
లండన్: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న కోవిడ్–19పై పోరు కోసం ఇంగ్లండ్ పురుషులు, మహిళా క్రికెటర్లు ముందుకొచ్చారు. తమ వేతనాల్లో కోతను భరించేందుకు సిద్ధమయ్యారు. కరోనాకు సహాయం అందించేందుకు క్రికెటర్లు ముందుకు రావాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కోరగా దానికి వారు అంగీకరించారు. దీని ప్రకారం ఈసీబీతో సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న పురుష, మహిళల క్రికెటర్లకు రానున్న మూడు నెలల జీతాల్లో 20 శాతం కోత పడనుంది.
దీంతో కేవలం పురుష క్రికెటర్ల వేతనాల కోత నుంచి లభించే మొత్తం 5,00,000 పౌండ్ల (రూ. 4 కోట్ల 68 లక్షలు)కు సమానం కానుంది. అలాగే మహిళా క్రికెటర్ల ఏప్రిల్, మే, జూన్ నెల జీతాల నుంచి కూడా విరాళాన్ని సేకరించనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఓవరాల్‌గా ఎంత మొత్తం చారిటీ కోసం విరాళమివ్వాలనే అంశంపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఆటగాళ్లంతా విరాళమివ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని మహిళా జట్టు కెప్టెన్ హెథర్‌నైట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment