వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ (జూన్ 7-11 వరకు లండన్‌లోని కెన్నింగ్‌స్టన్ ఓవల్) కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత బృందం (మొదటి బ్యాచ్) ఇవాళ (మే 23) ఉదయం ఇంగ్లండ్‌కు బయల్దేరింది.
ఈ బృందంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, స్టాండ్ బై ప్లేయర్ ముకేశ్ కుమార్, నెట్ బౌలర్లు ఆకాశ్‌దీప్, పుల్కిత్ నారంగ్‌లతో పాటు సహాయ సిబ్బంది ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో ఉండి, ఐపీఎల్-2023 నుంచి నిష్క్రమించిన జట్లలోని కీలక సభ్యులు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్‌లు రేపు (మే 24) లండన్‌కు బయల్దేరతారని క్రిక్‌బజ్ తెలిపింది.
ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ఫస్ట్ బ్యాచ్ రెండు వారాల ముందుగానే లండన్‌కు బయల్దేరింది. మిగతా భారత బృందం దశల వారీగా ఇంగ్లండ్‌కు వెళ్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ ఐపీఎల్ 2023 ముగిసాక (మే 31 లోపు) ఇంగ్లండ్‌కు బయల్దేరతారని సమాచారం.
పుజారా అక్కడే..
టీమిండియా స్టార్ టెస్ట్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో పాల్గొనేందుకు అతను చాలా రోజుల కిందటే అక్కడికి వెళ్లాడు. ఆ టోర్నీలో పుజారా ససెక్స్ టీమ్‌కు సారధ్యం వహిస్తున్నాడు.
ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ ఫిట్..
ఐపీఎల్ 2023 సందర్భంగా గాయాల బారిన పడిన ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ ఫిట్‌గా ఉన్నారని సమాచారం. వీరు కూడా కోహ్లి అండ్ కో తో పాటు లండన్ ఫ్లయిట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment