ఐపీఎల్ ప్రారంభానికి (మార్చి 26) ముందు ప్రాక్టీస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని ఆటగాళ్లను సానబెడదామనుకున్న ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో ఉన్న సభ్యులు మినహాయించి బీసీసీఐ కాంట్రాక్ట్, నాన్ కాంట్రాక్ట్ నేషనల్ లెవెల్ ప్లేయర్లంతా (రంజీ ప్లేయర్లు మార్చి 6లోగా) మార్చి 4లోపు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో నిర్వహించతలపెట్టిన 10 రోజుల ఫిట్‌నెస్ క్యాంప్‌కు హాజరు కావాలని బీసీసీఐ ఆదేశించింది.
సెలెక్షన్ కమిటీ ఆదేశాల మేరకు ఆటగాళ్ల ఫిట్‌నెస్, తదితర అంశాలపై దృష్టి సారించేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రకటనకు ముందు ఆటగాళ్లను మార్చి 8లోగా క్యాంపులకు చేరుకోవాలని ఆయా ఫ్రాంచైజీలు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఎన్సీఏ క్యాంప్‌కు హాజరు కావాల్సిన కీలక ఐపీఎల్ ఆటగాళ్లు : కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, సంజూ శాంసన్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్. వీరిలో కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ గాయాల బారిన పడి ఇప్పటికే ఎన్సీఏలో ఉన్నారు.
చదవండి: IPL 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కీలక ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment