
ఐపీఎల్ ముగిసింది.. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా అయిపోయింది. జూలై 12 వరకు టీమిండియాకు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. క్రికెట్ అభిమానులు వచ్చే నెల రోజులు ఎలా గడపాలా అని ఆలోచిస్తున్న సమయంలో మరో ఆసకక్తికర లీగ్ మొదలుకానుంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా తొలిసారి ఓ పూర్తిస్థాయి ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ జరగనుంది.
యూఎస్‌లో అభిమానులను అలరించడానికి సిద్ధమైన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) లో భాగంగా సీజన్ - 1 షెడ్యూల్ కూడా విడుదలైంది. ట్విటర్ వేదికగా ఎంఎల్‌సీ పంచుకున్న ఈ షెడ్యూల్ ప్రకారం.. జులై 13 నుంచి ఈ క్రేజీ లీగ్ మొదలుకానున్నది. 17 రోజుల పాటు అగ్రరాజ్యాన జరిగే ఈ లీగ్.. జులై 30న ముగుస్తున్నది.
మినీ ఐపీఎల్..
ఐపీఎల్‌లోని నాలుగ ప్రధాన జట్లు ఎంఎల్‌సీలో జట్లను సొంతం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ లు ఎంఎల్‌సీలో ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. మిగిలిన రెండు జట్లనూ వేరేవాళ్లు దక్కించుకున్నా వాళ్లు కూడా భారతీయ సంతతి వ్యక్తులే కావడం గమనార్హం.
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. న్యూయార్క్ ఫ్రాంచైజీని దక్కించుకోగా.. సీఎస్కే మాదిరిగానే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్.. టెక్సాస్ టీమ్ ను కొనుగోలు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్:.. సియాటెల్ ను దక్కించుకుంది. సియాటెల్ లో ఢిల్లీతో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా కో ఓనర్ గా ఉన్నాడు. ఈ నాలుగు జట్లే గాక వాషింగ్టన్ డీసీ ఫ్రాంచైజీని భారత సంతతికి చెందిన అమెరికన్ పెట్టుబడిదారుడు సంజయ్ గోవిల్ కొనుగోలు చేశాడు. ఇక వాషింగ్టన్ డీసీ టీమ్ ను ఆనంద్ రామరాజన్, వెంకీ హరినారాయణ్ లు దక్కించుకున్నారు.
ఈ లీగ్ లో తొలి మ్యాచ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ వర్సెస్ లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మధ్య జులై 13న జరుగనుంది. జులై 14న ఎంఐ న్యూయార్క్ - సాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తో పాటు ఇదే రోజు సియాటెల్ ఆర్కర్స్ తో వాషింగ్టన్ ఫ్రీడమ్ తలపడతాయి. జులై 25 వరకు లీగ్ దశ మ్యాచ్ లు ముగుస్తాయి. జులై 27న ఎలిమినేటర్, అదే రోజున క్వాలిఫయర్ జరుగుతాయి. 28న ఛాలెంజర్, జులై 30న ఛాంపియన్‌షిప్ (ఫైనల్) జరుగనున్నాయి.
ఈ మేజర్ క్రికెట్ లీగ్‌లో అంతర్జాతీయ క్రికెటర్లు జేసన్ రాయ్, మార్కస్ స్టోయినిస్, ఆరోన్ ఫించ్, క్వింటన్ డికాక్, మిచెల్ మార్ష్, ఆన్రిచ్ నోర్జ్, వనిందు హసరంగ లాంటి స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) లో ఆరు జట్లు :
టెక్సాస్ సూపర్ కింగ్స్ (సీఎస్కే)
లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ (కేకేఆర్)
సియాటెల్ ఆర్కాస్ (ఢిల్లీక్యాపిటల్స్)
ఎంఐ న్యూయార్క్ (ముంబై ఇండియన్స్)
వాషింగ్టన్ ఫ్రీడమ్
సాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్
𝑨𝒏𝒅 𝒋𝒖𝒔𝒕 𝒍𝒊𝒌𝒆 𝒕𝒉𝒂𝒕... the first-ever schedule of #MajorLeagueCricket has been released 🤩 🇺🇸 🏏
— Major League Cricket (@MLCricket) June 12, 2023
Where will you be watching from?! pic.twitter.com/gPuUsKtrvk
చదవండి: వార్తల్లో పృథ్వీ షా.. సీజ్ చేసిన లాంజ్‌లో తెల్లవారుజాముదాకా