బర్మింగహమ్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ సహా ఉపఖండం అభిమానుల కొరకు మ్యాచ్‌ను అరగంట ముందుగా ప్రారంభించనున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి జూలై 1న టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు భారత కాలామాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకి( ఇంగ్లండ్ లోకల్ టైం ఉదయం 11 గంటలు) ప్రారంభం కావాల్సి ఉంది.
తాజాగా ఈసీబీ మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు మార్చింది. దీని ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు(లోకల్ టైం ఉదయం 10:30 గంటలు) ప్రారంభమై రాత్రి 10 లేదా 10:30 గంటల వరకు జరగనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న టెస్టు మ్యాచ్‌లో రోజు 90 ఓవర్లు ఆట సాధ్యమయ్యేలా ఈసీబీ ప్రణాళికలు రచించిందిఇక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జూలై 7, 9,10 తేదీల్లో మూడు టి20లు.. ఆ తర్వాత జూలై 12,14, 17వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.
కాగా రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆదివారం ఉదయం బీసీసీఐ ట్విటర్‌లో తెలిపింది. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన రోహిత్.. ఆర్‌టీపీసీఆర్‌లోనే పాజిటివ్ వస్తే వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తుంది. దీంతో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ లేదా కోహ్లి, రహానేలలో ఎవరో ఒకరు తుది జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే?
Comments
Please login to add a commentAdd a comment