![Virat Kohli Fan Made Photoshopped Pic Goes Viral On Social Media - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/25/kohli2.jpg.webp?itok=tCcKYl0Q)
Courtesy: Socila Media
ముంబై: ఆటతోనే కాదు, తనదైన వ్యక్తిగత స్టైల్‌తోనూ యువతలో క్రేజ్ సంపాదించుకున్నాడు టీమిండియా కెప్టెన్ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఒంటిపై భిన్న రకాల టాటూలు వేయించుకున్న ఈ రన్ మెషీన్.. ఎప్పటికప్పుడు హెయిర్, డ్రెస్సింగ్ స్టైల్ కూడా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండేలా చూసుకుంటాడు. ఇక సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు కలిగి ఉంటే కోహ్లి... ఇన్‌స్టాలో షేర్ చేసే ఒక్కో ఫొటో విలువ కూడా లక్షల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో సోమవారం, అతడికి సంబంధించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది.
ఇందులో పసుపు టీ- షర్టు ధరించిన కోహ్లి.. నిండైన జుట్టుతో, ఒత్తైన గడ్డంతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అయితే, ఇటీవల కాలంలో ఇంగ్లండ్ సిరీస్, ఐపీఎల్-2021 సీజన్‌లోనూ కోహ్లి షార్ట్ హెయిర్‌తో కనిపించాడు. మరి ఇప్పటికిప్పుడు ఇలా ఎలా మారిపోయాడు అనుకుంటున్నారా? ఇదంతా అతడి ఫ్యాన్స్ చేసిన పని. తమ ఆరాధ్య క్రికెటర్ లుక్‌ను తమకు ఇష్టం నచ్చినట్లుగా ఫొటోషాప్ చేసి.. ‘‘లాక్‌డౌన్‌లో కోహ్లి ఇలాగే ఉంటాడు కదా. జస్ట్ ఫర్ ఫన్’’ అంటూ దీనిని షేర్ చేశారు. అయితే, చాలా మంది నెటిజన్లను కోహ్లి.. ‘సరికొత్త’ లుక్ ఆకట్టుకోవడం విశేషం.
ఈ క్రమంలో కొంతమంది... నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ సిరీస్ మనీ హీస్ట్‌లోని ఫిక్షనల్ క్యారెక్టర్ ప్రొఫెసర్(అల్వారో మోర్టే) లుక్‌తో పోలుస్తున్నారు. కాగా ఐపీఎల్ తాజా సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో ఇంటికి చేరుకున్న కోహ్లి.. భార్య అనుష్క శర్మతో కలిసి కోవిడ్-19పై పోరుకై విరాళాల సేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ఇంగ్లండ్ టూర్ బయల్దేరే క్రమంలో ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు చేరుకుని బయో బబుల్‌లో ప్రవేశించాడు. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్, టెస్టు సిరీస్ నిమిత్తం టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్‌కు పయనం కానుంది.
చదవండి: Suryakumar Yadav: కోహ్లి నన్ను స్లెడ్జ్ చేశాడు.. సంతోషం!
Comments
Please login to add a commentAdd a comment