Wayne Parnell
-
లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల మెరుపు ఇన్నింగ్స్.. ఎంఐ ఖేల్ ఖతం
MI Cape Town vs Pretoria Capitals- MI Cape Town knocked out: సౌతాఫ్రికా టీ20 లీగ్-2-24లో ఎంఐ కేప్‌టౌన్ ప్రయాణం ముగిసింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేప్‌టౌన్ వేదికగా న్యూలాండ్స్‌లో క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వాన్ డర్ డసెన్(46 బంతుల్లో 60), రెకెల్టన్(35) శుభారంభం అందించగా.. మిడిలార్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది. వన్‌డౌన్ బ్యాటర్ లివింగ్‌స్టోన్(6), సామ్ కరన్(3), డెవాల్డ్ బ్రెవిస్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే చేతులెత్తేయగా.. కీరన్ పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ 33 పరుగులు సాధించాడు. మిగతవాళ్లులో ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. క్యాపిటల్స్(PC: Twitter) దంచికొట్టిన లోయర్ ఆర్డర్ ప్లేయర్లు ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎంఐ కేప్‌టౌన్ 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో కెప్టెన్ వేన్ పార్నెల్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు, ఈథన్ బాష్ రెండు, అకెర్మాన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 𝙃𝙤𝙬 𝙩𝙤 𝙚𝙣𝙙 𝙖𝙣 𝙞𝙣𝙣𝙞𝙣𝙜𝙨. 𝘼 𝙋𝙖𝙧𝙣𝙚𝙡𝙡 𝙈𝙖𝙨𝙩𝙚𝙧𝙘𝙡𝙖𝙨𝙨.#Betway #SA20 #WelcomeToIncredible #MICTvPC pic.twitter.com/3BtcGws1Fb — Betway SA20 (@SA20_League) February 3, 2024 ఇక లక్ష్య ఛేదనకు దిగిన 19.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. టాపార్డర్ విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ఆటగాళ్లు దంచికొట్టడంతో ప్రిటోరియాకు ఈ విజయం సాధ్యమైంది. ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన తునిస్ డి బ్రూయిన్ 33 బంతుల్లో 42 పరుగులతో చెలరేగగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సెనూరన్ ముత్తుస్వామి 18 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ పార్నెల్ కూడా మెరుపు ఇన్నింగ్స్(6 బంతుల్లో 12) ఆడాడు. కేప్‌టౌన్ రాతమారలేదు దీంతో నాలుగు వికెట్ల తేడాతో ఎంఐ కేప్‌టౌన్‌పై గెలిచిన ప్రిటోరియా క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. పొలార్డ్ బృందం మాత్రం గతేడాది తరహాలోనే నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఈస్టర్న్‌కేప్, పర్ల్ రాయల్స్, డర్బన్ సూపర్‌జెయింట్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. క్యాపిటల్స్‌తో పాటు సూపర్ కింగ్స్ కూడా నాలుగో స్థానం కోసం పోటీపడుతోంది. -
ఇంగ్లండ్ బౌలర్ విధ్వంసం.. 30 బంతుల్లోనే..!
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌తో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్, ఒరిజినల్స్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్ (30 బంతుల్లో 83; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. Manchester Originals have won the derby 👊 Which player impressed you the most?#TheHundred pic.twitter.com/RLudfitjnD — The Hundred (@thehundred) August 13, 2023 అతనికి లారీ ఈవాన్స్ (18 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్ 90 బంతుల్లో (వర్షం అంతరాయం కారణంగా 90 బంతుల మ్యాచ్‌గా అంపైర్లు నిర్ణయించారు) 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒరిజినల్స్ ఇన్నింగ్స్‌లో ఓవర్టన్, ఈవాన్స్తో పాటు పాల్ వాల్టర్ (22; 4 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. సూపర్ ఛార్జర్స్ బౌలర్లు రీస్ టాప్లే 3, బ్రైడన్ కార్స్, పార్కిన్సన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. The highest men's total for a Manchester Original player 🙌#TheHundred pic.twitter.com/RpRsNNOt7j — The Hundred (@thehundred) August 13, 2023 అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 90 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఒరిజినల్స్ బౌలర్లు ఉసామా మిర్ (4/19), జాషువ లిటిల్ (2/33) సూపర్ ఛార్జర్స్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. వీరికి జోష్ టంగ్ (1/25), టామ్ హార్ట్లీ (1/9), పాల్ వాల్డర్ (1/26) తోడవ్వడంతో సూపర్ఛార్జర్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (37), సైఫ్ జైబ్ (21), హ్యారీ బ్రూక్ (20) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. Well, that was incredible... 👀#TheHundred pic.twitter.com/KBXmSj7nls — The Hundred (@thehundred) August 13, 2023 -
చెలరేగిన డేవిడ్ వీస్.. తుస్సుమన్న విధ్వంసకర వీరులు
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్న్ సూపర్ ఛార్జర్స్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం సాధించాడు. అతనికి బ్రైడన్ కార్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సైఫ్ జైబ్ (21 బంతుల్లో 21; ఫోర్), ఆడమ్ హోస్ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు) జత కలవడంతో సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. Luke Wood's first 10 balls were something else! 🚀#TheHundred pic.twitter.com/SZWNvcn26V — The Hundred (@thehundred) August 10, 2023 నిప్పులు చెరిగిన లూక్ వుడ్.. సూపర్ ఛార్జర్స్ హిట్టర్లు టామ్ బాంటన్ (0), మాథ్యూ షార్ట్ (8), హ్యారీ బ్రూక్ (0).. రాకెట్స్ పేసర్ లూక్ వుడ్ ధాటికి వణికిపోయారు. తొలి 6 బంతుల్లోనే వీరు ముగ్గురు పెవిలియన్‌కు చేరారు. వుడ్ ఈ ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేశాడు. వుడ్ 20 బంతుల్లో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొడితే.. జో రూట్ 20 బంతుల్లో 24 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. David Wiese 🤝 powerful hitting Insane crowd catch incoming... #TheHundred pic.twitter.com/Gn2MWUNyNW — The Hundred (@thehundred) August 9, 2023 తుస్సుమన్న విధ్వంసకర వీరులు.. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. నిర్ణీత బంతుల్లో 139 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. విధ్వంసకర వీరులైన రాకెట్స్ బ్యాటర్లు అలెక్స్ హేల్స్ (29), డేవిడ్ మలాన్ (6), కొలిన్ మున్రో (15), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (15), జో రూట్ (4), సామ్ హెయిన్ (20), డేనియల్ సామ్స్ (27).. సూపర్ ఛార్జర్స్ బౌలర్లు వేన్ పార్నెల్ (3/21), రీస్ టాప్లే (2/20), కల్లమ్ పార్కిన్సన్ (2/29) ధాటికి తేలిపోయారు. ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర వీరులుగా పేరున్న రాకెట్స్ బ్యాటర్లు.. సూపర్ ఛార్జర్స్ నిర్ధేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలయ్యారు. 🚨JOE ROOT STRIKES FOR THE TRENT ROCKETS 🚨#TheHundred pic.twitter.com/JVcWq6nSeZ — The Hundred (@thehundred) August 9, 2023 -
నిప్పులు చెరిగిన పార్నెల్.. కుప్పకూలిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ ఎడిషన్‌లో సీయాటిల్ ఆర్కాస్ ఫ్రాంచైజీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జట్టు సీజన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో ఇవాళ (జులై 22) జరిగిన మ్యాచ్‌లో ఆర్కాస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ వేన్ పార్నెల్ నిప్పులు చెరగడంతో (5/20) తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 127 పరుగులకే కుప్పకూలింది. పార్నెల్.. సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించగా, ఆండ్రూ టై (2/15), ఇమాద్ వసీం (1/25), గానన్ (1/30) మిగతా పనిని పూర్తి చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ బ్రేవో (39) టాప్ స్కోరర్‌గా నిలువగా..డేనియల్ సామ్స్ (26), కోడీ చెట్టి (22), డుప్లెసిస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటై డెవాన్ కాన్వే (0) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (8), మిచెల్ సాంట్నర్ (2) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్.. 16 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆర్కాస్ కోల్పోయిన రెండు వికెట్లలో ఒకటి సాంట్నర్, మరొకటి మొహమ్మద్ మొహిసిన్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో ఆర్కాస్ టేబుల్ టాపర్‌గా (3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) నిలువగా.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాషింగ్టన్ ఫ్రీడం (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), ముంబై ఇండియన్స్ న్యూయార్క్ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయం), లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి.