2024లో క్రికెట్ జాతర జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో క్రికెట్ లీగ్‌ల మోత మోగనుంది. జనవరి 9 నుంచి మొదలయ్యే సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో ఈ ఏడాది క్రికెట్ సంబురాలు ప్రారంభమవుతాయి. ఇదే ఏడాది కరీబియన్ దీవులు, యూఎస్‌ఏ వేదికలుగా టీ20 ప్రపంచకప్ కూడా జరుగనుంది. ఈ మెగా టోర్నీ జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది.
దీనికి ముందు భారత్‌లో క్రికెట్ మహాసంగ్రామం అయిన ఐపీఎల్ మొదలవుతుంది. ఈ లీగ్‌కు సంబంధించి తేదీలు అధికారికంగా ఖరారు కానప్పటికీ.. మార్చి 23-మే 26 మధ్యలో ఈ లీగ్ జరుగుతుందని తెలుస్తుంది.
వీటితో పాటు ఈ ఏడాది ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (దుబాయ్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, టీ20 వైటాలిటీ బ్లాస్ట్ (ఇంగ్లండ్), ద హండ్రెడ్ లీగ్ (ఇంగ్లండ్), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (వెస్టిండీస్), టీ10 లీగ్ (అబుదాబీ), బిగ్‌బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), లంక ప్రీమియర్ లీగ్ (శ్రీలంక), మేజర్ లీగ్ క్రికెట్ (యూఎస్‌ఏ), సూపర్ స్మాష్ (న్యూజిలాండ్), గ్లోబల్ టీ20 కెనడా (కెనడా), జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్ (ఆఫ్రికా) తదితర లీగ్‌లు జరుగనున్నాయి.
మొత్తంగా ఏడాది పొడవునా 15 క్రికెట్ లీగ్‌లు జరుగనున్నాయి. వీటిలో కొన్నింటికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఇవే కాక ఈ ఏడాది పలు దేశీయ లీగ్‌లు కూడా జరుగుతాయి. మొత్తంగా ఏడాది పొడవునా అభిమానులకు క్రికెట్ కనువిందు చేయనుంది.
వరస క్రమంలో ఈ ఏడాది జరుగబోయే వివిధ క్రికెట్ లీగ్‌లు..
- సౌతాఫ్రికా టీ20 లీగ్- జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10
- ఇంటర్నేషనల్ లీగ్ టీ20- జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17
- బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్- జనవరి 19 నుంచి మార్చి 1
- పాకిస్తాన్ సూపర్ లీగ్- ఫిబ్రవరి 13 నుంచి మార్చి 19
- ఐపీఎల్- మార్చి 23 నుంచి మే 26 (అంచనా)
- వైటాలిటీ బ్లాస్ట్- మే 30 నుంచి సెప్టెంబర్ 14
- టీ20 వరల్డ్‌కప్- జూన్ 4 నుంచి 30
- ద హండ్రెడ్- ఆగస్ట్
- కరీబియన్ ప్రీమియర్ లీగ్- ఆగస్ట్-సెప్టెంబర్
- టీ10 లీగ్- అక్టోబర్
- బిగ్‌బాష్ లీగ్-డిసెంబర్-జనవరి
షెడ్యూల్ ఖరారు కాని లీగ్‌లు..
- లంక ప్రీమియర్ లీగ్ (శ్రీలంక),
- మేజర్ లీగ్ క్రికెట్ (యూఎస్‌ఏ),
- సూపర్ స్మాష్ (న్యూజిలాండ్),
- గ్లోబల్ టీ20 కెనడా (కెనడా),
- జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్ (ఆఫ్రికా)
Comments
Please login to add a commentAdd a comment