న్యూయార్క్ : కార్పొరేట్ రంగంలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌లు తమదైన ముద్ర వేశారు. తాజాగా వీరిద్దరూ క్రికెట్ రంగంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అమెరికా క్రికెట్ ఎంటర్‌పప్రైజస్(ఏసీఈ) మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ(ఎంఎల్‌సీ) పేరుతో లీగ్ నిర్వహించనుంది. ఈ లీగ్‌లో ఇప్పటికే కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ పెట్టుబడులు పెట్టినట్టు స్వయంగా వెల్లడించారు. తాజాగా భారత సంతతికి చెందిన సత్య నాదేళ్ల, శంతను నారాయణ్‌లు ఈ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. వీరితో పాటు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కూడా ఎంఎల్‌సీ లీగ్‌లో పెట్టుబడులు పెట్టనన్నుట్లు తెలిసింది. అమెరికాలో క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకే ఈ లీగ్‌ను ప్లాన్ చేసినట్లు ఏసీఈ కో ఫౌండర్ విజయ్ శ్రీనివాసన్ వెల్లడించారు. (చదవండి : టీమిండియాతో మ్యాచ్ : ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ)
Comments
Please login to add a commentAdd a comment