Ashes 2023: ENG Cricketers Swap Jerseys In Support Dementia Patients - Sakshi
Sakshi News home page

Ashes 2023: ఒకరి జెర్సీని మరొకరు.. 'మతిమరుపు' గానీ వచ్చిందా?

Published Sat, Jul 29 2023 6:32 PM | Last Updated on Sat, Jul 29 2023 6:43 PM

Ashes 2023: ENG-Cricketers Swap Jerseys In Support Dementia Patients - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి రోజు ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయితే.. రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ బౌలర్లు ఆలౌట్‌ చేశారు. కాగా ఆసీస్‌ కేవలం 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.

మూడోరోజు ఆటలో లంచ్‌ విరామ సమయానికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 138 పరుగులు చేసింది. జాక్‌ క్రాలీ 75 బంతుల్లో 73 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. స్టోక్స్‌ కూడా 30 బంతుల్లో 20 పరుగులతో దాటిగా ఆడుతూ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 128 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇక మూడో రోజు ఆటలో  ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ఒక‌రి జెర్సీని మ‌రొక‌రు ధరించారు. ఇది చూసిన అభిమానులకు కాసేపు అర్థం కాలేదు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మరిచిపోయి ఒకరి జెర్సీ ఒకరు వేసుకున్నారేమోనని అభిప్రాయపడ్డారు. నిజానికి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఇలా జెర్సీలను మార్చుకోవడానికి ఒక కారణం ఉంది.

అల్జీమర్స్‌(Dementia-మతిమరుపు)వ్యాధితో బాధ‌ప‌డుతున్న వాళ్ల‌కు మ‌ద్ద‌తుగా బెన్ స్టోక్స్ బృందం ఒకరి జెర్సీలు మరొకరు ధరించారు. కెప్టెన్ స్టోక్స్ వికెట్ కీప‌ర్ జానీ బెయిర్‌స్టో జెర్సీ వేసుకున్నాడు. మోయిన్ అలీ మాజీ కెప్టెన్ జోరూట్ జెర్సీతో వ‌చ్చాడు. జేమ్స్ అండ‌ర్స్ మ‌రో పేస‌ర్ స్టువార్ట్ బ్రాడ్ జెర్సీతో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఒక్క చోట చేరారు. అల్జీమ‌ర్స్ సొసైటీ స‌భ్యులు ఆల‌పించిన పాట విన్నారు. ఆ తర్వాత మూడోరోజు ఆటను ప్రారంభించారు.

అల్జీమ‌ర్స్ అనేది ఒక వృద్దాప్య స‌మ‌స్య‌. 60 ఏళ్లు పైబ‌డిన వాళ్ల‌లో రోజు రోజుకు మ‌తిమ‌రుపు పెరుగుతుంటుంది. దాంతో, వాళ్లు అన్ని విష‌యాలు మ‌ర్చిపోతారు. కుటుంబ‌సభ్యుల‌ను, ప్రాణ స్నేహితుల‌ను కూడా గుర్తుప‌ట్టలేని ప‌రిస్థితిలో ఉంటారు. డిమెన్షియా వల్ల వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

చదవండి: ICC ODI WC 2023: గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 10 నుంచి వన్డే వరల్డ్‌కప్‌ టికెట్లు అందుబాటులో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement