క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. వీడియో వైరల్‌! | Watch: Harry Brook Adds Outrageous Double Relay Catch To Dismiss Jonny Bairstow, Video Viral - Sakshi
Sakshi News home page

The Hundred League: క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. వీడియో వైరల్‌!

Published Thu, Aug 24 2023 8:07 AM | Last Updated on Thu, Aug 24 2023 10:07 AM

 Harry Brook adds outrageous double relay catch - Sakshi

ది హండ్రడ్‌ లీగ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ హ్యారీ బ్రూక్ నార్తెర్న్ సూపర్‌ చార్జర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో భాగంగా మంగళవారం వెల్ష్ ఫైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీ లైన్‌ దగ్గర బ్రూక్‌ విన్యాసాలకు అందరూ ఫిదా అయిపోయారు.

ఏం జరిగిందంటే..?
వెల్ష్‌ ఫైర్‌ ఇన్నింగ్స్‌లో బ్రిడన్ కేర్స్ వేసిన 84వ బంతిని జానీ బెయిర్ స్టో మిడాఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో  బౌండరీ లైన్ వద్ద ఉన్న హ్యారీ బ్రూక్ జంప్‌ చేస్తూ ఒంటి కాలితో బంతిని అందుకున్నాడు. కానీ బ్యాలన్స్‌ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్‌ రోప్‌ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు.

అయితే మళ్లీ బ్యాలెన్స్‌ కోల్పోవడంతో బంతిని మైదానంలో విసిరేశాడు. ఈ క్రమంలో అప్పటికే బౌండరీ లైన్‌ వద్దకు చేరుకున్న మరో ఫీల్డర్‌ హోస్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన  జానీ బెయిర్ స్టో(44) బిత్తరపోయాడు. ప్రస్తతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఇదే మ్యాచ్‌లో బ్రూక్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బ్రూక్‌ కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా హండ్రెడ్‌ లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులెక్కాడు.  బ్రూక్‌ తన ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు.
చదవండి: APL 2023: అదరగొట్టిన ప్రణీత్‌.. 8 వికెట్ల తేడాతో కోస్టల్‌ రైడర్స్‌ విజయం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement