లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ 190 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్‌కు 29వది. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు ఇన్ని విజయాలు సాధించలేదు. భారత్, ఆస్ట్రేలియా సంయుక్తంగా 28 విజయాలు సాధించాయి.
తాజాగా ఇంగ్లండ్.. టీమిండియా, ఆస్ట్రేలియా పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టింది. ఇంగ్లండ్ డబ్ల్యూటీసీలో 29 విజయాలు సాధించేందుకు 58 మ్యాచ్‌లు తీసుకోగా.. భారత్, ఆస్ట్రేలియా చెరి 46 మ్యాచ్‌ల్లోనే 28 విజయాలు సాధించాయి. డబ్ల్యూటీసీలో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్ (15), సౌతాఫ్రికా (15), పాకిస్తాన్ (10), శ్రీలంక (9), వెస్టిండీస్ (8), బంగ్లాదేశ్ (3) ఉన్నాయి.
లార్డ్స్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 427, రెండో ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 196, రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తరఫున జో రూట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేయగా.. గస్ అట్కిన్సన్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిశాడు.
లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రెండో ఇన్నింగ్స్‌లో చండీమల్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అట్కిన్సన్ బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రెండు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment