లండన్: మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. దీంతో అనేక టోర్నీలు వాయిదా పడగా మరికొన్ని టోర్నీలు రద్దవ్వడంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే మెల్లిమెల్లిగా అనేక దేశాలు లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. ప్రజలు మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా క్రికెట్ పునరుద్దరణలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లకు ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని ఈసీబీ భావించింది.
దీనిలో భాగంగా ఇంగ్లండ్‌లోని ఏడు మైదానాలను ఎంపిక చేసి 18 మంది బౌలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఒక సమయంలో కేవలం ఒక క్రికెటర్‌కు మాత్రమే గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసే వెసులుబాటు కల్పించింది. దీనిలో భాగంగా స్టువార్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్‌లు మైదానంలోకి దిగి కాసేపు ప్రాక్టీస్ చేశారు. బ్రాడ్ ట్రెంట్‌బ్రిడ్జ్‌లో, వోక్స్ ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రాక్టీస్ చేశారు. దీంతో కరోనా విరామం తర్వాత మైదానంలోకి దిగిన తొలి క్రికెటర్లుగా బ్రాడ్, వోక్స్‌లు నిలిచారు. ఇక చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగి బౌలింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని స్టువార్ట్ బ్రాడ్ ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. అంతేకాకుండా తను బౌలింగ్ చేసిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు.
చదవండి:
ఐసీసీ చైర్మన్ రేసులోకి గంగూలీ వచ్చేశాడు..
‘మంకీ’ పెట్టిన చిచ్చు..!
Comments
Please login to add a commentAdd a comment