England cricketers
-
Ashes 2023: ఒకరి జెర్సీని మరొకరు.. 'మతిమరుపు' గానీ వచ్చిందా?
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి రోజు ఇంగ్లండ్ ఆలౌట్ అయితే.. రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు ఆలౌట్ చేశారు. కాగా ఆసీస్ కేవలం 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. మూడోరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 75 బంతుల్లో 73 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. స్టోక్స్ కూడా 30 బంతుల్లో 20 పరుగులతో దాటిగా ఆడుతూ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒకరి జెర్సీని మరొకరు ధరించారు. ఇది చూసిన అభిమానులకు కాసేపు అర్థం కాలేదు. ఇంగ్లండ్ ఆటగాళ్లు మరిచిపోయి ఒకరి జెర్సీ ఒకరు వేసుకున్నారేమోనని అభిప్రాయపడ్డారు. నిజానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలా జెర్సీలను మార్చుకోవడానికి ఒక కారణం ఉంది. అల్జీమర్స్(Dementia-మతిమరుపు)వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు మద్దతుగా బెన్ స్టోక్స్ బృందం ఒకరి జెర్సీలు మరొకరు ధరించారు. కెప్టెన్ స్టోక్స్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో జెర్సీ వేసుకున్నాడు. మోయిన్ అలీ మాజీ కెప్టెన్ జోరూట్ జెర్సీతో వచ్చాడు. జేమ్స్ అండర్స్ మరో పేసర్ స్టువార్ట్ బ్రాడ్ జెర్సీతో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఒక్క చోట చేరారు. అల్జీమర్స్ సొసైటీ సభ్యులు ఆలపించిన పాట విన్నారు. ఆ తర్వాత మూడోరోజు ఆటను ప్రారంభించారు. అల్జీమర్స్ అనేది ఒక వృద్దాప్య సమస్య. 60 ఏళ్లు పైబడిన వాళ్లలో రోజు రోజుకు మతిమరుపు పెరుగుతుంటుంది. దాంతో, వాళ్లు అన్ని విషయాలు మర్చిపోతారు. కుటుంబసభ్యులను, ప్రాణ స్నేహితులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు. డిమెన్షియా వల్ల వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. A moving and powerful rendition of Jerusalem 👏@alzheimerssoc | #CricketShouldBeUnforgettable pic.twitter.com/cMC37JWC96 — England Cricket (@englandcricket) July 29, 2023 Today is the day! It's the @lv=Men's Ashes Test Match: Day 3 Supporting Alzheimer’s Society. 🏏 Huge thanks to the Kia Oval (@surreycricket) and @englandcricket - and sending lots of luck to our boys! 🤞 Great #CricketShouldBeUnforgettable https://t.co/oFsZXP1wXb pic.twitter.com/vbFrIO8HXj — Alzheimer's Society (@alzheimerssoc) July 29, 2023 చదవండి: ICC ODI WC 2023: గుడ్‌న్యూస్.. ఆగస్టు 10 నుంచి వన్డే వరల్డ్‌కప్ టికెట్లు అందుబాటులో! -
IPL 2023: 105 కోట్లు పోసి కొన్న ఇంగ్లీషోళ్ల కంటే మనోళ్లు చాలా బెటర్..!
ఐపీఎల్ 2023లో ఫస్ట్ ఆఫ్ మ్యాచ్‌లు ఏప్రిల్ 25తో ముగిసాయి. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా గుజరాత్, రాజస్థాన్, లక్నో, ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్, ముంబై, సన్‌రైజర్స్, ఢిల్లీ జట్లు ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో దాదాపు సగం మ్యాచ్‌లు (35) పూర్తైన నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే, ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. వేలంలో 105 కోట్ల పెట్టి కొన్న ఇంగ్లీషోళ్ల కంటే మన వాళ్లు (ఇండియా ప్లేయర్స్) చాలా బెటర్ అని గణాంకాలు ద్వారా క్లియర్‌గా తెలుస్తోంది. ఇంగ్లండ్ జట్టు వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లు గెలవడంతో మన ఫ్రాంచైజీలు వారిని సొంతం చేసుకునేందుకు ఎగబడ్డాయి. అయితే వారిని నుంచి ఆశించినంత ఫలితాలు రాకపోవడంతో ప్రస్తుతం బేరు మంటున్నాయి. చదవండి: Hardik Pandya: కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు, తీసేయండి..! మార్క్ వుడ్ మినహాయించి ఫస్ట్ ఆఫ్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఆటగాళ్లంతా తేలిపోయారు. హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బట్లర్ లాంటి ఆటగాళ్లు వన్ మ్యాచ్ వండర్లుగా మిగిలిపోయారు. 3 కోట్లు పెట్టి కొన్న విల్ జాక్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయం కారణంగా స్వదేశానికి తిరుగుటపా కట్టగా.. స్టోక్స్, ఆర్చర్ లాంటి స్టార్లు ఒకటి, అరా మ్యాచ్‌లు ఆడి గాయాలను సాకుగా చూపుతూ బెంచ్‌కే పరిమితమయ్యారు. లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన లివింగ్‌స్టోన్, 8 కోట్ల ఆటగాడు మొయిన్ అలీ తమపై పెట్టిన సొమ్ముకు న్యాయం చేయలేపోయారు. రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, ఫిల్ సాల్ట్ లాంటి ఆటగాళ్లు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోగా.. ఆదిల్ రషీద్, జో రూట్ లాంటి ఆటగాళ్లు మొత్తానికే అవకాశాలు రాక బెంచ్‌పై సేదదీరుతున్నారు. మొత్తానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు తమపై పెట్టిన 105 కోట్ల పెట్టుబడికి కనీస న్యాయం కూడా చేయలేకపోయారు. వీరికి ఐపీఎల్-2023 కంటే దాని తర్వాత వెంటనే జరిగే యాషెస్పైనే మక్కువ ఎక్కువ. అందుకే స్టోక్స్ లాంటి ఆటగాళ్లు గాయాలను సాకుగా చూపి బెంచ్‌పై రెస్ట్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. వాళ్లకంటే మన వాళ్లు వెయ్యి రెట్టు బెటర్... కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఇంగ్లీషోళ్ల కంటే భారత ఆటగాళ్లు వెయ్యి రెట్టు బెటర్ అని గణాంకాలు చెబుతున్నాయి. ఏమాత్రం అంచనాలు లేని, పెద్ద మొత్తానికి కొనుగోలు చేయని వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, నితీశ్ రాణా, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే.. వెటరన్లు శిఖర్ ధవన్, రహానే, సాహా అదరగొడుతుండగా.. విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ లాంటి టీమిండియా స్టార్లు స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటుతున్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ మహ్మద్ సిరాజ్ ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్‌లో ఉండి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతుండగా.. వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, చహల్, షమీ, అశ్విన్‌లు సత్తా చాటుతున్నారు. అలాగే కొత్త కుర్రాళ్లు సుయాశ్ శర్మ, వెటనర్లు పియూశ్ చావ్లా, అమిత్ మిశ్రా, మోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ అదరగొడుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లతో పోలిస్తే పై పేర్కొన్న ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు వెచ్చించిన సొమ్ము చాలా తక్కువ. స్టార్లు మినహాయించి మిగతా వారికంతా అరకొర మొత్తమే లభిస్తుంది. అయినప్పటికీ వారు అద్భుతంగా రాణిస్తూ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. సెకెండ్ ఆఫ్‌లో 105 కోట్ల ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతుంది..? సెకెండ్ ఆఫ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతుంది.. వాళ్లు మొత్తం లీగ్‌కు అందుబాటులో ఉంటారా, లేక గాయాలు సాకుగా చూపి బెంచ్‌పై కూర్చుంటారా.. లేక లీగ్ అయిపోక ముందే యాషెస్‌కు టైమ్ అయ్యిందని లండన్‌కు చెక్కెస్తారా..? దీనిపై మీ అంచనాలను, అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపగలరు. ఐపీఎల్-2023 ఆడుతున్న ఇంగ్లండ్ ఆటగాళ్ల వివరాలు.. సామ్ కర్రన్ (పంజాబ్ కింగ్స్, 18.5 కోట్లు) బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్, 16.25 కోట్లు) జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్, 10 కోట్లు) హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్, 13.25 కోట్లు) ఆదిల్ రషీద్ (సన్‌రైజర్స్, 2 కోట్లు) జో రూట్ (రాజస్థాన్, కోటి) లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్, 11.50 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (ముంబై ఇండియన్స్, 8 కోట్లు) రీస్ టాప్లే (ఆర్సీబీ, 1.9 కోట్లు) డేవిడ్ విల్లే (ఆర్సీబీ, 2 కోట్లు) మార్క్ వుడ్ (లక్నో, 7.50 కోట్లు) మొయిన్ అలీ (సీఎస్కే, 8 కోట్లు ) ఫిల్ సాల్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు) విల్ జాక్స్ (ఆర్సీబీ, 3 కోట్లు) చదవండి: ఏడాదికి 50 కోట్లు ఇస్తాం.. దేశానికి ఆడకండి.. ఐపీఎల్ ఫ్రాంచైజీల బంపర్ ఆఫర్ -
ఏడాదికి 50 కోట్లు ఇస్తాం.. దేశానికి ఆడకండి.. ఐపీఎల్ ఫ్రాంచైజీల బంపర్ ఆఫర్
లండన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలో (లండర్ టైమ్స్) ఆ దేశ క్రికెటర్లకు (ఇంగ్లండ్) సంబంధించిన ఓ సంచలన కథనం ప్రసారమైనట్లు భారత దేశ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. టాప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు ఆరుగురు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారన్నది ఆ కథనం సారాంశం. సదరు క్రికెటర్లు ఇంగ్లండ్ జాతీయ జట్టును వదిలిపెట్టి, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో (ఈసీబీ) అనుసంధానమైన ఏ జట్టులో (కౌంటీలు) ఆడకుండా, తమతో ఒప్పందం కుదుర్చుకుంటే ఏడాదికి రూ. 50 కోట్లు ఇస్తామని ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆఫర్ చేశాయట. చదవండి: RCB VS KKR: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు పీఎస్ఎల్, బీపీఎల్‌లో ఆడకూడదు.. ఆటగాళ్లు ఆఫర్‌కు ఓకే చెబితే ఏడాది మొత్తం ఫ్రాంచైజీకి సంబంధించిన వివిధ జట్ల తరఫున దేశవ్యాప్తంగా జరిగే క్రికెట్ లీగ్‌ల్లో ఆడాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీలు లేని పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ల్లో ఆటగాళ్లు ఆడటం నిషేధం. లండర్ టైమ్స్ కథనంలో ఆ ఆరుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎవరు, వారిని సంప్రదించిన ఫ్రాంచైజీలు ఏవి అన్న వివరాలు వెల్లడించలేదని పీటీఐ తెలిపింది. కాగా, ఐపీఎల్‌లోని దాదాపు అన్ని ఫ్రాంచైజీలు విశ్వవ్యాప్తంగా జరిగే ప్రముఖ క్రికెట్ లీగ్‌ల్లో జట్లను కలిగి ఉన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్ఏ టీ20 లీగ్, యూఏఈ వేదికగా జరిగే ఐఎల్ టీ20 లీగ్, త్వరలో యూఎస్ఏలో జరుగబోయే మేజర్ క్రికెట్ లీగ్‌ల్లో మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు వివిధ జట్లను కొనుగోలు చేశాయి. చదవండి: IPL 2023: గుజరాత్, లక్నో మ్యాచ్ ఫిక్సైంది..! ' -
మిమ్మల్సి ఐపీఎల్ ఫ్యామిలీ మర్చిపోదు.. ఫ్రాంఛైజీలకు నమ్మకద్రోహం చేస్తున్నారు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2021 మలిదశ మ్యాచ్‌లు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుండగా లీగ్‌కు అందుబాటులో ఉండలేమంటూ ఇంగ్లండ్ క్రికెటర్లు డేవిడ్ మలాన్(పంజాబ్ కింగ్స్), క్రిస్ వోక్స్(ఢిల్లీ క్యాపిటల్స్), జానీ బెయిర్‌స్టో(సన్‌రైజర్స్) ఆయా ఫ్రాంఛైజీలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సదరు ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. వాళ్లు చేసిన పనిని ఐపీఎల్ కుటుంబం ఎప్పటికీ మరచిపోదని, భవిష్యత్తులో వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అకారణంగా లీగ్ నుంచి తప్పుకోవడం అంటే సదరు ప్లేయర్ అతని ఫ్రాంఛైజీని మోసం చేసినట్లేనని, దీన్ని ఫ్రాంఛైజీలు నమ్మక ద్రోహంగా భావిస్తాయని, ఈ విషయాన్ని ఇంగ్లండ్ ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇలా సడెన్‌గా ఆటగాళ్లు తప్పుకోవడం ఫ్రాంఛైజీలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ప్రతి ఆటగాడి విషయంలో యాజమాన్యాలు వ్యూహరచన చేస్తాయని, అలాంటిది ఆ ప్లేయర్ సడెన్‌గా తప్పుకుంటే గేమ్ ప్లాన్ మొత్తం మారిపోతుందని, ఇది జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నాడు. కాగా, ఇదివరకే పలువురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాల చేత లీగ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. తాజాగా మలాన్, వోక్స్, బెయిర్‌స్టో కూడా రావడం లేదని చెప్పారు. అటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సామ్ కర్రన్, మొయిన్ అలీలు సైతం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొత్త గైడ్‌లైన్స్ కారణంగా ప్లేఆఫ్స్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన ఎనిమిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్ మలిదశ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రణాళిక ప్రకారం టోర్నీని సామూహికంగా ఎగ్గొట్టినట్లు స్పష్టమవుతోంది. చదవండి: మా పిచ్‌లపై 10-15 మ్యాచ్‌లు ఆడితే వాళ్ల కెరీర్లు ముగిసినట్టే.. -
ఆవేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్ బహిష్కరిస్తామని బెదిరింపులు..!
IND VS ENG 5th Test Cancellation: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకావాల్సిన ఐదో టెస్ట్ రద్దైన నేపథ్యంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారని తెలుస్తోంది. తమ జట్టు సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశముండటంతో టీమిండియా సభ్యులు కరోనా బూచి చూపించి కావాలనే బరిలోకి దిగేందుకు నిరాకరించారని వారు ఆరోపిస్తున్నారు. కొత్త కరోనా కేసులు నమోదవుతాయని భయపడిన టీమిండియా క్రికెటర్లు మాంచెస్టర్ వీధుల్లో తిరగడమేంటని నిలదీస్తున్నారు. ఇంతటితో ఆగని ఇంగ్లీష్ క్రికెటర్లు ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లను బహిష్కరిస్తామని హెచ్చరించారని తెలుస్తోంది. ఈ విషయమై(ఐపీఎల్ బహిష్కరణ) జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్ ఇదివరకే నిర్ణయించుకున్నట్లు బ్రిటిష్ మీడియా కథనాలు సైతం ప్రచారం చేస్తోంది. ఐపీఎల్లో పాల్గొంటున్న ఐదుగురు క్రికెటర్లలో ఒకరు ఇంగ్లండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టారని సమాచారం. ఇదిలా ఉంటే, భారత బృందంలో కరోనా కేసు వెలుగు చూడటంతో మ్యాచ్‌కు మూడు గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. భారత కోచింగ్ సిబ్బంది వరుసగా వైరస్ బారిన పడడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో సుదీర్ఘ చర్చల అనంతరం ఈసీబీ రద్దు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సొంతగడ్డపై సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని ఇంగ్లీష్ ప్లేయర్లు కడుపు మంటతో ఐపీఎల్ బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగారని సమాచారం. చదవండి: ఆ మూడు ఐపీఎల్ జట్లకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం -
ఇంగ్లండ్ జట్టులో కరోనా కలకలం
లండన్: శ్రీలంకను పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఊదేసిన ఇంగ్లండ్ జట్టును కరోనా వైరస్ చుట్టుముట్టింది. ముగ్గురు ఆటగాళ్లతో పాటు నలుగురు సహాయక సిబ్బందికి కోవిడ్ సోకింది. ఇలా ఏకంగా ఏడుగురు వైరస్ బారిన పడటంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఉలిక్కి పడింది. ఇక చేసేదేమీ లేక పాకిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు జట్టును మార్చేసింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో పూర్తిగా కొత్త జట్టును ప్రకటించింది. 18 మందిలో సగం మంది కొత్త ముఖాలే! లంకతో ఆడినట్లుగానే పాక్‌తో కూడా ఇంగ్లండ్ జట్టు మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడనుంది. గురువారం కార్డిఫ్‌లో జరిగే తొలి వన్డేతో ఇంగ్లండ్, పాక్ సిరీస్ మొదలవుతుంది. ఇదిలావుండగా కరోనా బారిన పడిన క్రికెటర్ల పేర్లుగానీ సహాయ సిబ్బందిలో ఎవరెవరికి సోకిందనే విషయాలు ఈసీబీ బయటకు వెల్లడించలేదు. మొత్తం జట్టును ఐసోలేషన్‌లో ఉంచింది. కోవిడ్ సోకిన ఏడు మందితో టచ్‌లో ఉన్న ఇంకెంతమందికి వైరస్ సోకు తుందోనని ఈసీబీ ఆందోళన పడుతుంది. ఇంగ్లండ్ వన్డే జట్టు: స్టోక్స్ (కెప్టెన్), జేక్‌బాల్, బ్రిగ్స్, కేర్స్, క్రావ్లీ, డకెట్, గ్రేగొరి, హెల్మ్, జాక్స్, లారెన్స్, సాఖిబ్, మలాన్, ఓవర్టన్, పార్కిన్సన్, పేన్, సాల్ట్, సింప్సన్, విన్స్. -
ఇంగ్లండ్ క్రికెటర్ల దాతృత్వం
లండన్: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న కోవిడ్–19పై పోరు కోసం ఇంగ్లండ్ పురుషులు, మహిళా క్రికెటర్లు ముందుకొచ్చారు. తమ వేతనాల్లో కోతను భరించేందుకు సిద్ధమయ్యారు. కరోనాకు సహాయం అందించేందుకు క్రికెటర్లు ముందుకు రావాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కోరగా దానికి వారు అంగీకరించారు. దీని ప్రకారం ఈసీబీతో సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న పురుష, మహిళల క్రికెటర్లకు రానున్న మూడు నెలల జీతాల్లో 20 శాతం కోత పడనుంది. దీంతో కేవలం పురుష క్రికెటర్ల వేతనాల కోత నుంచి లభించే మొత్తం 5,00,000 పౌండ్ల (రూ. 4 కోట్ల 68 లక్షలు)కు సమానం కానుంది. అలాగే మహిళా క్రికెటర్ల ఏప్రిల్, మే, జూన్ నెల జీతాల నుంచి కూడా విరాళాన్ని సేకరించనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఓవరాల్‌గా ఎంత మొత్తం చారిటీ కోసం విరాళమివ్వాలనే అంశంపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఆటగాళ్లంతా విరాళమివ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని మహిళా జట్టు కెప్టెన్ హెథర్‌నైట్ తెలిపింది. -
కరోనా దెబ్బ : ఇంగ్లండ్ ఆటగాళ్ల తిరుగుముఖం
కరాచీ : పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో వారు స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదే విషయమై పీఎస్ఎల్ నిర్వాహకులు అధికారికంగా ధృవీకరిస్తూ వారు స్వదేశానికి వెళ్లడానికి వీలుగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా ఇంగ్లండ్ ఆటగాళ్లలో జేసన్ రాయ్, మొయిన్ అలీ, టామ్ బాంటన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్డాన్లు లీగ్‌లో ఆడుతున్నారు. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లు వెళ్లిపోయినా లీగ్ మాత్రం యధాతథంగా కొనసాగుతుందని పీఎస్ఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది.కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడంతో ఇక మీదట ఏ మ్యాచైనా సరే ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. కాగా లీగ్ జరుగుతున్న కరాచీ, సింధ్ ప్రావిన్స్‌లోనే కరోనా వైరస్ అధికంగా నమోదవ్వడం విశేషం. (ఐపీఎల్ 2020 వాయిదా) పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో వసీమ్ ఖాన్ మాట్లాడుతూ.. ' పీఎస్ఎల్ నుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు వెళ్లిపోవడమనేది వారిష్టం. కాగా కరోనా వేగంగా విస్తరిస్తున్న వేళ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్న ఆటగాళ్ల పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇక మీదట అన్ని మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా జరగనున్నాయి. సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అక్కడ జరగాల్సిన ఐదు మ్యాచ్‌లనూ కరాచీలోనే నిర్వహించనున్నాము. ఇక లీగ్‌లో ఆటోబయోగ్రాప్‌లు, సెల్సీలు, కరచాలనాలకు ఆటగాళ్లు దూరంగా ఉండాలని సూచించాము' అని తెలిపాడు.(రంజీ చరిత్రలో సౌరాష్ట్ర నయా రికార్డు) -
ఇంగ్లండ్‌కు మూలస్తంభం
పదేళ్ల క్రితం.... నాగ్‌పూర్‌లోని సివిల్ లైన్సలో పాత వీసీఏ స్టేడియం... 21 ఏళ్ల యువ క్రికెటర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఎదురుగా కుంబ్లే, హర్భజన్ లాంటి దిగ్గజాలు. స్పిన్‌కు అనుకూలించే పిచ్. మహా మహా దిగ్గజాలు అనుకున్న ఇంగ్లండ్ క్రికెటర్లు వెనుదిరుగుతున్నారు. కానీ ఆ కుర్రాడు మాత్రం గోడలా నిలబడ్డాడు. తొలి ఇన్నింగ్సలో అర్ధసెంచరీ, రెండో ఇన్నింగ్సలో అజేయ సెంచరీ... మ్యాచ్ డ్రా అరుుంది. భారత్ గెలుపును అడ్డుకున్న ఆ క్రికెటర్ పేరు అలిస్టర్ కుక్. కట్ చేస్తే... ఇప్పుడు భారత్‌లో పర్యటించే ఇంగ్లండ్ జట్టు సారథి కుక్. ఇంగ్లండ్ తరఫున టెస్టులకు సంబంధించి అన్ని రికార్డులూ తనవే. అత్యధిక మ్యాచ్‌లు, పరుగులు, సెంచరీలు... ఇలా టెస్టు క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే దేశం తరఫున అతనో సూపర్ స్టార్. ఈ పదేళ్లలో ఎంతోమంది జట్టులోకి వచ్చారు. వెళ్లారు. కానీ కుక్ మాత్రం మూలస్తంభంలా నిలబడ్డాడు. బంగ్లాదేశ్‌తో తాజాగా జరిగిన రెండు టెస్టుల ద్వారా ఇంగ్లండ్ తరఫున బ్యాటింగ్‌లో ఉన్న టెస్టు రికార్డులన్నీ దాదాపుగా కుక్ వశమై పోయారుు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (135) ఆడిన ఆటగాడిగా అలెక్ స్టివార్ట్ (133 మ్యాచ్‌లు) రికార్డును ఆ పర్యటనలో అధిగమించాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో గూచ్, అథర్టన్, ్ట్రాస్ ఇలా ఎంతో మంది దిగ్గజ ఓపెనర్లు ఉన్నారు. వారందరి రికార్డులను అధిగమించాడు కుక్. ఫ్లింటాఫ్, పీటర్సన్, బోథమ్... ఇలా ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఆ జట్టుకు ఆడినా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండ్ నుంచి వచ్చిన అత్యుత్తమ క్రికెటర్ కుక్ అని ఇప్పటికే కితాబు అందుకున్నాడు. సంగీతంతో మొదలై... చిన్నప్పుడు కుక్కు సంగీతం అంటే పిచ్చి. స్కూల్లో ప్రతి కార్యక్రమంలోనూ తనే. కేవలం ఎండాకాలం సెలవుల్లో మాత్రమే క్రికెట్ ఆడేవాడు. అందుకే తను స్కూల్ తుది జట్టులో కూడా లేడు. ఒకసారి ఎంసీసీకి చెందిన స్కూల్ జట్టు కుక్ స్కూల్‌కి వచ్చింది. ఎంసీసీ జట్టులో ఒక పిల్లాడు రాకపోతే... ప్రత్యర్థి తుది జట్టులో అవకాశం లేని కుక్‌ను తీసుకున్నారు. ఆ మ్యాచ్‌లో తను సెంచరీ చేశాడు. అప్పుడు తన వయసు 11 ఏళ్లు. అంతే ఆ ఒక్క మ్యాచ్‌తో తన రాత మారిపోరుుంది. నిపుణులైన కోచ్‌ల పర్యవేక్షణలోకి వచ్చాడు. స్కూల్ స్థారుులో సంచలన ఆటతీరుతో క్రమంగా కౌంటీలకు ఆడాడు. అక్కడి నుంచి జాతీయ జట్టుకు వచ్చాడు. నిజానికి భారత్ పర్యటనకు వచ్చే ఇంగ్లండ్ జట్టు కొత్త వాళ్లని తీసుకురావడం అరుదు. కానీ 2006లో సీనియర్ ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో కుక్‌ను తీసుకొచ్చారు. అరంగేట్రంలోనే అదరగొట్టి సత్తా చాటిన కుక్ అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏనాడూ జట్టుకు దూరం కాలేదు. ఈ పదేళ్ల కాలంలో కుక్కు జోడీగా దాదాపు 20 మంది క్రికెటర్లు వచ్చారు. కానీ తను మాత్రం ఒక ఎండ్‌లో కుదురుగా అలా ఉండిపోయాడు. 2010 నుంచి అత్యుత్తమం కెరీర్ ప్రారంభమైన తొలి నాలుగు సంవత్సరాలు కుక్ అందరిలో ఒకడిగానే కనిపించాడు. అడపా దడపా ఓ సెంచరీతో తన స్థానాన్ని కాపాడుకోవడానికే పరిమితమయ్యాడు. 2010లో తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో తను చెలరేగిపోయాడు. ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలతో ఏకంగా 766 పరుగులు చేసి ఒంటిచేత్తో సిరీస్‌ను గెలిపించాడు. 24 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విజయం సాధించలేకపోరుున ఇంగ్లండ్... కుక్ పుణ్యమా అని నెగ్గింది. దీంతో దేశం మొత్తం సంబరాలు జరిగారుు. కుక్కు లండన్‌లో ‘ఫ్రీడమ్ ఆఫ్ సిటీ’ గౌరవం ఇచ్చారు. ఆ తర్వాత ఏడాది భారత్‌పై 294 పరుగులు చేసి కెరీర్లో అత్యత్తమ స్కోరు సాధించాడు. ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో నంబర్‌వన్ కావడంలో కుక్‌దే కీలక పాత్ర. 2012లో ఆండ్రూ ్ట్రాస్ రిటైర్ అరుున తర్వాత పూర్తి స్థారుులో ఇంగ్లండ్ పగ్గాలు కుక్కు అప్పగించారు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో భారత్‌ను భారత్‌లో ఓడించి సంచలనం సృష్టించాడు. 1984 తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌లో సిరీస్ గెలవడం అదే తొలిసారి. 2013లో స్వదేశంలో జరిగిన యాషెస్‌లోనూ జట్టును విజయపథంలో నడిపించాడు. కానీ ఆ తర్వాతి ఏడాది ఆస్ట్రేలియాలో సిరీస్‌ను 1-4తో ఓడిపోయారు. అరుుతే జట్టులోని సీనియర్ క్రికెటర్లు చాలామంది రిటైరైన సమయం అది. యువ క్రికెటర్లతో ఫలితాలను తేవడానికి సమయం పడుతుందంటూ ఈసీబీ కుక్కు వెన్నంటి నిలిచింది. 2014 వరకు కుక్ ఇంగ్లండ్‌కు వన్డేల్లోనూ కెప్టెన్‌గా కొనసాగినా... వన్డేల్లో సాధారణ ఆటతీరు కారణంగా తనపై వేటు పడింది. 2015లో తిరిగి స్వదేశంలో యాషెస్ సిరీస్ గెలిపించాడు. దిగ్గజాల సరసన చోటు ఇంగ్లండ్ ప్రజల పండుగ క్రిస్మస్ రోజు జన్మించిన కుక్ ఆ దేశ క్రికెట్ దిగ్గజాల సరసన ఇప్పటికే చేరాడు. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వరల్డ్ ఎలెవన్ కెప్టెన్ ఇలా కుక్ అనేక ఘనతలు సాధించాడు. క్రికెట్‌కు తను అందించిన సేవలు, సాధించిన ఘనతల పట్ల సంతోషించిన బ్రిటన్ రాణి కుక్‌ను ‘ఆర్డర్ ఆఫ్ ద అంపైర్’ గా గౌరవించారు. తను సాధించిన ఘనతల పట్ల కుక్ చాలా గర్వపడ్డాడు. ‘ఇంగ్లండ్ తరఫున దశాబ్దకాలం పైగా క్రికెట్ ఆడే అవకాశం లభించడం నా అదృష్టం. నా కెరీర్లో జట్టు విజయానికి ఉపయోగపడిన ప్రతిసారీ గర్వంగా భావించేవాడిని. నా దృష్టిలో ఇంగ్లండ్ జాతీయ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం కంటే గొప్ప గౌరవం లేదు. దీనిని కాపాడుకుంటాను. నాలో శక్తి ఉన్నంతవరకూ ఆడుతూ ఇంగ్లండ్ క్రికెట్లో కొత్త ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తాను’ అని కుక్ చెబుతున్నాడు. సచిన్ రికార్డులే లక్ష్యం ప్రస్తుత తరంలో ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో కుక్ ఒకడు. తన వయసు 31 సంవత్సరాలు. మరో పదేళ్ల పాటు తను క్రికెట్ ఆడగలడని అంచనా. ప్రస్తుతం మిస్బావుల్ హక్ 40 ఏళ్ల వయసులోనూ నిలకడగా ఆడుతున్నాడు. దీనికి తోడు కుక్ కేవలం టెస్టులకే పరిమితం. కాబట్టి మరో పదేళ్లు ఆడటం కష్టం కాకపోవచ్చు. సచిన్ కెరీర్లో 200 మ్యాచ్‌లలో 51 సెంచరీలతో 15,921 పరుగులు చేశాడు. కుక్ ఇప్పటికి 135 మ్యాచ్‌లలో 29 సెంచరీలతో 10,688 పరుగులు చేశాడు. ప్రస్తుతం కుక్ సగటున ప్రతి 29 రోజులకు ఒక టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. అంటే సుమారుగా ఏడాదికి 12 టెస్టులు. అంటే సచిన్ మ్యాచ్‌లను చేరడానికి తనకు సుమారు ఆరేళ్లు పడుతుంది. ఆరేళ్ల పాటు ఇంతే నిలకడగా ఆడితే సచిన్ పరుగుల రికార్డును చేరుకోవచ్చు. కానీ సెంచరీలను అందుకోవడం కొద్దిగా కష్టమే. ఏమైనా సచిన్ రికార్డులను కుక్ అందుకోవాలనే ఆశ అతనొక్కడిదే కాదు... టెస్టు క్రికెట్ అంటే ప్రాణమిచ్చే ఆ దేశానిది కూడా. మరి ప్రాక్టికల్‌గా ఇది సాధ్యమవుతుందో లేదో తెలుసుకోవాలంటే మరో ఐదారేళ్లు ఆగాల్సిందే. -సాక్షి క్రీడావిభాగం -
ఆటను అవమానించాక...
ఇంగ్లండ్ క్రికెట్లో అన్నీ అపశకునాలే పరాజయం బాట వీడని జట్టు ప్రతి క్రికెటర్‌కీ పిచ్ దైవంలాంటిది. కోట్లాది మంది దేవుడిలా ఆరాధించే సచిన్ కూడా... తాను రిటైర్ అయ్యాక వెళ్లి పిచ్‌కు మొక్కి వచ్చాడు. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. కానీ ఇంగ్లండ్ క్రికెటర్లు ఏడాది క్రితం ‘యాషెస్’ గెలిచిన మైకంలో పిచ్ మీద మూత్ర విసర్జన చేశారు. ఆ తర్వాత యాదృచ్ఛికమే అయినా ఇంగ్లండ్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. ఏడాది పాటు ఆడిన అన్ని సిరీస్‌ల్లో ఓడిపోయింది. సరిగ్గా అదే కారణం కాకపోయినా, ‘మా జట్టు ఆటను అవమానించినందుకే ఇలా జరుగుతోందేమో’ అని ఇప్పుడు సగటు ఇంగ్లండ్ అభిమానులు వాపోతున్నారు. అందుకు ఉదాహరణగా గత ఏడాది కాలంలో ఇంగ్లండ్‌కు ఎదురవుతున్న అపశకునాలను వారు గుర్తు చేసుకుంటున్నారు. ► గత ఏడాది ఆగస్ట్ 25న ఓవల్‌లో టెస్టు మ్యాచ్ ముగిశాక ఇంగ్లండ్ క్రికెటర్లు పీటర్సన్, అండర్సన్, బ్రాడ్ బీర్లు తాగుతూ పిచ్ మీద మూత్రవిసర్జన చేశారు. అంతకు ముందు టెస్టులోనే ఇంగ్లండ్ యాషెస్ సిరీస్‌ను గెలుచుకుంది. ఆ వెంటనే జరిగిన వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ►ఆ తర్వాత డిసెంబర్లో ఆస్ట్రేలియా వెళ్లిన ఇంగ్లండ్ జట్టు 0-5 తేడాతో చిత్తు చిత్తుగా ఓడి యాషెస్‌ను కోల్పోయింది. అంతే కాదు...అక్కడే జరిగిన వన్డే, టి20 సిరీస్‌లలో కూడా జట్టుకు పరాజయమే ఎదురైంది. ► మూడు టెస్టుల్లో పరాజయం పాలు కాగానే, జట్టు ప్రధాన స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన వల్ల కాదంటూ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. మరో నాణ్యమైన స్పిన్నర్‌ను తయారు చేసుకోవడం సంగతి అటు ఉంచితే... స్వాన్ తర్వాత ఇంగ్లండ్‌కు ఇప్పటి వరకు స్పిన్ వేయగలిగే బౌలర్ కూడా దిక్కు లేడు. ► యాషెస్ పరాజయంతో టీమ్ డెరైక్టర్ ఆండీ ఫ్లవర్ రాజీనామా చేశాడు. ►జట్టు నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్‌ను క్రమశిక్షణా రాహిత్యం పేరుతో ఇంగ్లండ్ బోర్డు పక్కన పెట్టేసింది. ►టి20 ప్రపంచకప్‌లో ఆ జట్టు నెదర్లాండ్స్ చేతిలోనూ చిత్తుగా ఓడింది. ►మరో అవమానం నెల రోజుల క్రితం సొంతగడ్డపై బ్రిటీష్ జట్టుకు ఎదురైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా అడుగు పెట్టిన ఉపఖండపు జట్టు శ్రీలంక టెస్టు, వన్డే, టి20 సిరీస్‌లను వరుసగా గెలిచి చావుదెబ్బ కొట్టింది. ►జట్టు సభ్యుడు గ్యారీ బ్యాలెన్స్ పబ్‌లో చిత్తుగా తాగి నగ్న ప్రదర్శన చేయడం జట్టుకు చెడ్డ పేరు తెచ్చింది. ► తాజాగా లార్డ్స్‌లో పరాభవం జట్టు స్థైర్యాన్ని ఒక్కసారిగా దెబ్బ తీసింది. ప్రయర్ ఇప్పటికే తప్పుకోగా, సీనియర్ల వైఫల్యం సమస్యగా మారింది. అన్నింటికి మించి కెప్టెన్‌గా కుక్ పనితీరు, అతని బ్యాటింగ్‌పై అన్ని వైపులనుంచి విమర్శలు చుట్టుముడుతున్నాయి. ►ఇక తొలి టెస్టులో రవీంద్ర జడేజాతో అనవసరంగా కయ్యం పెట్టుకున్న అండర్సన్‌పై ఇప్పుడు కత్తి వేలాడుతోంది. విచారణలో అతను దోషిగా తేలితే ఇక ఈ సిరీస్‌పై ఇంగ్లండ్ ఆశలు వదిలేసుకోవాల్సిందే. ► ‘మూత్ర విసర్జన’ ఘటన తర్వాత ఇంగ్లండ్ 9 టెస్టులు ఆడితే 7 ఓడి రెండు మాత్రమే డ్రా చేసుకోగలిగింది. ఇకపై కూడా ఇదే బాట కొనసాగుతుందా లేక మేలుకొని కోలుకుంటుందా చూడాలి. - సాక్షి క్రీడా విభాగం -
‘దెయ్యాలు’ వెంటాడుతున్నాయి!
ఇంగ్లండ్ క్రికెటర్ల వణుకు హోటల్ గదుల్లో భయం.. భయంగా లండన్: ‘నేను ఆన్ చేయకుండానే బాత్రూమ్ కుళాయిలో నుంచి నీళ్లు వచ్చేశాయి. లైట్లు వేయగానే నీళ్లు ఆగిపోయాయి. లైట్లు ఆపివేయగానే మళ్లీ నీళ్లు వచ్చాయి. గది ఒక్కసారిగా వేడిగా మారిపోయింది. నాకు చాలా భయం వేసింది’ ఇదేదో హారర్ స్టోరీలో పేరా కాదు. ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఇటీవల తన హోటల్ రూమ్‌లో ఎదురైన అనుభవం. ఇంతకు ముందు శ్రీలంకతో సిరీస్‌లో దీని గురించి చెప్పుకోకుండా మౌనంగా ఉన్న పాపానికి ఇప్పుడు బ్రాడ్‌కు నిద్ర కరువైంది. భారత్‌తో సిరీస్‌లోనూ ఇంగ్లండ్ జట్టుకు ఇప్పుడు అదే హోటల్‌ను కేటాయించారు. 1865లో నిర్మించిన లండన్‌లోని ప్రతిష్టాత్మక (చారిత్రక) హోటల్ ‘లాంగమ్’లో టీమ్ అంతా ఉంటోంది. అయితే తమను దెయ్యాలు వెంటాడుతున్నాయని, వెంటనే గదులను మార్చమంటూ ఆటగాళ్లు మేనేజ్మెంట్ ముందు పోరు పెడుతున్నారు. ‘నా గర్ల్‌ఫ్రెండ్ చాలా భయపడుతోంది. మొయిన్ అలీ భార్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక బెన్ స్టోక్స్కీ నిద్ర పట్టడం లేదు. లంకతో టెస్టు సమయంలోనైతే రాత్రి 1.30 గంటలకు నా గదిలో ఎవరో తిరుగుతున్నట్లు అనిపించింది’ అని బ్రాడ్ ఆవేదనగా చెప్పాడు. ముఖ్యంగా హోటల్ మూడో అంతస్థులో... గది నంబర్ 333లో భూతాలు తిరుగుతున్నాయని ఆటగాళ్లు భావిస్తున్నారు. భయంతో బ్రాడ్, ప్రయర్ ఉన్న గదిని పంచుకునేందుకు సిద్ధం కాగా, స్టోక్స్ మూడో ఫ్లోర్ నుంచే మారాడు. ఈ హోటల్లో కనీసం ‘ఏడు’ దెయ్యాలు ఉన్నాయని ప్రచారం ఉంది! దీనిపై స్పందించడానికి హోటల్ వర్గాలు నిరాకరిస్తున్నా... ఇలాంటి నిద్ర లేని రాత్రులు తమ ఆటపై ప్రభావం చూపిస్తున్నాయని ఇంగ్లండ్ ఆటగాళ్లు చెబుతున్నారు. అన్నట్లు... 2005లో డర్హమ్లోని హోటల్లో కూడా ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైతే, భయంతో బయటికి వచ్చిన అతను బ్రెట్‌లీ రూమ్‌ను పంచుకున్నాడు!