![WPL 2024: Bat Gifted By Virat Kohli Wasnt Good, Says English Cricketer Danni Wyatt - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/22/Untitled-8.jpg.webp?itok=88FFHzGd)
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వాట్.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి షాకిచ్చింది. కోహ్లి గతంలో గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోహ్లి బ్యాట్‌పై భారీ అంచనాలు ఉండినప్పటికీ.. దాన్ని కేవలం రెండు సార్లు మాత్రమే వినియోగించానని పేర్కొంది. మహిళల ఐపీఎల్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన వాట్ కోహ్లి గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
మహిళల ఐపీఎల్‌లో యూపీ వారియర్జ్‌కు ఆడుతున్న ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్.. గతంలో కోహ్లిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. 2014లో ఆమె బహిరంగంగానే కోహ్లికి మ్యారేజ్ ప్రపోజల్ పంపింది. నాటి ట్విటర్‌లో ఆమె.. కోహ్లి మ్యారీ మీ అంటూ పోస్ట్ చేసింది. ద క్వింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్ మరిన్ని ముచ్చట్లను కూడా షేర్ చేసుకుంది.
తన ఫేవరెట్ పిచ్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియమని.. ఫేవరెట్ అపోజిషన్ భారత్ అని.. ఫేవరెట్ ఫుడ్ బటర్ చికెన్, మసాలా ఛాయ్ అని పేర్కొంది. కాగా, డానీ వాట్ ఇంగ్లండ్ తరఫున 2 టెస్ట్‌లు, 105 వన్డేలు, 151 టీ20లు ఆడి 4600కు పైగా పరుగులు చేసి 73 వికెట్లు పడగొట్టింది. ఈమె ఖాతాలో 4 సెంచరీలు, 19 అర్దసెంచరీలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, కొద్ది రోజుల కిందట (ఫిబ్రవరి 15న) విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఈ బిడ్డకు విరుష్క దంపతులు అకాయ్ అని నామకరణం చేశారు. అకాయ్‌కు ముందు కోహ్లి దంపతులకు కుమార్తె పుట్టింది. ఆమెకు వామిక అని నామకరణం చేశారు. మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్ రేపటి నుంచి (ఫిబ్రవరి 23) ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment