సౌతాఫ్రికాలో పాకిస్తాన్ పర్యటన ఇవాల్టి (డిసెంబర్ 10) నుంచి మొదలవుతుంది. డర్బన్ వేదికగా ఇరు జట్లు ఇవాళ తొలి టీ20లో తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును కాసేపటి కిందే ప్రకటించారు. జింబాబ్వే టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
జింబాబ్వే టీ20 సిరీస్ పాక్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘాను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. గత కొన్ని సిరీస్‌లుగా అఘా దారుణంగా విఫలమవుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో రాణించిన తయ్యబ్ తాహిర్ మిడిలార్డర్‌లో కీలకపాత్ర పోషించనున్నాడు. మిడిలార్డర్‌లో ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు.
సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది సందిగ్దంగా మారింది. జింబాబ్వే పర్యటనలో సత్తా చాటిన సైమ్ అయూబ్‌ను ఓపెనర్‌గా పంపిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తూ ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు.
అబ్బాస్ అఫ్రిదితో పాటు షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ పేస్ విభాగంలో ఉంటారు. స్పిన్నర్లు సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ బరిలోకి దిగనున్నారు. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
సౌతాఫ్రికాతో తొలి టీ20కి పాక్ తుది జట్టు..
మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ అండ్ వికెట్‌కీపర్), బాబర్ ఆజమ్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్, తయ్యబ్ తాహిర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment