సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఒకే రోజు (మూడో రోజు) రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేసి బాబర్.. రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగలు చేసి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. చాలాకాలం పాటు పేలవ ఫామ్‌తో సతమతమైన బాబర్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. బాబర్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో (తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్) హాఫ్ సెంచరీలు చేశాడు.
మ్యాచ్ మూడో రోజు బాబర్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలడంతో పాక్ ఇదే రోజు ఫాలో ఆడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు.
నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు
మూడో రోజు మూడో సెషన్ సమయానికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్, షాన్ మసూద్ (78) నిలకడగా ఆడుతున్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 269 పరుగులు వెనుకపడి ఉంది.
ఫాలో ఆన్ ఆడుతున్న పాక్
తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే చాపచుట్టేసిన పాక్ ఫాలో ఆన్ ఆడుతుంది. సఫారీ బౌలర్లు రబాడ (3/55), క్వేనా మఫాకా (2/43), కేశవ్ మహారాజ్ (2/14), మార్కో జన్సెన్ (1/36), వియాన్ ముల్దర్ (1/44) ధాటికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) పర్వాలేదనిపించాడు. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు.
సౌతాఫ్రికా భారీ స్కోర్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (615 పరుగులు) చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (259) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. కెప్టెన్ టెంబా బవుమా (106), వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (54 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో మెరవగా.. కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ 17, వియాన్ ముల్దర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ 0, డేవిడ్ బెడింగ్హమ్ 5, క్వేనా మపాకా 0 పరుగులకు ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా, మొహమ్మద్ అబ్బాస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మిర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment