The Hundred 2023: Northern Superchargers Beat Trent Rockets By 3 Runs - Sakshi
Sakshi News home page

చెలరేగిన డేవిడ్‌ వీస్‌.. తేలిపోయిన విధ్వంసకర వీరులు

Published Thu, Aug 10 2023 2:58 PM | Last Updated on Thu, Aug 10 2023 3:22 PM

Hundred League 2023: Northern Superchargers Beat Trent Rockets By 3 Runs - Sakshi

హండ్రెడ్‌ లీగ్‌-2023లో భాగంగా ట్రెంట్‌ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 9) జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్‌న్‌ సూపర్‌ ఛార్జర్స్‌ ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీస్‌ చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం సాధించాడు. అతనికి బ్రైడన్‌ కార్స్‌ (29 బంతుల్లో 33 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌), సైఫ్‌ జైబ్‌ (21 బంతుల్లో 21; ఫోర్‌), ఆడమ్‌ హోస్‌ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు) జత కలవడంతో సూపర్‌ ఛార్జర్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

నిప్పులు చెరిగిన లూక్‌ వుడ్‌..
సూపర్‌ ఛార్జర్స్‌ హిట్టర్లు టామ్‌ బాంటన్‌ (0), మాథ్యూ షార్ట్‌ (8), హ్యారీ బ్రూక్‌ (0).. రాకెట్స్‌ పేసర్‌ లూక్‌ వుడ్‌ ధాటికి వణికిపోయారు. తొలి 6 బంతుల్లోనే వీరు ముగ్గురు పెవిలియన్‌కు చేరారు. వుడ్‌ ఈ ముగ్గురిని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. వుడ్‌ 20 బంతుల్లో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొడితే.. జో రూట్‌ 20 బంతుల్లో 24 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు.

తుస్సుమన్న విధ్వంసకర వీరులు..
అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్‌.. నిర్ణీత బంతుల్లో 139 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. విధ్వంసకర వీరులైన రాకెట్స్‌ బ్యాటర్లు అలెక్స్‌ హేల్స్‌ (29), డేవిడ్‌ మలాన్‌ (6), కొలిన్‌ మున్రో (15), టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ (15), జో రూట్‌ (4), సామ్‌ హెయిన్‌ (20), డేనియల్‌ సామ్స్‌ (27).. సూపర్‌ ఛార్జర్స్‌ బౌలర్లు వేన్‌ పార్నెల్‌ (3/21), రీస్‌ టాప్లే (2/20), కల్లమ్‌ పార్కిన్సన్‌ (2/29) ధాటికి తేలిపోయారు. ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసకర వీరులుగా పేరున్న రాకెట్స్‌ బ్యాటర్లు.. సూపర్‌ ఛార్జర్స్‌ నిర్ధేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలయ్యారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement