
శతక్కొట్టి దక్షిణాఫ్రికాను గెలిపించిన వాన్ డెర్ డస్సెన్
వాన్ డెర్ డస్సెన్(51 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతక్కొట్టడంతో పాక్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ సాధించింది. పాక్ నిర్ధేశించిన 187 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో ఆచితూచి ఆడిన సఫారీలు.. ఆఖర్లో డస్సెన్, కెప్టెన్ బవుమా(46)లు చెలరేగి ఆడడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేశారు. హసన్ అలీ వేసిన ఆఖరి ఓవర్‌లో డస్సెన్ ఏకంగా 22 పరుగులు పిండుకుని సెంచరీ పూర్తి చేయడంతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది చెరో 2 వికెట్లు పడగొట్టారు.
పాకిస్తాన్ భారీ స్కోరు.. సౌతాఫ్రికా టార్గెట్ 187
సౌతాఫ్రికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పాక్ బ్యాటింగ్‌లో ఫఖర్ జమాన్(52 పరుగులు, రిటైర్డ్‌హర్ట్), అసిఫ్ అలీ 32, షోయబ్ మాలిక్ 28 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ 3, కేశవ్ మహరాజ్, అన్‌రిచ్ నోర్జ్టే చెరో వికెట్ తీశారు.
14 ఓవర్లలో పాకిస్తాన్ 114/3
14 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ 52, షోయబ్ మాలిక్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
5 ఓవర్లలో పాకిస్తాన్ 32/1
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. రిజ్వాన్ 15, ఫఖర్ జమాన్ 1 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు బాబర్ అజమ్(15) రబడ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
►2 ఓవర్లలో పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 3, బాబర్ అజమ్ 9 పరుగులతో ఆడుతున్నారు.
టి20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (వికెట కీపర్), క్వింటన్ డి కాక్ (కెప్టెన్), ఐడెన్ మక్రమ్, రాసీ వాన్ డెర్ డసెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, జార్న్ ఫోర్టిన్, లుంగీ న్గిడి, తబ్రేజ్ షమ్సీ, వియాన్ ముల్డర్, అన్రిచ్ నార్ట్జే, కాగిసో రబడ, రీజా హెండ్రిక్స్
పాకిస్తాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ అజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, సర్ఫరాజ్ అహ్మద్ , మహ్మద్ నవాజ్, హైదర్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్
Comments
Please login to add a commentAdd a comment