కరాచీ : పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో వారు స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదే విషయమై పీఎస్‌ఎల్ నిర్వాహకులు అధికారికంగా ధృవీకరిస్తూ వారు స్వదేశానికి వెళ్లడానికి వీలుగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా ఇంగ్లండ్ ఆటగాళ్లలో జేసన్ రాయ్, మొయిన్ అలీ, టామ్ బాంటన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్డాన్‌లు లీగ్‌లో ఆడుతున్నారు. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లు వెళ్లిపోయినా లీగ్ మాత్రం యధాతథంగా కొనసాగుతుందని పీఎస్‌ఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది.కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించడంతో ఇక మీదట ఏ మ్యాచైనా సరే ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. కాగా లీగ్ జరుగుతున్న కరాచీ, సింధ్ ప్రావిన్స్‌లోనే కరోనా వైరస్ అధికంగా నమోదవ్వడం విశేషం. (ఐపీఎల్ 2020 వాయిదా)
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో వసీమ్ ఖాన్ మాట్లాడుతూ.. ' పీఎస్‌ఎల్ నుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు వెళ్లిపోవడమనేది వారిష్టం. కాగా కరోనా వేగంగా విస్తరిస్తున్న వేళ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్న ఆటగాళ్ల పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇక మీదట అన్ని మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా జరగనున్నాయి. సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అక్కడ జరగాల్సిన ఐదు మ్యాచ్‌లనూ కరాచీలోనే నిర్వహించనున్నాము. ఇక లీగ్‌లో ఆటోబయోగ్రాప్‌లు, సెల్సీలు, కరచాలనాలకు ఆటగాళ్లు దూరంగా ఉండాలని సూచించాము' అని తెలిపాడు.(రంజీ చరిత్రలో సౌరాష్ట్ర నయా రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment