IPL franchises
-
IPL: కారణం లేకుండా డుమ్మా కొడితే రెండేళ్లు నిషేధం..?
ఐపీఎల్ యాజమాన్యం, ఫ్రాంచైజీల మధ్య బుధవారం (జులై 31) జరిగిన కీలక సమావేశంలో రిటెన్షన్, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, ఆర్టీఎం, పర్స్ విలువ పెంపు వంటి అంశాలతో పాటు మరో కీలక అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. సరైన కారణాలు లేకుండా మ్యాచ్‌లు ఆడకుండా తప్పించుకునే విదేశీ ఆటగాళ్లపై కొరడా ఝులిపించాలని ఫ్రాంచైజీ యజమానులు ఐపీఎల్‌ను కోరారని సమాచారం. ఇలాంటి ఆటగాళ్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించాలని అన్ని ఫ్రాంచైజీలు ముక్తకంఠంతో డిమాండ్ వినిపించినట్లు తెలుస్తుంది. అలాగే విదేశీ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనడాన్ని తప్పినిసరి చేయాలని ఫ్రాంచైజీలు కోరినట్లు సమాచారం. ఈ అంశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తుంది.ఫ్రాంచైజీ ఓనర్లతో జరిగిన చర్చల్లో ఈ క్రింది అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తుంది.క్యాష్ రిచ్ లీగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగనున్నట్లు తెలుస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ముగ్గురు అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్ టు మ్యాచ్ (RTM) ద్వారా ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో ఆటగాడిని దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే సీజన్ నుంచి ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ పెరుగనుందని సమాచారం. మెగా వేలం ఐదేళ్లకు ఒకసారి జరగనున్నట్లు తెలుస్తుంది.కాగా, ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఈ ఏడాది చివర్లో మెగా వేలం ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు అన్ని ఫ్రాంచైజీలకు నలుగురు ఆటగాళ్లను మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. ఈ సంఖ్య పెంపుపై ఫ్రాంచైజీలు ఐపీఎల్ మేనేజ్మెంట్పై ఒత్తిడి చేస్తున్నాయి. -
MajorLeagueCricket: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా పొలార్డ్
ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఓ టీ20 లీగ్‌ను నిర్వహించడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో అమెరికా వేదికగా మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) టోర్నీ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటుండగా నాలుగు టీమ్‌లు ఐపీఎల్ యాజమాన్యాలకు (ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై) చెందినవే ఉన్నాయి. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. సీఎస్కే మాదిరిగానే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ ను కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్:.. సియాటెల్ ను దక్కించుకుంది. అభిమానులు ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా భావిస్తున్నారు. న్యూయర్క్ కెప్టెన్‌గా పొలార్డ్ ఇక మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో ఏంఐ న్యూయర్క్ కెప్టెన్‌గా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కిరాన్ పొలార్డ్ ఎంపికయ్యాడు. అదేవిధంగా ఏంఐ న్యూయర్క్ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ పీటర్సన్, బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆఫ్ఘన్ సూపర్ స్టార్ రషీద్ ఖాన్, కగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఏంఐ న్యూయర్క్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. వీరితో పాటు యువ ఆటగాళ్లు టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఉన్నారు. కాగా జులై 13 నుంచి ఈ క్రేజీ లీగ్ మొదలుకానున్నది. చదవండి: Nahida Khan Retirement: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ -
ఏడాదికి 50 కోట్లు ఇస్తాం.. దేశానికి ఆడకండి.. ఐపీఎల్ ఫ్రాంచైజీల బంపర్ ఆఫర్
లండన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలో (లండర్ టైమ్స్) ఆ దేశ క్రికెటర్లకు (ఇంగ్లండ్) సంబంధించిన ఓ సంచలన కథనం ప్రసారమైనట్లు భారత దేశ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. టాప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు ఆరుగురు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారన్నది ఆ కథనం సారాంశం. సదరు క్రికెటర్లు ఇంగ్లండ్ జాతీయ జట్టును వదిలిపెట్టి, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో (ఈసీబీ) అనుసంధానమైన ఏ జట్టులో (కౌంటీలు) ఆడకుండా, తమతో ఒప్పందం కుదుర్చుకుంటే ఏడాదికి రూ. 50 కోట్లు ఇస్తామని ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆఫర్ చేశాయట. చదవండి: RCB VS KKR: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు పీఎస్ఎల్, బీపీఎల్‌లో ఆడకూడదు.. ఆటగాళ్లు ఆఫర్‌కు ఓకే చెబితే ఏడాది మొత్తం ఫ్రాంచైజీకి సంబంధించిన వివిధ జట్ల తరఫున దేశవ్యాప్తంగా జరిగే క్రికెట్ లీగ్‌ల్లో ఆడాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీలు లేని పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ల్లో ఆటగాళ్లు ఆడటం నిషేధం. లండర్ టైమ్స్ కథనంలో ఆ ఆరుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎవరు, వారిని సంప్రదించిన ఫ్రాంచైజీలు ఏవి అన్న వివరాలు వెల్లడించలేదని పీటీఐ తెలిపింది. కాగా, ఐపీఎల్‌లోని దాదాపు అన్ని ఫ్రాంచైజీలు విశ్వవ్యాప్తంగా జరిగే ప్రముఖ క్రికెట్ లీగ్‌ల్లో జట్లను కలిగి ఉన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్ఏ టీ20 లీగ్, యూఏఈ వేదికగా జరిగే ఐఎల్ టీ20 లీగ్, త్వరలో యూఎస్ఏలో జరుగబోయే మేజర్ క్రికెట్ లీగ్‌ల్లో మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు వివిధ జట్లను కొనుగోలు చేశాయి. చదవండి: IPL 2023: గుజరాత్, లక్నో మ్యాచ్ ఫిక్సైంది..! ' -
వేలంలో 405 మంది ఆటగాళ్లు.. షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 కోసం డిసెంబర్ 23న మినీవేలం జరగనుంది. వేలంలో పాల్గొనబోయేవారిని ఆయా ఫ్రాంచైజీలు షార్ట్‌లిస్ట్ చేశాయి. మొత్తంగా 991 ప్లేయర్లలో 405 మంది వేలంలోకి రానున్నారు. ఇంతకుముందు 369 మందిని షార్ట్ లిస్ట్ చేయగా.. తాజాగా ఫ్రాంఛైజీలు మరో 36 మందిని ఇందులో చేర్చాల్సిందిగా కోరాయి. దీంతో మొత్తం వేలంలో పాల్గొనే ప్లేయర్స్ సంఖ్య 405కి చేరింది. ఈసారి మినీ వేలానికి కొచ్చి వేదిక కానుంది. ఈ మొత్తం 405 మంది ప్లేయర్స్‌లో 273 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. 132 మంది విదేశీ ప్లేయర్స్. వీళ్లలో నలుగురు ఐసీసీ అసోసియేట్ దేశాలకు చెందిన వాళ్లు. ఈ మొత్తం 405 మంది ప్లేయర్స్‌లో 119 మంది ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు. ఇక 282 మంది తమ నేషనల్ టీమ్స్‌కు ఆడని వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం పది ఫ్రాంఛైజీలకు మొత్తం 87 మంది ప్లేయర్స్‌ను తీసుకునే అవకాశం ఉంది. వీళ్లలో 30 వరకూ విదేశీ ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు. ఇక వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ అయిన రూ.2 కోట్లతో 19 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ లేరు. 11 మంది రూ.1.5 కోట్ల కనీస ధరతో ఉన్నారు. ఇక రూ.కోటి బేస్‌ప్రైస్‌తో 20 మంది ఉండగా.. అందులో మయాంక్ అగర్వాల్, మనీష్ పాండేలాంటి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఐపీఎల్ వేలం డిసెంబర్ 23న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. రూ.2 కోట్ల లిస్ట్‌లో ప్లేయర్స్: కౌల్టర్ నైల్, కామెరున్ గ్రీన్, ట్రెవిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమాల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్న్, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వెండెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్. రూ.1.5 కోట్ల లిస్ట్‌లోని ప్లేయర్స్: సీన్ అబాట్, రైలీ మెరెడిత్, జై రిచర్డసన్, ఆడమ్ జంపా, షకీబుల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జేసన్ రాయ్, షెర్ఫానె రూథర్‌ఫర్డ్ రూ.కోటి లిస్ట్‌లోని ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్, మోయిసిస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షంసీ, కుశాల్ పెరీరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షెయ్ హోప్, అకీల్ హొస్సేన్, డేవిడ్ వీస్ 🚨 NEWS 🚨: TATA IPL 2023 Player Auction list announced. #TATAIPLAuction Find all the details 🔽https://t.co/fpLNc6XSMH — IndianPremierLeague (@IPL) December 13, 2022 చదవండి: Steve Smith: ఎలుకలపై కోపం.. అందుకే చిరిగిన క్యాప్‌తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కన్నెర్ర చేసిన ఐసీసీ.. 8 నెలల్లో రెండోసారి -
'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన.. బీసీసీఐ షాకింగ్ ట్విస్ట్!
బీసీసీఐ ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా సబ్‌స్టిట్యూట్ అంటే ఫీల్డర్ గాయపడితే అతని స్థానంలో మైదానంలోకి వస్తాడు. కానీ అతనికి ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండదు. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడికి బ్యాటింగ్, బౌలింగ్ చేసేలా బీసీసీఐ ''ఇంపాక్ట్ ప్లేయర్'' పేరిట కొత్త నిబంధన తీసుకొచ్చింది. దేశవాలీ టోర్నీలో హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకురానున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఈ రూల్ ప్రకారం.. ప్రతీ జట్టు మ్యాచ్ కు ముందు నలుగురు ప్లేయర్లను సబ్ స్టిట్యూట్స్ గా ప్రకటించాలి. 14 ఓవర్ల ఆట తర్వాత ఈ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌పై చర్చ జరుగుతుండగానే బోర్డు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాకిచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కేవలం ఇండియన్ ప్లేయర్స్ కే వర్తింపజేయనున్నదట. లీగ్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లకు ఈ రూల్ వర్తించదని సమాచారం. ఈ రూల్ విదేశీ ప్లేయర్లకు వర్తించకపోవడానికి గల కారణాలను జట్లకు క్షుణ్ణంగా తెలిపినట్టు సమచారం. నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీ మ్యాచ్ లో నలుగురు ఫారెన్ ప్లేయర్లను మాత్రమే ఆడించేందుకు అనుమతి ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ ను అమలుచేస్తే అప్పుడు ఐదుగురు ఫారెన్ ప్లేయర్లను ఆడించినట్టు అవుతుంది. అది నిబంధనలకు విరుద్ధం. అందుకే ఈ రూల్‌ను కేవలం భారత క్రికెటర్లకే వర్తిస్తుందని బీసీసీఐ ఫ్రాంచైజీలకు వివరించే ప్రయత్నం చేసింది. ఒకవేళ ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకుంటే అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను వాడుకోవచ్చా..? అని ఫ్రాంచైజీలు ప్రశ్నించాయి. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక త్వరలో జరుగనున్న ఐపీఎల్ వేలం అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. చదవండి: Impact Player: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కొత్త నిబంధన అమల్లోకి -
ILT20: జట్టును ప్రకటించిన షార్జా వారియర్స్.. మోయిన్ అలీతో పాటు!
యూఏఈ టీ20 లీగ్ తొలి సీజన్ కోసం అంతర్జాతీయ ఆటగాళ్ల జాబితాను షార్జా వారియర్స్ శుక్రవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు మోయిన్ అలీ,డేవిడ్ మలన్‌తో పాటు ఎవిన్ లూయిస్, మొహమ్మద్ నబీ, క్రిస్ వోక్స్ వంటి ఆటగాళ్లతో షార్జా ఒప్పందం కుదర్చుకుంది. కాగా షార్జా వారియర్స్ ఫ్రాంచైజీను భారత్ ఆధారిత కంపెనీ కాప్రి గ్లోబల్ కొనుగోలు చేసింది. ఇక ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వాటిలో ఐదు జట్లును ఐపీఎల్ ప్రాంఛైజీలే దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇప్పటికే దుబాయ్ క్యాపిటల్స్,ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తాము ఒప్పందం కుదుర్చుకున్న జాబితాను విడుదల చేశాయి. షార్జా వారియర్స్ జట్టు: మొయిన్ అలీ (ఇంగ్లండ్), డేవిడ్ మలన్ (ఇంగ్లండ్), ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్థాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్థాన్), ), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (ఇంగ్లాండ్), క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), డానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్), మార్క్ దేయల్ (వెస్టిండీస్), బిలాల్ ఖాన్ (ఒమన్) మరియు జేజే స్మిత్ (నమీబియా) ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ సభ్యులు: పోలార్డ్(వెస్టిండీస్), బ్రావో(వెస్టిండీస్), నికోలస్ పూరన్(వెస్టిండీస్), బౌల్ట్(న్యూజిలాండ్), ఫ్లెచర్(వెస్టిండీస్), ఇమ్రాన్ తాహిర్(సౌతాఫ్రికా), సమిత్ పటేల్ (ఇంగ్లాడ్) , విల్ స్మీడ్(ఇంగ్లాడ్), జోర్డాన్ థామ్సన్(ఇంగ్లాడ్), నిజబుల్హా జోర్ధార్ (ఆఫ్ఘనిస్తాన్), జహీర్ ఖాన్(ఆఫ్ఘనిస్తాన్), ఫజల్ హుక్(ఆఫ్ఘనిస్తాన్), బ్రాడ్లే(స్కాట్లాండ్), లీడ్ (నెదర్లాండ్). దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: రోవ్‌మన్ పావెల్, హజ్రతుల్లా జజాయ్, డేనియల్ లారెన్స్, జార్జ్ మున్సే, భానుక రాజపక్సే, నిరోషన్ డిక్వెల్లా, సికందర్ రజా, దాసున్ షనక, ఫాబియన్ అలెన్, ఇసురు ఉదానా, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీర, ఫ్రెడ్ క్లాస్సేన్,ముజారబానీ చదవండి: T20 WC 2022: ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలకు బంగ్లాదేశ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్! -
బుడగ దాటితే బంతాటే..! కఠినమైన బయోబబుల్ రూల్స్‌ను అమల్లోకి తేనున్న బీసీసీఐ
IPL 2022 Bio Bubble Rules: మరో పది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 15వ సీజన్ కోసం బీసీసీఐ కఠినమైన బయో బబుల్ నిబంధనలను సిద్ధం చేసింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది అనుభవాల దృష్ట్యా ఈసారి రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. ఎవరైనా ఆటగాడు బుడగ దాటితే తొలిసారికి ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్, రెండో ఉల్లంఘనకు ఓ మ్యాచ్ నిషేధం, మూడోసారి బుడగ దాటితే ఏకంగా లీగ్ నుంచే గెంటివేత తప్పదని గట్టిగా హెచ్చరించింది. ఈ పరిస్థితి ఎదురైతే, ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా అనుమతించరని పేర్కొంది. ఇక, ఫ్రాంచైజీల విషయానికొస్తే.. ఎవరైనా ఆటగాడు/ ఫ్రాంచైజీ సభ్యుడు తొలిసారి బుడగ దాటితే సదరు ఫ్రాంచైజీకి రూ. కోటి జరిమానా, రెండో సారి ఇదే జరిగితే ఒక పాయింట్ కోత, మూడో సారికైతే రెండు పాయింట్ల కోత ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. బయోబబుల్ నిబంధనలు ఫ్రాంచైజీలు, సభ్యుల వరకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఉంటాయని.. కుటుంబ సభ్యుల మొదటి ఉల్లంఘనకు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ (ఉల్లంఘించిన వారికి సంబంధించిన ఆటగాడు కూడా ఏడు రోజుల క్వారంటైన్లో గడపాల్సిందే), రెండో సారికి బుడగ నుంచి తొలగిస్తారని వివరించింది. దీంతో పాటు కోవిడ్ టెస్ట్‌కు నిరాకరించే వ్యక్తులకు తొలిసారి మందలింపు, రెండోసారికి రూ. 75వేల జరిమానాతో పాటు స్టేడియంలోకి అనుమతి నిరాకరణ ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. చదవండి: ఐపీఎల్లో సరికొత్త రూల్స్.. ఇకపై! -
IPL 2022: ఐపీఎల్ ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాక్
ఐపీఎల్ ప్రారంభానికి (మార్చి 26) ముందు ప్రాక్టీస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని ఆటగాళ్లను సానబెడదామనుకున్న ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో ఉన్న సభ్యులు మినహాయించి బీసీసీఐ కాంట్రాక్ట్, నాన్ కాంట్రాక్ట్ నేషనల్ లెవెల్ ప్లేయర్లంతా (రంజీ ప్లేయర్లు మార్చి 6లోగా) మార్చి 4లోపు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో నిర్వహించతలపెట్టిన 10 రోజుల ఫిట్నెస్ క్యాంప్‌కు హాజరు కావాలని బీసీసీఐ ఆదేశించింది. సెలెక్షన్ కమిటీ ఆదేశాల మేరకు ఆటగాళ్ల ఫిట్నెస్, తదితర అంశాలపై దృష్టి సారించేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రకటనకు ముందు ఆటగాళ్లను మార్చి 8లోగా క్యాంపులకు చేరుకోవాలని ఆయా ఫ్రాంచైజీలు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్సీఏ క్యాంప్‌కు హాజరు కావాల్సిన కీలక ఐపీఎల్ ఆటగాళ్లు : కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, సంజూ శాంసన్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్. వీరిలో కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ గాయాల బారిన పడి ఇప్పటికే ఎన్సీఏలో ఉన్నారు. చదవండి: IPL 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కీలక ఆదేశం -
IPL 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కీలక ఆదేశం
ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో లీగ్‌లో పాల్గొనబోయే 10 జట్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 8 నుంచి జట్లన్నీ ముంబైకు చేరుకోవచ్చని తెలిపింది. కోచింగ్, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీల ప్రతినిధులు, అందుబాటులో ఉన్న ఆటగాళ్లంతా జట్లతో పాటు ముంబై చేరుకోవాలని పేర్కొంది. భారత్‌లోనే ఉన్నవారైతే మూడు రోజులు, విదేశాల నుంచి వచ్చే వారైతే ఐదు రోజుల పాటు క్వారంటైన్లో తప్పక గడపాల్సి ఉంటుందని ఆదేశించింది. ముంబైకి రావడానికి రెండు రోజుల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్డును మాత్రమే బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందని ప్రకటించింది. మార్చి 14, 15వ తేదీల నుంచి ఆయా జట్లు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించుకోవచ్చని సూచించింది. కాగా, మార్చి 26 నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్ 2022 సీజన్లో మొత్తం 70 మ్యాచ్‌లు జరగుతాయని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. 55 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్ స్టేడియాల్లో.. మిగిలిన 15 మ్యాచ్‌లు పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయని బీసీసీఐ వెల్లడించింది. చదవండి: కోహ్లి వందో టెస్ట్‌లో సెంచరీ కొట్టాలి.. ఆ మ్యాచ్ చూసేందుకు నేను కూడా వస్తా..! -
'విజయ్ హజారే, బీబీఎల్, ఎల్పీఎల్పై కన్నేసి ఉంచండి'
IPL Scouts Keep Eyes On Vijay Hazare, BBL 2021 & LPL 2021.. జనవరిలో ఐపీఎల్ మెగావేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను కూడా ప్రకటించాయి. ఇక వచ్చే ఐపీఎల్‌కు అహ్మదాబాద్, లక్నోల రూపంలో కొత్త ఫ్రాంచైజీలు రానుండడంతో మెగావేలంపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయా ఫ్రాంచైజీలు తమకు సమాచారం అందించే స్కౌట్స్‌కు పెద్ద పని అప్పజెప్పింది. మెగావేలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ, బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021), లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)పై ఒక కన్నేసి ఉంచాలని తెలిపాయి. జై రిచర్డ్సన్(రూ.14 కోట్లు, పంజాబ్ కింగ్స్) భారీ హిట్టింగ్ చేస్తూ మ్యాచ్‌లను గెలిపించే యువ ఆటగాళ్లను వెతికి పట్టుకోవాలని.. వారిని వేలంలో దక్కించుకోవడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు రచించాలని ఆయా ఫ్రాంచైజీలు కోరాయి. ఇంతకముందు కూడా జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్ లాంటి ఆటగాళ్లు బీబీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. ఇక విజయ్ హజారే ట్రోపీ ద్వారా పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ లాంటి వారికి గుర్తింపు రావడం.. ఆ తర్వాత ఐపీఎల్లో దుమ్మురేపడం చూశాం. ఇక టి20 ప్రపంచకప్ 2021లో హ్యాట్రిక్‌తో మెరిసిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రస్తుతం ఎల్పీఎల్లో బిజీగా ఉన్నాడు. అతనితో పాటు మరికొంతమంది ఆటగాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. -
IPL: లక్నో ఫ్రాంచైజీ @ రూ.7,090 కోట్లు: టోర్నీ ఎలా మారబోతోంది? ఎన్ని మ్యాచ్‌లు?
పోలా... అదిరిపోలా! ఐపీఎలా మజాకా... మైదానంలో ఓ బ్యాట్, ఓ బాల్ ఆడే ఆట కోట్లకు, కోటాను కోట్లకు, రూ.వేలకోట్లకు అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. మళ్లీ లీగ్‌ను పది జట్ల విస్తృతి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నం రూ. 12,715 కోట్లు కురిపించింది. గోయెంకా గ్రూప్ అదానీని తలదన్నేసింది. అహ్మదాబాద్, లక్నోలపై ఎవరి ఊహకందని విధంగా రూ.7,090 కోట్లతో బిడ్ వేసింది. రెండింటిలో ఒకటి ఎంచుకునే అవకాశం కొట్టేసింది. చివరకు లక్నోవైపే మొగ్గు చూపింది. IPL New Teams Lucknow Ahmedabad : ఐపీఎల్‌లోకి వచ్చేందుకు ఎన్నో అంచనాలు రేకెత్తించిన అదానీ గ్రూప్... మ్యాచ్ దాకా కాదు కదా... కనీసం టాస్ దాకా అయినా రాలేకపోయింది. సోమవారం టెండర్లు తెరువగా... భారత కార్పొరేట్ సంస్థ గోయెంకా గ్రూప్, అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్)లు వరుసగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. ప్రాధాన్యక్రమంలో ఉన్న అహ్మదా బాద్‌ను కాదని తను మొదటి నుంచి కన్నేసిన లక్నోనే గోయెంకా గ్రూప్ ఎంచుకుంది. ఇందుకోసం రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా (ఆర్పీఎస్జీ) వెంచర్స్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్ డాలర్లు) వెచ్చించింది. ప్రపంచ వ్యాప్తంగా 22 కంపెనీలు బిడ్డింగ్‌పై ఆసక్తి కనబరిచాయి. చివరకు 9 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా అత్యధిక మొత్తం గోయెంకా గ్రూప్‌దే! ఐరిలియా కంపెనీ (సీవీసీ క్యాపిటల్) రూ. 5,625 కోట్లతో అహ్మదాబాద్‌ను దక్కించుకుంది. కొన్నాళ్లుగా వార్తల్లో, అంచనాల్లో... చివరకు బిడ్డర్ల జాబితాలో కూడా తొలి స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ రూ.5,100 కోట్లతో ఏ ఒక్క నగరాన్ని దక్కించుకోలేక వెనక్కి వెళ్లిపోయింది. ఏదేమైనా మన క్రికెట్ బోర్డు భాండాగారం మరింత బరువెక్కింది. రెండు ఫ్రాంచైజీలతోనే ఏకంగా రూ. 12,715 కోట్లు (సుమారు 1.7 బిలియన్ డాలర్లు) జమ చేసుకుంది. నిజానికి బోర్డు అంచనా వేసు కున్న మొత్తం రూ. 7 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లే! కానీ అంచనాను మించి రూ. 2,715 కోట్లు ఎక్కువ మొత్తం వచ్చింది. 2022లో జరిగే ఐపీఎల్ –15 సీజన్లో ఈ రెండు జట్లు బరిలోకి దిగుతాయి. ఐపీఎల్ విస్తరణ, టెండర్ల కంటే ముందే... అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియం మొదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్ ఐపీఎల్ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఒకానొక దశలో అదానీ జట్టు కోసమే లీగ్ విస్తరణ అనే గుసగుసలు వినిపించాయి. ఇంకా చెప్పాలంటే అహ్మదాబాద్, లక్నోల్లో ఆరునూరైనా అహ్మదాబాద్ అదానీదే అన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా గతేడాది కాలంగా రోజుకు రూ. 1,000 కోట్లకుపైగా ఆర్జించిన సంస్థ కావడంతో బీసీసీఐ లీగ్ విస్తరణ ప్రకటన నుంచే... మీడియాలో ప్రచురితమైన ప్రతీ వార్తలో అదానీ పేరు కనిపించింది. చివరకు 9 సంస్థలు పాల్గొన్న బిడ్డింగ్‌లో మూడో స్థానంతో అదానీ గ్రూప్ కంగుతినడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సీవీసీ క్యాపిటల్ ఎక్కడిది? లండన్ ప్రధాన కేంద్రంగా లక్జెంబర్గ్‌కు చెందిన ఈక్విటీ కంపెనీ సీవీసీ క్యాపిటల్. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ. ప్రధానంగా సేవల రంగానికి చెందిన ఈ సంస్థ 37 దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 300పైగా పెట్టుబడిదారులకు ఫండ్ మేనేజ్మెంట్ సేవలందిస్తోంది. మనదేశంలో బెంగళూరు కేంద్రంగా హెల్త్‌కేర్ రంగంలో ఉంది. అలాగే యునైటెడ్ లెక్స్ పేరుతో ఔట్సోర్సింగ్ సేవలు అందిస్తోంది. ఐపీఎల్‌కు కొత్తకావొచ్చేమో కానీ... క్రీడలతో సీవీసీకి సుదీర్ఘ బంధముంది. 2006 నుంచి 2017 వరకు ఫార్ములావన్‌లో మెజారిటీ స్టేక్‌హోల్డర్‌గా కొనసాగింది. సాకర్ క్రేజ్ యూరోప్‌లో ఫుట్‌బాల్, రగ్బీలపై కూడా సంస్థ పెట్టుబడులున్నాయి. గోయెంకా మనకు తెలిసిందే... గోయెంకా గ్రూప్ కోల్‌కతాకు చెందిన భారతీయ బహుళజాతి సంస్థ. దివంగత వ్యాపారవేత్త, టేకోవర్ కింగ్‌గా పేరుగాంచిన రాజీవ్ ప్రతాప్ గోయెంకా (ఆర్పీజీ) తన పేరుమీద స్థాపించిన సంస్థ. ఆయన తనయుడు సంజీవ్ గోయెంకా తండ్రి పేరును జత చేసి ఆర్పీఎస్జీ వెంచర్స్ లిమిటెడ్‌తో టెండరు వేసి గెలిచారు. ‘స్పెన్సర్స్’ హైపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ వాళ్లవే. అలా మన వంటింటి నేస్తమైంది. ఇంకా ఐటీ, విద్యుత్, ఎఫ్ఎమ్సీజీ, మీడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ రంగాల్లో గోయెంకా గ్రూప్ విస్తరించింది. కోల్‌కతా మహానగరానికి వెలుగులు నింపుతున్న ఏకైక విద్యుత్ పంపిణీ సంస్థ కలకత్త ఎలెక్ట్రిక్ సప్లయ్ కార్పోరేషన్ (సీఈఎస్సీ) గోయెంకాదే. ఉత్తర ప్రదేశ్‌లో కూడా విద్యుత్ పంపిణీ చేస్తోంది. పైగా ఐపీఎల్‌కు గోయెంకా గ్రూప్ కొత్తేం కాదు. 2016, 2017 సీజన్లలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ పేరుతో ఆడింది కూడా! ఐఎస్ఎల్ (ఫుట్‌బాల్ లీగ్)లో ఏటీకే మోహన్ బగాన్ ఎఫ్‌సీ యజమాని కూడా! ఎప్పట్లాగే 14 మ్యాచ్‌లే! ఇన్నాళ్లు 8 జట్లు ఆడినట్లే ఇకపైనా 10 జట్లు కూడా లీగ్ దశలో 14 మ్యాచ్‌లే ఆడతాయి. అయితే రెండు జట్ల వల్ల మ్యాచ్‌ల సంఖ్య మాత్రం 74కు చేరింది. అయితే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 5 జట్లు తలపడతాయి. ఈ ఐదు జట్ల మధ్య ఇంటా (4), బయటా (4) ఎనిమిది మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం అవతలి గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్, ఒక్క జట్టుతో మాత్రం రెండు మ్యాచ్‌లు ఆడటం ద్వారా 14 మ్యాచ్‌లు పూర్తవుతాయి. చదవండి: T20 World Cup 2021: అఫ్గన్ సంచలనం.. 130 పరుగుల తేడాతో విజయం -
అతని కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి..
ఆక్లాండ్: అరంగేట్రంలోనే డబుల్ సెంచరీతో దుమ్మురేపిన న్యూజిలాండ్ నయా సెన్సేషన్ డెవాన్ కాన్వేపై అతని వ్యక్తిగత కోచ్ గ్లెన్ పొక్నాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా క్రిక్ ట్రాకర్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్న అతి కొద్దిమంది క్రికెటర్లలో డెవాన్ కాన్వే అత్యుత్తమ ఆటగాడని ఆకాశానికెత్తాడు. త్వరలో జరుగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా.. కాన్వే పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని లేకపోతే, మ్యాచ్‌ను కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించాడు. కాన్వే ఐపీఎల్ ఎంట్రీపై గ్లెన్ పొక్నాల్ స్పందిస్తూ.. ఐపీఎల్ 2021 సీజన్ కోసం జరిగిన మినీ వేళంలో కాన్వే అన్ సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోవడం బాధించిందన్నాడు. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కు కూడా అతన్ని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనపర్చకపోవడం విచారకరమని పేర్కొన్నాడు. అయితే తదుపరి సీజన్లో పరిస్థితి వేరుగా ఉంటుందని, కాన్వే కోసం ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓపెనర్‌గా, మిడిలార్డ్ బ్యాట్స్‌మన్‌గా అవసరమైతే వికెట్ కీపర్‌గా రాణించగలిగే సత్తా ఉన్న కాన్వేను ముంబై ఇండియన్స్ సొంతం చేసకునే అవకాశాలున్నాయని అభిప్రాయడ్డాడు. ఇదే జరిగితే, రోహిత్ శర్మ, కాన్వేల జోడీ చూడముచ్చటగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా, దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కాన్వే.. 2017లో ఆ దేశాన్ని వదిలి న్యూజిలాండ్‌కు వలస వచ్చి అక్కడే సెట్ అయ్యాడు. 2017 మార్చిలో దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్లో ఆఖరి మ్యాచ్ ఆడిన కాన్వే.. అందులో డబుల్ సెంచరీ సాధించి, ఆ దేశానికి గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 14 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కాన్వే.. టీ20ల్లో 151.12 సగటులో 473 పరుగులు(4 అర్ధశతకాలు), వన్డేల్లో 75 సగటులో 225 పరుగులు(సెంచరీ, హాఫ్ సెంచరీ), టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ, అర్ధసెంచరీ సాయంతో 306 పరుగులు సాధించాడు. చదవండి: శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్ -
ఆ ఐపీఎల్ ఆటగాళ్లకు జీతాలు కట్..
దుబాయ్: కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ రూపొందించే పనిలో బిజీగా ఉంది. అయితే సెకండాఫ్ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరన్న ఊహాగానాల నేపథ్యంలో ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఐపీఎల్ సెకండ్ లెగ్ మ్యాచ్‌లు ఆడేందుకు యూఏఈకి రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు బీసీసీఐకి చెందిన ఓ ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటి వరకు వారు ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని, మిస్ కాబోయే మ్యాచ్‌లకు ఎటువంటి జీతం చెల్లించబోమని ఆయన వెల్లడించారు. అయితే బీసీసీఐతో ఒప్పంద కుదుర్చుకున్న ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదని పేర్కొన్నారు. కాగా, విదేశీ ఆటగాళ్లు పూర్తిగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడకపోతే పారితోషికంలో కోత పెట్టే హక్కు ఫ్రాంచైజీ యాజమాన్యలకు ఉంటుందని సదరు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే, ఎవరు వచ్చినా రాకపోయినా ఐపీఎల్ మాత్రం ఆగదని ఇటీవలే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఫ్రాంచైజీల తాజా నిర్ణయంతో ఐపీఎల్‌కు డుమ్మా కొట్టాలనుకున్న విదేశీ ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌కు చెందిన కొందరు క్రికెటర్లు ద్వైపాక్షిక సిరీస్‌ల నేపంతో ఐపీఎల్ ఆడబోమని ఇదివరకే స్పష్టం చేశారు. చదవండి: ముంబై కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం.. -
జాక్‌పాట్!
ఐపీఎల్ వేలం వజ్రం ఎప్పటికీ విలువైనదే... వన్నె తగ్గినా దాని ధర పెరుగుతుంది తప్ప తగ్గదు... క్రికెటర్ యువరాజ్ సింగ్ విషయంలో ఇది అక్షరాలా మరోసారి రుజువైంది. ప్రపంచకప్ ఆడటానికి పనికిరావు పొమ్మన్నారు... నీకు రూ.14 కోట్లెందుకు అని వదిలేశారు. కానీ క్రికెట్ ప్రపంచంలో తన విలువ అంతకంతకు పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు. ఈసారి ఏకంగా ఏడాదికి 16 కోట్ల రూపాయలు... వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ యువరాజ్‌కు ఇచ్చిన ధర ఇది. ఇది అలాంటిలాంటిది కాదు... జాక్ పాట్... క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికీ ఒక్క సీజన్‌కు దక్కని మొత్తాన్ని ఈ డాషింగ్ ఆల్‌రౌండర్ సొంతం చేసుకోబోతున్నాడు.. బెంగళూరు: జాతీయ జట్టుకు దూరమైనా... ఫామ్‌లో లేకపోయినా.. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు డబ్బుల వర్షం కురిపించాయి. సోమవారం జరిగిన ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ డేర్‌డేవిల్స్ కనీవినీ ఎరుగని రీతిలో రూ. 16 కోట్లకు యువీని కొనుగోలు చేసింది. గతంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఈ పంజాబ్ ప్లేయర్‌ను రూ. 14 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్లో రెండో అత్యధిక ధర పలికిన దినేశ్ కార్తీక్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 10.5 కోట్లకు దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఈసారి అతనికి రూ. 1.5 కోట్ల తక్కువ ధర పలికింది. శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌కు కూడా ఊహించని రీతిలో ధర పలికింది. గత సీజన్లో ఎవరూ తీసుకోని మాథ్యూస్‌ను... ఈసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. రోజంతా జరిగిన ఈ వేలంలో మొత్తం 343 మంది ఆటగాళ్లు పాల్గొనగా, 67 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. అందులో 23 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అయితే చాలా మంది స్టార్ ఆటగాళ్లకు ఈ వేలంలో నిరాశే ఎదురైంది. కరియప్ప బన్‌గయా కరోడ్‌పతి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలో వీడియో విశ్లేషకుడిగా పని చేస్తున్న కేసీ కరియప్ప ఈ వేలంలో కోటీశ్వరుడు అయిపోయాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌కు చెందిన ఈ స్పిన్నర్‌ను కోల్‌కతా రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. కేవలం రూ. 10 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతని కోసం ఫ్రాంచైజీలు బాగానే పోటీపడ్డాయి. హుబ్లీకి చెందిన 20 ఏళ్ల కరియప్ప కోసం ఢిల్లీ కూడా బాగానే పోరాడింది. బీజాపూర్ బుల్స్‌కు చెందిన అతను ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు. గత ఏడాది చాంపియన్స్ లీగ్‌కు ముందు నెట్స్‌లో కరియప్ప కోల్‌కతా ఆటగాళ్లకు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తన నైపుణ్యాన్ని కలిస్ గుర్తించి ఈ సీజన్‌కు తీసుకోవాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. దీంతో కరియప్ప పంట పండింది. యువరాజ్‌కు రూ. 16 కోట్లు రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన యువరాజ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు యువీ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే బిడ్డింగ్ రూ. 7 కోట్లకు చేరుకున్న తర్వాత రాజస్థాన్, పంజాబ్‌లు వెనక్కి తగ్గాయి. ఇక ఢిల్లీ, బెంగళూరు విపరీతంగా ధరను పెంచుకుంటూ పోయాయి. చివరకు ఢిల్లీ... యువీని రికార్డు స్థాయి రేట్‌తో సొంతం చేసుకుంది. 2014: రూ.2.6 కోట్లు 2015: రూ. 4 కోట్లు జహీర్‌ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌ను తొలి రౌండ్లో ఎవరూ కొనలేదు. దీంతో ఈ ఇద్దర్ని రెండో రౌండ్లో మళ్లీ వేలానికి పెట్టారు. జహీర్‌కు ఢిల్లీ రూ. 4 కోట్లు వెచ్చించగా, ఇర్ఫాన్‌ను చెన్నై రూ. 1.5 కోట్లకు తీసుకుంది. గత సీజన్లో ఇర్ఫాన్ రూ. 2.6 కోట్లకు అమ్ముడుపోయాడు. ⇒ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్‌కు ఈ వేలం నిరాశపర్చింది. గత వేలంలో ఢిల్లీ రూ. 9 కోట్లకు కొనుగోలు చేయగా, ఈసారి హైదరాబాద్ ⇒కనీస ధర రూ. 2 కోట్లకే ఎగరేసుకుపోయింది. ⇒గత సీజన్లో రూ.4.75 కోట్లకు అమ్ముడుపోయిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను ఈసారి ఢిల్లీ రూ. 3.5 కోట్లకే దక్కించుకుంది. ⇒రూ.50 లక్షల కనీస ధర ఉన్న మురళీ విజయ్‌ని పంజాబ్ రూ. 3 కోట్లకు తీసుకుంది. ⇒ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు ముంబై ఇండియన్స్ రూ. 3.2 కోట్లు వెచ్చించింది. ⇒ఆల్‌రౌండర్ డారెన్ స్యామీ (రూ.2.8 కోట్లు), దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ వీస్ (రూ. 2.8 కోట్లు)లను బెంగళూరు తీసుకుంది. ⇒ఫిల్ హ్యూజ్ మరణానికి కారణమైన బంతి వేసిన ఆసీస్ పేసర్ సీన్ అబాట్‌ను బెంగళూరు కోటి రూపాయలకు తీసుకుంది. ⇒ఆసీస్ వెటరన్ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీని కనీస ధర రూ. 1.5 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. గత సీజన్లో అతని ధర రూ. 5 కోట్లు. ⇒గత వేలంలో హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కోసం రూ. 3.25 కోట్లు వెచ్చించిన ముంబై ఇండియన్స్ ఈసారి తెలివిగా వ్యవహరించింది. కేవలం రూ. 50 లక్షలకే అతన్ని సొంతం చేసుకుంది. ⇒భారత సంతతికి చెందిన ఆసీస్ పేసర్ గురీం దర్ సంధూని రూ.1.7 కోట్లకు, జైదేవ్ ఉనాద్కట్ని రూ.1.1 కోట్లకు ఢిల్లీ చేజిక్కించుకుంది. ⇒మునాఫ్ పటేల్, చతేశ్వర్ పుజారా, పంకజ్ సింగ్‌లను ఎవరూ కొనలేదు. ⇒సంగక్కరను మూడుసార్లు వేలానికి తెచ్చినా ఎవరూ ఆసక్తి చూపలేదు. జయవర్ధనే, దిల్షాన్ (శ్రీలంక), హషీమ్ ఆమ్లా, అలెక్స్ హేల్స్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్, రోంచి (న్యూజిలాండ్), బ్రాడ్ హాడ్జ్, కామెరూన్ వైట్ (ఆస్ట్రేలియా), శామ్యూల్స్ (విండీస్) లను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. ⇒ ప్రముఖ వ్యాపారవేత్తలు నీతా అంబానీ, విజయ్ మాల్యా, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా, మాజీ క్రికెటర్లు ద్రవిడ్, అనిల్ కుంబ్లే, రికీ పాంటింగ్, ఫ్లెమింగ్, లక్ష్మణ్‌లు తమ ఫ్రాంచైజీల తరఫున హాజరయ్యారు. అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 87.6 కోట్లు ఖర్చు చేశాయి. ఆచితూచి వ్యవహరించిన ‘సన్’ స్టార్లపై కాకుండా ఈసారి మామూలు స్థాయి ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కువగా దృష్టిపెట్టింది. ఇంగ్లండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ (రూ. 2 కోట్లు)ను కనీస ధరకు తీసుకుంది. బెంగళూరు, ముంబైల నుంచి గట్టిపోటీ ఎదుర్కొని కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ. 3.8 కోట్లకు దక్కించుకున్న సన్‌రైజర్స్.. ఇయాన్ మోర్గాన్ కోసం రూ. 1.5 కోట్లు వెచ్చించింది. కేన్ విలియమ్సన్‌ను కేవలం రూ. 60 లక్షలకే చేజిక్కించుకుంది. బౌలింగ్ బలోపేతం కోసం పేసర్ ప్రవీణ్ కుమార్‌కు రూ. 2.20 కోట్లు, రవి బొపారాకు కోటి రూపాయలు ఖర్చు చేసింది. గత వేలంలో కోటిన్నర పలికిన లక్ష్మీరతన్ శుక్లాను చాలా తక్కువగా రూ. 30 లక్షలకు తీసుకుంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్ హనుమ విహారి, ప్రశాంత్, సిద్ధార్థ్ కౌల్‌లకు తలా రూ 10లక్షలు వెచ్చించింది. కరియప్ప బన్‌గయా కరోడ్‌పతి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలో వీడియో విశ్లేషకుడిగా పని చేస్తున్న కేసీ కరియప్ప ఈ వేలంలో కోటీశ్వరుడు అయిపోయాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌కు చెందిన ఈ స్పిన్నర్‌ను కోల్‌కతా రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. కేవలం రూ. 10 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతని కోసం ఫ్రాంచైజీలు బాగానే పోటీపడ్డాయి. హుబ్లీకి చెందిన 20 ఏళ్ల కరియప్ప కోసం ఢిల్లీ కూడా బాగానే పోరాడింది. బీజాపూర్ బుల్స్‌కు చెందిన అతను ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు. గత ఏడాది చాంపియన్స్ లీగ్‌కు ముందు నెట్స్‌లో కరియప్ప కోల్‌కతా ఆటగాళ్లకు బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. తన నైపుణ్యాన్ని కలిస్ గుర్తించి ఈ సీజన్‌కు తీసుకోవాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. దీంతో కరియప్ప పంట పండింది.