లండన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలో (లండర్ టైమ్స్) ఆ దేశ క్రికెటర్లకు (ఇంగ్లండ్) సంబంధించిన ఓ సంచలన కథనం ప్రసారమైనట్లు భారత దేశ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. టాప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు ఆరుగురు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారన్నది ఆ కథనం సారాంశం.
సదరు క్రికెటర్లు ఇంగ్లండ్ జాతీయ జట్టును వదిలిపెట్టి, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో (ఈసీబీ) అనుసంధానమైన ఏ జట్టులో (కౌంటీలు) ఆడకుండా, తమతో ఒప్పందం కుదుర్చుకుంటే ఏడాదికి రూ. 50 కోట్లు ఇస్తామని ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆఫర్ చేశాయట.
చదవండి: RCB VS KKR: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
పీఎస్‌ఎల్, బీపీఎల్‌లో ఆడకూడదు..
ఆటగాళ్లు ఆఫర్‌కు ఓకే చెబితే ఏడాది మొత్తం ఫ్రాంచైజీకి సంబంధించిన వివిధ జట్ల తరఫున దేశవ్యాప్తంగా జరిగే క్రికెట్ లీగ్‌ల్లో ఆడాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీలు లేని పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ల్లో ఆటగాళ్లు ఆడటం నిషేధం.
లండర్ టైమ్స్ కథనంలో ఆ ఆరుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎవరు, వారిని సంప్రదించిన ఫ్రాంచైజీలు ఏవి అన్న వివరాలు వెల్లడించలేదని పీటీఐ తెలిపింది. కాగా, ఐపీఎల్‌లోని దాదాపు అన్ని ఫ్రాంచైజీలు విశ్వవ్యాప్తంగా జరిగే ప్రముఖ క్రికెట్ లీగ్‌ల్లో జట్లను కలిగి ఉన్న విషయం తెలిసిందే.
వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్‌ఏ టీ20 లీగ్, యూఏఈ వేదికగా జరిగే ఐఎల్ టీ20 లీగ్, త్వరలో యూఎస్‌ఏలో జరుగబోయే మేజర్ క్రికెట్ లీగ్‌ల్లో మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు వివిధ జట్లను కొనుగోలు చేశాయి.
చదవండి: IPL 2023: గుజరాత్, లక్నో మ్యాచ్ ఫిక్సైంది..!
'
Comments
Please login to add a commentAdd a comment