ది హండ్రెడ్ లీగ్-2023 ఫైనల్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు అడుగుపెట్టింది. శనివారం లండన్ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో సదరన్ బ్రేవ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బట్లర్ బృందం.. ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ నిర్ణీత 100 బంతుల్లో వికెట్ నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సదరన్ బ్రేవ్ బ్యాటర్లలో ఫిన్ అలెన్(69), కాన్వే(51 నాటౌట్), విన్స్(56 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు. మాంచెస్టర్ బౌలర్లలో వాల్టర్ ఒక్కడే వికెట్ సాధించాడు.
బట్లర్ ఊచకోత..
ఇక 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. తొలి వికెట్‌గా సాల్ట్(47) ఔటైనప్పటికీ బట్లర్ మాత్రం తన జోరును తగ్గించలేదు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి.. మాంచెస్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా మాంచెస్టర్ టార్గెట్‌ను మరో నాలుగు బంతులు మిగిలూండగానే ఛేదించింది. ఆఖరిలో హోల్డన్(31), ఈవెన్స్(22) కూడా మెరుపులు మెరిపించారు. ఇక ఆదివారం ఓవల్ ఇన్విన్సిబుల్స్‌తో జరగనున్న ఫైనల్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ తలపడనుంది.
చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్
50 for England's white ball captain, Jos Buttler 🙌 pic.twitter.com/vG9l9x18Hs
— Sky Sports Cricket (@SkyCricket) August 26, 2023
Comments
Please login to add a commentAdd a comment