గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి ఎదురై, ఐపీఎల్ 2023 నుంచి నిష్క్రమించి గంటలు కూడా గడవకముందే ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లండన్ విమానం ఎక్కనున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ (జూన్ 7-11 వరకు లండన్‌లోని కెన్నింగ్‌స్టన్ ఓవల్) కోసం కింగ్ కోహ్లి రెండు వారాల ముందే ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడు. రేపు (మే 23) విరాట్ కోహ్లితో పాటు రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్‌కు బయల్దేరతారని బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి ఒకరు వెల్లడించారు.
ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు అలవాటు పడేందుకు వీరు ముందుగా అక్కడికి వెళ్లనున్నట్లు ఆయన తెలిపాడు. వీరితో పాటు రిజర్వ్ ప్లేయర్ ముకేశ్ కుమార్, నెట్ బౌలర్లు ఆకాశ్ దీప్, అనికేత్ చౌదరి, యార్రా పృథ్వీ రాజ్ కూడా లండన్ ఫ్టయిట్ ఎక్కుతారని తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన మిగతా భారత జట్టు సభ్యులు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ ఐపీఎల్ 2023 ముగిసాక ఇంగ్లండ్‌కు బయల్దేరతారని సమాచారం.
పుజారా అక్కడే..
టీమిండియా స్టార్ టెస్ట్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో పాల్గొనేందుకు అతను చాలా రోజుల కిందటే అక్కడికి వెళ్లాడు. ఆ టోర్నీలో పుజారా ససెక్స్ టీమ్‌కు సారధ్యం వహిస్తున్నాడు.
ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ ఫిట్..
ఐపీఎల్ 2023 సందర్భంగా గాయాల బారిన పడిన ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ ఫిట్‌గా ఉన్నారని సమాచారం. వీరు కూడా కోహ్లి అండ్ కో తో పాటు లండన్ ఫ్లయిట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: IPL 2023: ధోనితో విభేదాలు.. మధ్యలో రవీంద్ర జడేజా భార్య..!
Comments
Please login to add a commentAdd a comment