టోర్నీ నుంచి నిష్క్రమించిన ఎంఐ కేప్‌టౌన్ (PC: Twitter/SAT20)
MI Cape Town vs Pretoria Capitals- MI Cape Town knocked out: సౌతాఫ్రికా టీ20 లీగ్-2-24లో ఎంఐ కేప్‌టౌన్ ప్రయాణం ముగిసింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.
కేప్‌టౌన్ వేదికగా న్యూలాండ్స్‌లో క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వాన్ డర్ డసెన్(46 బంతుల్లో 60), రెకెల్టన్(35) శుభారంభం అందించగా.. మిడిలార్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది.
వన్‌డౌన్ బ్యాటర్ లివింగ్‌స్టోన్(6), సామ్ కరన్(3), డెవాల్డ్ బ్రెవిస్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే చేతులెత్తేయగా.. కీరన్ పొలార్డ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ 33 పరుగులు సాధించాడు. మిగతవాళ్లులో ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.
క్యాపిటల్స్(PC: Twitter)
దంచికొట్టిన లోయర్ ఆర్డర్ ప్లేయర్లు
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎంఐ కేప్‌టౌన్ 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్ బౌలర్లలో కెప్టెన్ వేన్ పార్నెల్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు, ఈథన్ బాష్ రెండు, అకెర్మాన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
𝙃𝙤𝙬 𝙩𝙤 𝙚𝙣𝙙 𝙖𝙣 𝙞𝙣𝙣𝙞𝙣𝙜𝙨. 𝘼 𝙋𝙖𝙧𝙣𝙚𝙡𝙡 𝙈𝙖𝙨𝙩𝙚𝙧𝙘𝙡𝙖𝙨𝙨.#Betway #SA20 #WelcomeToIncredible #MICTvPC pic.twitter.com/3BtcGws1Fb
— Betway SA20 (@SA20_League) February 3, 2024
ఇక లక్ష్య ఛేదనకు దిగిన 19.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. టాపార్డర్ విఫలం కాగా.. లోయర్ ఆర్డర్‌లో ఆటగాళ్లు దంచికొట్టడంతో ప్రిటోరియాకు ఈ విజయం సాధ్యమైంది.
ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన తునిస్ డి బ్రూయిన్ 33 బంతుల్లో 42 పరుగులతో చెలరేగగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సెనూరన్ ముత్తుస్వామి 18 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ పార్నెల్ కూడా మెరుపు ఇన్నింగ్స్(6 బంతుల్లో 12) ఆడాడు.
కేప్‌టౌన్ రాతమారలేదు
దీంతో నాలుగు వికెట్ల తేడాతో ఎంఐ కేప్‌టౌన్‌పై గెలిచిన ప్రిటోరియా క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. పొలార్డ్ బృందం మాత్రం గతేడాది తరహాలోనే నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఈస్టర్న్‌కేప్, పర్ల్ రాయల్స్, డర్బన్ సూపర్‌జెయింట్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. క్యాపిటల్స్‌తో పాటు సూపర్ కింగ్స్ కూడా నాలుగో స్థానం కోసం పోటీపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment