0తో టెస్టు సిరీస్ చేజిక్కించుకుంది. కెరీర్ బెస్ట్ (7/66) ప్రదర్శన కనబర్చిన స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 48 పరుగులు చేసిన రషీద్, 11 వికెట్లు పడగొట్టాడు. రహమత్ షాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న అఫ్గానిస్తాన్ జట్టు వన్డే సిరీస్‌ను 2–0తో చేజక్కించుకుంది. ఇప్పుడు టెస్టు సిరీస్ కూడా నెగ్గి... పర్యటనను విజయవంతంగా ముగించింది. ఐసీసీ టెస్టు హోదా సాధించిన అనంతరం 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అఫ్గానిస్తాన్... అందులో నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓవరాల్‌గా అఫ్గానిస్తాన్‌కు ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. తటస్థ వేదికగా 2018–19లో ఐర్లాండ్‌తో భారత్‌లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో గెలిచిన అఫ్గానిస్తాన్ తొలి సిరీస్ కైవసం చేసుకోగా... 2019లో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులోనూ నెగ్గి అఫ్గానిస్తాన్ సిరీస్ పట్టేసింది. ఈ రెండు ఆసియాలో జరగ్గా... ఇప్పుడు తొలిసారి జింబాబ్వే గడ్డపై అఫ్గాన్ టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. 2020–21లో అఫ్గానిస్తాన్, జింబాబ్వే మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1–1తో ‘డ్రా’ గా ముగిసింది. చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
ఇంగ్లండ్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కీరన్ పొలార్డ్..
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను నియమించింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ అమెరికా, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న నేపథ్యంలో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. "వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పొలార్డ్ నియమితులయ్యారు. పొలార్డ్‌కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. టీ20 వరల్డ్‌కప్- 2012 విజయంలో పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో 600 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అటువంటి లెజెండరీ క్రికెటర్‌తో ఒప్పందం కుదర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని ఇంగ్లండ్ వెల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పొలార్డ్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే అంతర్జాతీయ స్ధాయిలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఇక 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పొలార్డ్ 15 ఏళ్ల పాటు విండీస్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 123 వన్డేలు, 101 టీ20లు ఆడిన పొలార్డ్.. వరుసగా 2,706, 1569 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 3 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. -
50 ఏళ్ల క్రితమే వరల్డ్‌కప్ కొట్టింది.. ఇప్పటికీ అవార్డులు
ఎనిడ్ బెక్వెల్.. ఇంగ్లీష్ మహిళా క్రికెట్లో తనకంటూ ప్రత్యేక పేజీని రూపొందించుకుంది. ఇంగ్లండ్ మహిళా ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఎనిడ్ బెక్వెల్ ఖాతాలో ఒక వన్డే ప్రపంచకప్ ఉండడం విశేషం. ఇక 1968 నుంచి 1979 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టులతో పాటు 23 వన్డే మ్యాచ్‌లు ఆడింది. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టుల్లో 1078 పరుగులతో పాటు 50 వికెట్లు, 23 వన్డేల్లో 500 పరుగులతో పాటు 25 వికెట్లు పడగొట్టింది. ఇక 1973లో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆమె ప్రదర్శన ఎవరు అంత తేలిగ్గా మరిచిపోలేరు. ఎందుకంటే ఆరోజు జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో రాణించిన బెక్వెల్ సెంచరీతో(118 పరుగులు) మెరిసింది. అనంతరం బౌలింగ్‌లో 12 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్ అనే పదానికి నిర్వచనం చెప్పింది. 1973 వరల్డ్‌కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఎనిడ్ బెక్వెల్.. వరల్డ్‌కప్ సాధించి 50 ఏళ్లు కావొస్తున్నా ఇంకా అవార్డులు అందుకుంటూనే ఉందట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఎంత వరల్డ్‌కప్ గెలిచినా మహా అయితే పొగుడడం తప్పిస్తే ప్రతీ ఏడాది అవార్డులు ఇవ్వడం కుదరదు. కానీ ఎనిడ్ బెక్వెల్ అందుకు మినహాయింపు. 1973 నుంచి చూసుకుంటే గత 50 ఏళ్లుగా ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి 82 ఏళ్ల వయసులోనే మొకాళ్లు సహకరించకపోయినప్పటికి రెగ్యులర్‌గా మైదానంలో క్రికెట్ ఆడుతూనే కనిపిస్తుంది. తాజాగా ఎనిడ్ బెక్వెల్ క్రికెట్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానానికి ఒక హద్దు ఉంటుంది.. కానీ ఎనిడ్ బెక్వెల్ విషయంలో మాత్రం అది తప్పని నిరూపితమైంది. చదవండి: Rishabh Pant: కోలుకోవడానికే ఆరు నెలలు.. ఈ ఏడాది కష్టమే -
'కార్లు కాదు పరిగెత్తడానికి.. రిటైర్మెంట్తోనైనా మేల్కొనండి'
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకు అనూహ్య రిటైర్మెంట్ ప్రకటించడం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 2019 వన్డే వరల్డ్‌కప్ ఇంగ్లండ్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్ ఇలా అర్థంతరంగా వన్డేల నుంచి తప్పుకుంటాడని ఎవరు ఊహించలేదు. అయితే తన రిటైర్మెంట్కు పరోక్షంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్(ఈసీబీ) కారణమంటూ వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఒకరోజు వ్యవధిలో పేర్కొన్నాడు. ''పరిగెత్తడానికి మేము కార్లు కాదు.. నా వన్డే రిటైర్మెంట్తోనైనా మేల్కొంటే మంచిది'' అంటూ ఈసీబీకి పరోక్షంగా చురకలంటించాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్స్ మాట్లాడుతూ..''ఈసీబీ ఆటగాళ్లకు కనీస గ్యాప్ లేకుండా బిజీ షెడ్యూల్ ఉండేలా చేసింది. దీనివల్ల ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత కరువవుతుంది. నా విషయంలో ఇదే జరిగింది. పరిగెత్తడానికి మేము కార్లు కాదు.. కార్లంటే పెట్రోల్ పోస్తే.. ఎంత స్పీడు పెంచితే అంత వేగంగా వెళ్తాయి. కానీ ఇక్కడ మేం మనుషులం. తీరిక లేకుండా క్రికెట్ ఆడితే ఎవరైనా అలసిపోతారు. ఆ సమయంలో రెస్ట్ అవసరం. కానీ విశ్రాంతి లేకుండా పరిగెత్తాలంటే ఎవరి తరం కాదు. ఒక 36 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నేను వెనుదిరిగి చూసుకుంటే గొప్ప ఇన్నింగ్స్‌లు కనబడాలే తప్ప ఉరుకులు పరుగులు కాదు. నా వన్డే రిటైర్మెంట్తోనైనా ఈసీబీ మేల్కొంటే మంచిది'' అంటూ పేర్కొన్నాడు. అంతకముందు వన్డే రిటైర్మెంట్కు గల కారణాన్ని స్టోక్స్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. "మూడు ఫార్మాట్లలో ఆడటం నాకు చాలా కష్టంగా ఉంది.తీరిక లేని షెడ్యూల్ కారణంగా మూడు ఫార్మాట్లలో ఆడటానికి నా శరీరం సహకరించడం లేదు. అదే విధంగా వన్డే ఫార్మాట్లో వంద శాతం న్యాయం చేయలేపోతున్నాను. కాబట్టి నా స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను. అందుకే 11 ఏళ్ల వన్డే కెరీర్‌కు ముగింపు పలకాలి అని అనుకుంటునున్నాను. ఇకపై నా దృష్టింతా టెస్టు క్రికెట్‌పై పెట్టాలని భావిస్తున్నా'' అంటూ రాసుకొచ్చాడు. ఇక టీమిండియాతో సిరీస్ ముగిసిన వెంటనే ఒక్క రోజు వ్యవధిలో సౌతాఫ్రికాతో సిరీస్ మొదలైంది. జూలై నుంచి నవంబర్ వరకు ఇంగ్లండ్ జట్టు తీరిక లేకుండా గడపనుంది సౌతాఫ్రికాతో 3 వన్డేలు, మూడు టెస్టులు, మూడు టి20లు ఆస్ట్రేలియాతో మూడు టి20లు, మూడు వన్డేలు అక్టోబర్- నవంబర్‌లో ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2022 చదవండి: Nasser Hussain: 'ఇలాగే కొనసాగితే.. ఆటగాళ్లకు పిచ్చెక్కడం ఖాయం' Daria Kasatkina: 'నేనొక లెస్బియన్'.. రష్యన్ టెన్నిస్ స్టార్ సంచలన వ్యాఖ్యలు -
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు.. టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్
బర్మింగహమ్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ సహా ఉపఖండం అభిమానుల కొరకు మ్యాచ్‌ను అరగంట ముందుగా ప్రారంభించనున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి జూలై 1న టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు భారత కాలామాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకి( ఇంగ్లండ్ లోకల్ టైం ఉదయం 11 గంటలు) ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా ఈసీబీ మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు మార్చింది. దీని ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు(లోకల్ టైం ఉదయం 10:30 గంటలు) ప్రారంభమై రాత్రి 10 లేదా 10:30 గంటల వరకు జరగనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న టెస్టు మ్యాచ్‌లో రోజు 90 ఓవర్లు ఆట సాధ్యమయ్యేలా ఈసీబీ ప్రణాళికలు రచించిందిఇక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జూలై 7, 9,10 తేదీల్లో మూడు టి20లు.. ఆ తర్వాత జూలై 12,14, 17వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. కాగా రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆదివారం ఉదయం బీసీసీఐ ట్విటర్లో తెలిపింది. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన రోహిత్.. ఆర్‌టీపీసీఆర్‌లోనే పాజిటివ్ వస్తే వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తుంది. దీంతో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ లేదా కోహ్లి, రహానేలలో ఎవరో ఒకరు తుది జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే? IND vs LEIC: షమీని ఎదుర్కోలేక జట్టు మారిన పుజారా.. -
చారిత్రక లార్డ్స్ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది'
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్‌లో లార్డ్స్ స్టేడియానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంగ్లండ్‌లో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు, మేజర్ టోర్నీలు జరిగినా ఫైనల్ మ్యాచ్ మాత్రం లార్డ్స్ స్టేడియంలోనే నిర్వహించడం ఆనవాయితీ. లార్డ్స్ బాల్కనీ నుంచి కప్‌ను అందుకోవడం ప్రతీ జట్టు కెప్టెన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. లార్డ్స్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే పూర్తి సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతుంటారు. అది టెస్టు.. వన్డే.. టి20 ఏదైనా సరే వంద శాతం ప్రేక్షకులు ఉంటారు. అలాంటి పేరున్న లార్డ్స్ స్టేడియానికి మొదటిసారి అవమానం జరిగింది. జూన్ 2న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలిసారి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టెస్టుకు మాత్రం చాలా టికెట్స్ మిగిలిపోయాయి. దీనికి కారణం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) టికెట్స్ ధరలు పెంచడమేనంట. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లార్డ్స్ టెస్టు తొలి నాలుగు రోజులకు 20వేల టికెట్లు మిగిలిపోయినట్లు సమాచారం. బార్మీ ఆర్మీ పేర్కొన్న ప్రకారం ఒక టికెట్‌పై 100 పౌండ్ల నుంచి 160 పౌండ్ల దాకా పెంచడంతో క్రికెట్ ఫ్యాన్స్ టికెట్స్ కొనుగోలు చేయడంపై వెనక్కి తగ్గారు. ఒక టెస్టు మ్యాచ్‌కు అంత టికెట్ ధర ఉంటే ఎలా కొంటామని.. దీనికంటే ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడం బెటర్ అని చాలామంది ఫ్యాన్స్ వాపోయారు. సోమవారం సాయంత్రం వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం.. తొలి రోజున 1800 టికెట్లు, రెండో రోజుకు 2500 టికెట్లు, మూడోరోజుకు 4600 టికెట్లు, నాలుగో రోజుకు 9600 టికెట్లు మిగిలే ఉన్నాయని తేలింది. ఇక జో రూట్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాకా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ఫుల్‌క్రేజ్ వచ్చింది. కాగా లార్డ్స్ స్టేడియంలో టికెట్ల రేట్లు పెంపుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఈసీబీని ట్విటర్ వేదికగా ఎండగట్టాడు. ''చారిత్రాక లార్డ్స్ మైదానానికి ఇది పెద్ద అవమానం. లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ జరుగుతుందంటే తొలిరోజు పూర్తిస్థాయిలో స్టేడియం నిండుతుంది. కానీ తొలిసారి స్టేడియం ఫుల్ కావడం లేదు. ఇది భరించలేకుండా ఉంది. ఒక్కసారిగా టికెట్స్ ధరలు అంత పెంచడంపై ఈసీబీ మర్మమేంటో అర్థం కావడం లేదు. ఒక్క టికెట్‌పై 100 నుంచి 160 పౌండ్లు పెంచడమేంటి.. అంత ధర ఎందుకు? ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి. వారి పేరెంట్స్‌తో కలిసి మ్యాచ్ చూడాలని స్టేడియాలకు వస్తుంటారు. కాబట్టి అమ్ముడపోని టికెట్స్‌ను పిల్లల కోసం ప్రత్యేకంగా టికెట్ ధరను 40 పౌండ్లుగా నిర్ణయించి స్టేడియంను ఫుల్ చేస్తే బాగుంటుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్..! T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి Lords not being full this week is embarrassing for the game .. Try & blame the Jubilee if they want but I guarantee if tickets weren’t £100 - £160 it would be jam packed !!! Why are they so expensive ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 How about working out a way to get the tickets remaining at Lords to kids with a parent for £40 to make sure it is full .. it’s the school holidays and lots of kids will be around to go to the Test match ?? @HomeOfCricket ??? #Lords #ENGvNZ — Michael Vaughan (@MichaelVaughan) May 31, 2022 -
Jason Roy: జేసన్ రాయ్‌కు భారీ షాకిచ్చిన ఈసీబీ.. ఇక
ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు గట్టి షాకిచ్చింది. అతడికి 2500 పౌండ్ల జరిమానా వేయడంతో పాటు రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఈసీబీ తరఫున ది క్రికెట్ డిసిప్లిన్ కమిషన్(సీడీసీ) ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘క్రికెట్ ప్రయోజనాలు, ఈసీబీతో పాటు అతడి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా జేసన్ రాయ్ వ్యవహరించాడు. కాబట్టి ఈసీబీ ఆదేశాల్లోని 3.3 రూల్‌ను ఉల్లంఘించినందుకు గానూ అతడిపై చర్యలు తీసుకునేందుకు సీడీసీ నిర్ణయించింది’’ అని పేర్కొంది. అదే విధంగా రాయ్‌కు విధించిన జరిమానాను మార్చి 31లోగా చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఇందుకు దారి తీసిన ఘటన లేదంటే కారణాన్ని మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. కాగా ఇంగ్లిష్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. జేసన్ రాయ్ గతంలో అనుసరించిన వివక్షపూరిత వైఖరి వల్లే చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్లకు రాయ్‌ను కొనుగోలు చేసింది. అయితే, గత మూడేళ్లుగా బిజీ షెడ్యూల్ కారణంగా తన కుటుంబానికి దూరమయ్యానని, వారికి సమయం కేటాయించలనుకుంటున్నందు వల్ల టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: ఇకపై అలా కుదరదు.. సింగిల్ తీస్తే కానీ.. IPL 2022. pic.twitter.com/fZ0LofBgSE — Jason Roy (@JasonRoy20) March 1, 2022 -
యాషెస్ సిరీస్‌పై మెలిక పెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
England To Decide On Ashes Series This Week: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సిరీస్ సాధ్యాసాధ్యాలపై సోమవారం సమావేశమైన ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఓ మెలిక పెట్టింది. తమ ప్రధాన ఆటగాళ్లు ఉంటేనే సిరీస్ ఆడతామని ప్రకటించింది. ఈ విషయమై జట్టు సభ్యులతో సంప్రదింపులు జరిపి వారంలోగా తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది. కాగా, ఇంగ్లండ్ జట్టులోని కొందరు సీనియర్ సభ్యులు ఆసీస్ పర్యటనకు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులను తమతో పాటు అనుమతిస్తేనే ఆస్ట్రేలియాలో అడుగుపెడతామని వారు ఈసీబీకి స్పష్టం చేశారని సమాచారం. మరోవైపు కోవిడ్ నిబంధనలను సడలించేందుకు ఆసీస్ ప్రభుత్వం సైతం వెనక్కు తగ్గకపోవడంతో సిరీస్ సాధ్యపడడం అనుమానంగా మారింది. కాగా, ఆస్ట్రేలియాలో కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆ దేశంలో పర్యటించేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఈ విషయమై ఇరు దేశాల ప్రధానులు స్కాట్ మోరిసన్(ఆసీస్), బోరిస్ జాన్సన్(యూకే)లు జోక్యం చేసుకున్నప్పటికీ సమస్య కొలిక్కివచ్చినట్లు కనబడలేదు. ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ డిసెంబర్ 18 నుంచి జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: కోహ్లి సేనకు అంత సీన్ లేదు.. మాకు అసలు పోటీనే కాదు: పాక్ మాజీ ప్లేయర్ -
పాపం రాబిన్సన్.. క్షమించమని కోరినా కనికరించలేదు
లండన్: ఎనిమిదేళ్ల క్రితం మిడిమిడి జ్ఞానంతో చేసిన తప్పిదానికి ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్సన్ ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విచారం వ్యక్తం చేశాడు. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 27 ఏళ్ల రాబిన్సన్.. 2013లో సోషల్ మీడియా వేదికగా స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలతో పాటు జాత్యాంహకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతనిపై విచారణ చేపట్టి, అతన్ని తక్షణమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ వ్యవహారంపై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ట్విటర్ వేదికగా ఓలీ రాబిన్సన్కు మద్దతు తెలుపుతూనే.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోని ప్రవర్తించాలని ఈ తరం ఆటగాళ్లను హెచ్చరించాడు. ఈ సందర్భంగా ఆయన ఈసీబీ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రాబిన్సన్ అప్పుడెప్పుడో చేసిన తప్పుకు క్షమించమని కోరినా ఈసీబీ ఇంత కఠినంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టాడు. టెస్ట్ కెరీర్లో అద్భుతమైన ఆరంభం లభించిన ఆటగాడిని ఈ రకంగా శిక్షించడం బాధగా ఉందని వాపోయాడు. ఏదిఏమైనప్పటికీ.. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రస్తుత తరం ఆటగాళ్లకు ఇదో హెచ్చరిక లాంటిదని ట్వీట్ చేశాడు. కాగా, ఓలీ రాబిన్సన్ తన తొలి టెస్ట్‌లో 7 వికెట్లతో పాటు 42 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ డ్రాతో గట్టెక్కింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఓపెనర్ డామినిక్ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్ జో రూట్ (40) పర్వాలేదనిపించాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో అదరగొట్టిన కివీస్ ఆటగాడు డెవాన్ కాన్వేను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. చదవండి: నదాల్‌కు మళ్లీ పెళ్ళా.. ఫేస్బుక్ అప్డేట్ చూసి షాక్ తిన్న అభిమానులు -
ఇంగ్లండ్‌లో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు..
లండన్: కరోనా కారణంగా అర్దంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 నిర్వహణ కోసం భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఖండించింది. అవన్నీ గాలి వార్తలేని కొట్టిపారేసింది. షెడ్యూల్ ప్రకారమే టెస్ట్ సిరీస్ యధావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. దీంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఐపీఎల్ మ్యాచ్‌లు ఇంగ్లండ్‌లో జరుగుతాయని ఆశించిన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. కాగా, అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను వారం ముందుగా ముగించి, ఐపీఎల్ మ్యాచ్‌లు న్విహించాలని బీసీసీఐ భావించినట్లుగా ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆగస్టు 4న మొదలై సెప్టెంబర్ 14న ముగుస్తుంది. అయితే, ఈ సిరీస్‌ను సెప్టెంబర్ 7లోపు ముగించగలిగితే, ఈ మధ్యలో దొరికే మూడు వారాల సమయంలో మిగిలిన 31 ఐపీఎల్ మ్యాచ్‌లను రోజుకు రెండు చొప్పున నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుందనే ప్రచారం సాగింది. ఈ వార్తలను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ కూడా ధృవీకరించాడు. దీంతో ఇంగ్లండ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగడం ఖాయమని అభిమానులు భావించారు. కానీ తాజా పరిణామాలతో వారి ఆశలు అడియాసలుగా మిగిలిపోయేలా కనిపిస్తున్నాయి. -
ఐపీఎల్లో ప్రత్యర్థులు.. అక్కడ మాత్రం మిత్రులు
లండన్: ఆసీస్ విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్.. విండీస్ విధ్వంసం ఆండీ రసెల్ ఒక జట్టుకు ఆడడం ఎప్పుడైనా చూశారా. అంతర్జాతీయంగా వేర్వేరు జట్లకు ఆడే వీరు ఐపీఎల్ సహా ఇతర లీగ్‌ల్లోనూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. అయితే త్వరలోనే వీరు ముగ్గురు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.. కాకపోతే హండ్రెడ్ 2021 టోర్నమెంట్ వరకు ఆగాల్సిందే. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా హండ్రెడ్ 2021 టోర్నమెంట్‌ను నిర్వహించనున్నాయి. వాస్తవానికి గతేడాది జూన్‌లోనే ఈ టోర్నమెంట్ జరగాల్సింది. కానీ కరోనా మహమ్మారితో టోర్నీ నిర్వహణ వాయిదా పడింది. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత జూలై 2021లో ఈ టోర్నీ ఆరంభం కానుంది. కాగా టోర్నీలో పురుషులతో పాటు మహిళల మ్యాచ్‌లు కూడా సమానంగా జరగనున్నాయి. హండ్రెడ్ 2021 పేరుతో నిర్వహించనున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. బర్మింగ్హమ్ ఫోనిక్స్, ట్రెంట్ రాకెట్స్, ఓవల్ ఇన్విసిబల్స్, సౌతర్న్ బ్రేవ్, లండన్ స్పిరిట్, వేల్ష్ ఫైర్, నార్తన్ సూపర్ చార్జర్స్, మాంచెస్టర్ ఒరిజనల్స్ టోర్నీలో జట్లుగా ఉండనున్నాయి. కాగా జోఫ్రా ఆర్చర్, వార్నర్, ఆండీ రసెల్‌లు సౌతర్న్ బ్రేవ్‌లో ఆడనున్నారు. అయితే వార్నర్ గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్ ఆడేది అనుమానంగా ఉంది. 6-9 నెలల విశ్రాంతి అవసరం అని స్వయంగా వార్నరే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్లో వార్నర్ ఎస్ఆర్హెచ్కు, ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్‌కు, ఆండీ రసెల్ కేకేఆర్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా! That's it for The Hundred Men's Draft 2021! 🖋️ Happy with how your team is looking? 👇 pic.twitter.com/j7c2KdMHSJ — The Hundred (@thehundred) February 23, 2021 -
బెయిర్‌స్టో ఆడటం అతనికి ఇష్టం లేదు.. అందుకే..!
లండన్: భారత్‌తో రేపటి నుంచి ప్రారంభం కానున్నరెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ తుది జట్టులో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ఆడటం ఇంగ్లండ్ ఛీఫ్ సెలెక్టర్ ఎడ్ స్మిత్‌కు ఇష్టం లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయకాట్ ఆరోపించాడు. భారత పర్యటనకు ముందు శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో బెయిర్‌స్టో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినప్పటికీ.. విశ్రాంతి పేరుతో అతన్ని ఇంటికి పంపించి, ఇప్పుడు తుది జట్టులో ఆడే అవకాశం ఉన్నా అతనికి బదులు మరో వికెట్ కీపర్(బెన్ ఫోక్స్)వైపు మొగ్గు చూపడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. ప్రతిభ గల ఆటగాడి పట్ల జట్టు యాజమాన్యం ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కాగా, భారత్‌తో రెండో టెస్ట్‌కు జోస్ బట్లర్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో బెన్ ఫోక్స్‌ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఇంగ్లండ్ జట్టులో ఇటీవల కాలంలో రోటేషన్ పద్దతి పేరుతో ఆటగాళ్లను అకారణంగా పక్కకు పెడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లీష్ జట్టు ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. అండర్సన్, ఆర్చర్, బట్లర్, బెస్ల స్థానంలో వోక్స్, బ్రాడ్, ఫోక్స్, మొయిన్ అలీలతో బరిలోకి దిగుతుంది. భారత్ నదీమ్‌కు బదులు అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 9:30గంటలకు ప్రారంభం కానుంది. -
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
లండన్: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని 16 మంది ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గురువారం ప్రకటించింది. మార్చి 12 నుంచి 20 మధ్య అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లండ్ జట్టు భారత్‌కు బయలుదేరుతుందని ఈసీబీ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇంగ్లీష్ జట్టు మోర్గాన్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్ లాంటి టీ20 స్పెషలిస్టులతో బలంగా ఉంది. ఇరు జట్ల మధ్య మార్చి 12, 14, 16,18, 20 తేదీల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లండ్ టీ20 జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, శామ్ కర్రన్, టామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, టాప్లే, మార్క్ వుడ్. -
ఇకపై కరోనా సబ్‌స్టిట్యూట్?
లండన్: కోవిడ్–19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ల్లో ఒక ప్రత్యేకమైన మార్పును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆశిస్తోంది. ఇప్పటివరకు మ్యాచ్‌ల్లో ఆటగాడు గాయపడితే కన్కషన్ ప్లేయర్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లను చూశాం. కానీ ఇప్పడు ‘కరోనా వైరస్ రీప్లేస్మెంట్ (సబ్‌స్టిట్యూట్)’ను అనుమతించాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఈసీబీ కోరింది. తమ ప్రతిపాదనపై ఐసీసీ సానుకూలంగా స్పందిస్తుందని ఈసీబీ నమ్ముతోంది. ‘కోవిడ్–19 రీప్లేస్మెంట్ గురించి ఐసీసీ ఇంకా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. దీనిని అంగీకరించాల్సిన అవసరముంది. జూలైలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తుందని మేం నమ్ముతున్నాం’ అని ఈసీబీ ఈవెంట్స్ డైరెక్టర్ స్టీవ్ ఎల్వర్తి అన్నారు. అయితే ఈ మార్పు నుంచి వన్డే, టి20లను మినహాయించినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా కారణంగా దేశవాళీ సీజన్‌ను ఆగస్టు నుంచి ప్రారంభించనున్న ఈసీబీ... బయో సెక్యూర్ వాతావరణంలో వెస్టిండీస్, పాకిస్తాన్లతో టెస్టు సిరీస్‌లను నిర్వహిస్తామని పేర్కొంది. ఇంగ్లండ్ ప్రభుత్వ అనుమతి, మార్గదర్శకాల ఆధారంగానే టోర్నీలు జరుపుతామని చెప్పింది. -
మైదానంలోకి దిగిన తొలి క్రికెటర్లు వీరే!
లండన్: మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచదేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. దీంతో అనేక టోర్నీలు వాయిదా పడగా మరికొన్ని టోర్నీలు రద్దవ్వడంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే మెల్లిమెల్లిగా అనేక దేశాలు లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. ప్రజలు మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా క్రికెట్ పునరుద్దరణలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లకు ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని ఈసీబీ భావించింది. దీనిలో భాగంగా ఇంగ్లండ్‌లోని ఏడు మైదానాలను ఎంపిక చేసి 18 మంది బౌలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఒక సమయంలో కేవలం ఒక క్రికెటర్‌కు మాత్రమే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే వెసులుబాటు కల్పించింది. దీనిలో భాగంగా స్టువార్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్‌లు మైదానంలోకి దిగి కాసేపు ప్రాక్టీస్ చేశారు. బ్రాడ్ ట్రెంట్‌బ్రిడ్జ్‌లో, వోక్స్ ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రాక్టీస్ చేశారు. దీంతో కరోనా విరామం తర్వాత మైదానంలోకి దిగిన తొలి క్రికెటర్లుగా బ్రాడ్, వోక్స్‌లు నిలిచారు. ఇక చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగి బౌలింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని స్టువార్ట్ బ్రాడ్ ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. అంతేకాకుండా తను బౌలింగ్ చేసిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు. చదవండి: ఐసీసీ చైర్మన్ రేసులోకి గంగూలీ వచ్చేశాడు.. ‘మంకీ’ పెట్టిన చిచ్చు..! View this post on Instagram So much work has gone on behind the scenes to make this possible. Thanks to all the people @englandcricket & @trentbridge who have been involved, I really appreciate it. Felt great to be back out there having a bowl. Loved it. 🏏 A post shared by Stuart Broad (@stuartbroad8) on May 21, 2020 at 4:39am PDT -
ఇంగ్లండ్ క్రికెటర్ల దాతృత్వం
లండన్: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న కోవిడ్–19పై పోరు కోసం ఇంగ్లండ్ పురుషులు, మహిళా క్రికెటర్లు ముందుకొచ్చారు. తమ వేతనాల్లో కోతను భరించేందుకు సిద్ధమయ్యారు. కరోనాకు సహాయం అందించేందుకు క్రికెటర్లు ముందుకు రావాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కోరగా దానికి వారు అంగీకరించారు. దీని ప్రకారం ఈసీబీతో సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న పురుష, మహిళల క్రికెటర్లకు రానున్న మూడు నెలల జీతాల్లో 20 శాతం కోత పడనుంది. దీంతో కేవలం పురుష క్రికెటర్ల వేతనాల కోత నుంచి లభించే మొత్తం 5,00,000 పౌండ్ల (రూ. 4 కోట్ల 68 లక్షలు)కు సమానం కానుంది. అలాగే మహిళా క్రికెటర్ల ఏప్రిల్, మే, జూన్ నెల జీతాల నుంచి కూడా విరాళాన్ని సేకరించనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఓవరాల్‌గా ఎంత మొత్తం చారిటీ కోసం విరాళమివ్వాలనే అంశంపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఆటగాళ్లంతా విరాళమివ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని మహిళా జట్టు కెప్టెన్ హెథర్‌నైట్ తెలిపింది. -
ఆ జట్టు 20 బంతుల్లోనే సున్నాకు ఆలౌట్!
లండన్: క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత విస్మయకర విషయం. గల్లీ క్రికెట్లోనూ ఇలాంటి వింత కనీవీని ఉండం. కానీ ఈ వింత ఇంగ్లండ్‌లో జరిగింది. ఓ ఇంగ్లిష్ క్రికెట్ జట్టు బరిలోకి దిగి.. 20 బంతులు ఎదుర్కొని.. 10 వికెట్లు కోల్పోయి.. అసలు స్కోరు బోర్డు తెరువకుండానే ఆలౌటైంది. అంతకుముందు 120 పరుగులు చేసిన ప్రత్యర్థి జట్టు 120 పరుగులతో ఘనవిజయం సాధించింది. కెంట్ ప్రాంతీయ క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఈ వింత చోటుచేసుకుంది. ఈ సమాచారం తెలియడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బిత్తరపోయింది. కంటెర్‌బరీ క్రికెట్ మైదానంలో బాప్‌చైల్డ్ జట్టు, క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ జట్టు మధ్య జరిగిన మ్యాచులో ఈ వింత చోటుచేసుకుంది. ఇండోర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచులో బాప్‌చైల్డ్ జట్టు కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండా ఆలౌటైంది. అయితే ఆ జట్టును ఒక్క పరుగు చేయకుండా ఆలౌట్ చేసిన ప్రత్యర్థి జట్టుఆటగాళ్లే ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ఇది నిజాయితీగా సాధ్యమైందా? అన్నది కూడా చెప్పలేని స్థితిలో తాము ఉన్నామని క్రైస్ట్ చర్చ్ జట్టు స్పిన్నర్ మైక్ రోస్ స్థానిక దినపత్రికకు తెలిపాడు. బౌలర్ వేసిన ఓ బంతి మాత్రమే బ్యాట్స్‌మన్ బ్యాటుకు తగిలి.. దానిని ఫీల్డిండ్ ద్వారా అడ్డుకున్న ఫీల్డర్‌ను తానేనని, అంతుకుమించి బ్యాటింగ్ అంటూ ఏమీ జరుగలేదని అతను చెప్పుకొచ్చాడు. -
క్రీజులో మీరు... ఆండర్సన్ బౌలింగ్!
మీరు క్రికెట్ వీరాభిమానులా? ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వేగంగా విసిరే బంతుల్ని మీరే స్వయంగా క్రీజులో ఉండి ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? ఊహల్లో తప్ప నిజం కాదని మీరు నిరుత్సాహపడకండి. ఇప్పుడు మీకు అలాంటి కొత్త అనుభూతిని కల్పించే హెడ్సెట్ ఒకటి తయారైంది. ఈ ఆక్యులస్ రిఫ్ట్ హెడ్‌సెట్‌ను ధరిస్తే, నిజమని భ్రమ కలిగించేలా వర్చ్యువల్ రియాలిటీ అనుభూతి కలుగుతుంది. విషయం ఏమిటంటే, ఈ హెడ్సెట్ కోసం ఫాస్ట్ బౌలర్ ఆండర్సన్ బౌలింగ్ తాలూకు హెచ్.డి. ఫుటేజ్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అభిమానులు ఈ హెడ్‌సెట్‌ను తలకు పెట్టుకోగానే తక్షణమే క్రీజులోకి వెళ్ళినట్లూ, గంటకు 80 మైళ్ళ వేగంతో ఆండర్సన్ వేసే బంతులను ఎదుర్కొంటున్నట్లూ అనుభూతి కలుగుతుంది. యార్క్‌షైర్ టీ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఇ.సి.బి) కలసి రూపొందించిన ఈ హెడ్‌సెట్‌కు ‘ఎ ప్రాపర్ బాల్’ అని పేరు పెట్టారు. మైదానంలో ఆట చూసేందుకు వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ వర్చ్యువల్ రియాలిటీ (వి.ఆర్) టెక్నాలజీ మరపురాని అనుభూతే.