
ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా షెడ్యూల్ ఖారారైంది. ఈ పర్యటనలో భాగంగా భారత్.. ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మలాహిడ్ వేదికగా ఈ ఏడాది జూన్ 26,28 తేదీల్లో రెండు టీ20లు జరగనున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ ధృవీకరించింది. అయితే ఈ సిరీస్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, పంత్, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిన ఒక టెస్టు ఈ ఏడాది జూలైలో జరగనుంది.
ఈ వేసవిలో భారత్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఐర్లాండ్‌లో పర్యటించనున్నాయి. అదే విధంగా ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌లో దక్షిణాఫ్రికాతో రెండు టీ20లు ఆడనున్నాము. ఐర్లాండ్‌లో అతిపెద్ద హోమ్ ఇంటర్నేషనల్ సీజన్ కోసం సిద్ధంగా ఉన్నాము అని క్రికెట్ ఐర్లాండ్ ట్విటర్‌లో పేర్కొంది. భారత జట్టు చివరసారిగా 2018లో ఐర్లాండ్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టీ20ల సిరీస్‌ను 2-0 కైవసం చేసుకుంది.
చదవండి: బాలీవుడ్ పాటకు స్టెప్పులేసిన డ్వేన్ బ్రావో.. స్పందించిన అక్షయ్ కుమార్, వార్నర్
Comments
Please login to add a commentAdd a comment