ఐపీఎల్ యాజమాన్యం, ఫ్రాంచైజీల మధ్య బుధవారం (జులై 31) జరిగిన కీలక సమావేశంలో రిటెన్షన్, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, ఆర్‌టీఎం, పర్స్ విలువ పెంపు వంటి అంశాలతో పాటు మరో కీలక అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. సరైన కారణాలు లేకుండా మ్యాచ్‌లు ఆడకుండా తప్పించుకునే విదేశీ ఆటగాళ్లపై కొరడా ఝులిపించాలని ఫ్రాంచైజీ యజమానులు ఐపీఎల్‌ను కోరారని సమాచారం.
ఇలాంటి ఆటగాళ్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించాలని అన్ని ఫ్రాంచైజీలు ముక్తకంఠంతో డిమాండ్ వినిపించినట్లు తెలుస్తుంది. అలాగే విదేశీ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనడాన్ని తప్పినిసరి చేయాలని ఫ్రాంచైజీలు కోరినట్లు సమాచారం. ఈ అంశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తుంది.
ఫ్రాంచైజీ ఓనర్లతో జరిగిన చర్చల్లో ఈ క్రింది అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తుంది.
క్యాష్ రిచ్ లీగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగనున్నట్లు తెలుస్తుంది.
అన్ని ఫ్రాంచైజీలు ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ముగ్గురు అన్ క్యాప్‌డ్ ప్లేయర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
రైట్ టు మ్యాచ్ (RTM) ద్వారా ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో ఆటగాడిని దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
వచ్చే సీజన్ నుంచి ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ పెరుగనుందని సమాచారం.
మెగా వేలం ఐదేళ్లకు ఒకసారి జరగనున్నట్లు తెలుస్తుంది.
కాగా, ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఈ ఏడాది చివర్లో మెగా వేలం ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు అన్ని ఫ్రాంచైజీలకు నలుగురు ఆటగాళ్లను మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. ఈ సంఖ్య పెంపుపై ఫ్రాంచైజీలు ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment