
పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది ది హండ్రెడ్ లీగ్‌లో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. వెల్ష్ ఫైర్ జట్టు తరపున అఫ్రిది 'ది హండ్రెడ్ లీగ్'లో అడుగుపెట్టాడు. సోఫియా గార్డెన్స్ వేదికగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై తొలి మ్యాచ్ ఆడిన అఫ్రిది సంచలన ప్రదర్శన కనబరిచాడు. మాంచెస్టర్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన అఫ్రిది.. తొలి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టాడు.
మాంచెస్టర్ బ్యాటర్లు ఫిల్ సాల్ట్, ఈవెన్స్‌ను వరుస బంతుల్లో అఫ్రిది పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు వికెట్లు కూడా ఎల్బీ రూపంలో దక్కడం గమానార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 10 బంతులు వేసిన అఫ్రిది 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 40 బంతులకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ 40 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.
వెల్ష్‌ఫైర్ బ్యాటర్లలో లూక్ వెల్స్(57) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. అనంతరం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ 4 వికెట్లు కోల్పోయి 85 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో 9 పరుగుల తేడాతో వెల్ష్ ఫైర్ చేతిలో మాంచెస్టర్ ఓటమి పాలైంది. మాంచెస్టర్ బ్యాటర్ జోస్ బట్లర్(37) ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ! హైదరాబాదీ కూడా
This is @iShaheenAfridi, everyone 🦅 #TheHundred pic.twitter.com/NGhPJZ9QqX
— The Hundred (@thehundred) August 2, 2023