ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో లీగ్‌లో పాల్గొనబోయే 10 జట్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 8 నుంచి జట్లన్నీ ముంబైకు చేరుకోవచ్చని తెలిపింది. కోచింగ్, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీల ప్రతినిధులు, అందుబాటులో ఉన్న ఆటగాళ్లంతా జట్లతో పాటు ముంబై చేరుకోవాలని పేర్కొంది. భారత్‌లోనే ఉన్నవారైతే మూడు రోజులు, విదేశాల నుంచి వచ్చే వారైతే ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో తప్పక గడపాల్సి ఉంటుందని ఆదేశించింది.
ముంబైకి రావడానికి రెండు రోజుల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్డును మాత్రమే బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందని ప్రకటించింది. మార్చి 14, 15వ తేదీల నుంచి ఆయా జట్లు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించుకోవచ్చని సూచించింది. కాగా, మార్చి 26 నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్ 2022 సీజన్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు జరగుతాయని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. 55 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్ స్టేడియాల్లో.. మిగిలిన 15 మ్యాచ్‌లు పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయని బీసీసీఐ వెల్లడించింది.
చదవండి: కోహ్లి వందో టెస్ట్‌లో సెంచరీ కొట్టాలి.. ఆ మ్యాచ్ చూసేందుకు నేను కూడా వస్తా..!
Comments
Please login to add a commentAdd a comment