ఐపీఎల్ అభిమానులకు బిగ్ షాక్. గ్రౌండ్ లోకి వెళ్లి ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలి అనుకున్న అభిమానులకు మరోసారి నిరాశ ఎదురుకానుంది. ఐపీఎల్-2022 మ్యాచ్‌లు అన్నీ మహరాష్ట్రలో జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించవచ్చు అని గతంలో మహరాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండంతో తమ నిర్ణయంపై మహరాష్ట్ర సర్కారు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉండటంతో బీసీసీఐ కూడా అప్రమత్తమైనట్లు సమాచారం. దీంతో ప్రేక్షులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
“యూరోపియన్ దేశాలు, దక్షిణ కొరియా, చైనా అంతటా కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. ఇక ఐపీఎల్ మ్యాచ్‌లు గురించి మేము ఆలోచిస్తున్నాం. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకుల అనుమతిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం" అని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే పేర్కొన్నారు. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకుడదనే భావనలో మహరాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది భారత్‌లో కోవిడ్ కేసులు పెరగడంతో టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది.
చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేశాడు!
Comments
Please login to add a commentAdd a comment