లండన్: శ్రీలంకను పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఊదేసిన ఇంగ్లండ్ జట్టును కరోనా వైరస్ చుట్టుముట్టింది. ముగ్గురు ఆటగాళ్లతో పాటు నలుగురు సహాయక సిబ్బందికి కోవిడ్ సోకింది. ఇలా ఏకంగా ఏడుగురు వైరస్ బారిన పడటంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఉలిక్కి పడింది. ఇక చేసేదేమీ లేక పాకిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు జట్టును మార్చేసింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో పూర్తిగా కొత్త జట్టును ప్రకటించింది.
18 మందిలో సగం మంది కొత్త ముఖాలే! లంకతో ఆడినట్లుగానే పాక్‌తో కూడా ఇంగ్లండ్ జట్టు మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడనుంది. గురువారం కార్డిఫ్‌లో జరిగే తొలి వన్డేతో ఇంగ్లండ్, పాక్ సిరీస్ మొదలవుతుంది. ఇదిలావుండగా కరోనా బారిన పడిన క్రికెటర్ల పేర్లుగానీ సహాయ సిబ్బందిలో ఎవరెవరికి సోకిందనే విషయాలు ఈసీబీ బయటకు వెల్లడించలేదు. మొత్తం జట్టును ఐసోలేషన్‌లో ఉంచింది. కోవిడ్ సోకిన ఏడు మందితో టచ్‌లో ఉన్న ఇంకెంతమందికి వైరస్ సోకు తుందోనని ఈసీబీ ఆందోళన పడుతుంది.
ఇంగ్లండ్ వన్డే జట్టు: స్టోక్స్ (కెప్టెన్), జేక్‌బాల్, బ్రిగ్స్, కేర్స్, క్రావ్లీ, డకెట్, గ్రేగొరి, హెల్మ్, జాక్స్, లారెన్స్, సాఖిబ్, మలాన్, ఓవర్టన్, పార్కిన్సన్, పేన్, సాల్ట్, సింప్సన్, విన్స్.
Comments
Please login to add a commentAdd a comment