అలాంటి బౌలర్లను చాలా మందిని చూశా!
అలాంటి బౌలర్లను చాలా మందిని చూశా!
Published Wed, Jan 25 2017 9:54 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
కాన్పూర్: భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్, వన్డే సిరీస్‌లలో ఓటమిపాలైన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా టీ20లలో నైనా టీమిండియాకు చెక్ పెట్టాలని ఇంగ్లండ్ జట్టు ఎడమచేతి వాటం స్పిన్నర్ తైమల్ మిల్స్‌ను రంగంలోకి దించుతుంది. దీనిపై స్పందించిన విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎంతో మంది 90 మైళ్ల వేగంతో బంతులు సంధించిన బౌలర్లను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఇప్పుడే అదేవిధంగా మరో బౌలర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఇంగ్లండ్‌కు సంకేతాలు పంపాడు కోహ్లీ.
తైమల్ మిల్స్ గురించి ఎలా సిద్ధమయ్యారని మీడియా అడిగిన ప్రశ్నకు కోహ్లీ ఈ విధంగా స్పందించాడు. మిల్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపు (గురువారం) కాన్పూర్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత మాత్రమే అతడిపై కామెంట్లు చేస్తాను. మా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు, టీ20 స్పెషలిస్టులు ఉన్నారు.. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిపై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్ అతడికి టీ20 గేమ్ లోకి తెచ్చి ఉండొచ్చునని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
Advertisement