బెంగళూరు : టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు లైన్ క్లియర్ అయింది. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో శుక్రవారం వైద్య బృందం నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో హిట్‌మ్యాన్ పాసయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో రోహిత్‌కు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు. (చదవండి : బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి)
కాగా ఫిట్‌నెస్ పరీక్షలో రోహిత్ సఫలం కావడంతో డిసెంబర్ 14న ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా రోహిత్ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. దీంతో తొలి రెండు టెస్టులకు దూరం కానున్న రోహిత్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. కాగా మొదటి టెస్టు అనంతరం టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నీటి సెలవులపై స్వదేశానికి రానున్నాడు. కోహ్లి స్థానంలో మిగిలిన మూడు టెస్టులకు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆసీస్- భారత్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17నుంచి జరగనుంది.(చదవండి : అందుకే హార్దిక్‌ను వద్దనుకున్నాం: కోహ్లి)
Comments
Please login to add a commentAdd a comment