MI New York Announces Lead By Kieron Pollard Ahead of Inaugural Edition - Sakshi
Sakshi News home page

MajorLeagueCricket: ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా పొలార్డ్‌

Published Thu, Jun 15 2023 3:39 PM | Last Updated on Thu, Jun 15 2023 4:04 PM

MI New York announce leed by Kieron Pollard ahead of inaugural edition - Sakshi

ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఓ టీ20 లీగ్‌ను నిర్వహించడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో అమెరికా వేదికగా మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) టోర్నీ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటుండగా నాలుగు టీమ్‌లు ఐపీఎల్‌ యాజమాన్యాలకు (ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై) చెందినవే ఉన్నాయి.

ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. సీఎస్కే మాదిరిగానే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ ను కొనుగోలు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్  ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా  ఢిల్లీ క్యాపిటల్స్:.. సియాటెల్ ను దక్కించుకుంది. అభిమానులు ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా భావిస్తున్నారు.

న్యూయర్క్‌ కెప్టెన్‌గా పొలార్డ్‌
ఇక  మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ తొలి ఎడిషన్‌లో ఏంఐ న్యూయర్క్‌ కెప్టెన్‌గా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కిరాన్‌ పొలార్డ్‌ ఎంపికయ్యాడు. అదేవిధంగా ఏంఐ న్యూయర్క్‌ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ పీటర్సన్‌, బౌలింగ్‌ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ బాధ్యతలు చేపట్టనున్నారు.

కాగా ఆఫ్ఘన్ సూపర్ స్టార్ రషీద్ ఖాన్, కగిసో రబాడ, ట్రెంట్‌ బౌల్ట్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లతో ఏంఐ న్యూయర్క్‌ ఫ్రాంచైజీ  ఒప్పందం కుదుర్చుకుంది. వీరితో పాటు యువ ఆటగాళ్లు టిమ్‌ డేవిడ్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ కూడా ఉన్నారు. కాగా జులై 13 నుంచి ఈ క్రేజీ లీగ్ మొదలుకానున్నది.
చదవండి: Nahida Khan Retirement: పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement